రావి చెట్టును పూజించడం వల్ల కలిగే శుభాలు

రావి చెట్టును పూజించడం వల్ల కలిగే శుభాలు


రావిచెట్టును పూజించడం హిందూమతం లో చాలా ముఖ్యమైన ఆచారం. దాదాపుగా ప్రతి దేవాలయం లోనూ రావిచెట్టు ఉంటుంది. రావి చెట్టును భగవత్స్వరూపంగా హిందువులు భావిస్తారు. మన పురాణాలలో కూడా రావి చెట్టుగురించిన ప్రస్తావన ఉంది. రావి చెట్టు విశిష్టతను తెలుసుకుందాం.


ఆయుర్వేద పరంగా

రాత్రి పూటకూడా ఆక్సిజన్ ను అందించే అతి తక్కువ చెట్లలో రావిచెట్టు ఒకటి. రావిచెట్టు అనేక రోగాలను నయం చేస్తుంది. గాలిలో ఉన్న హానికారక బాక్టీరియా ను నాశనం చేస్తుంది. రావిచెట్టు వలన అనేక ఆయుర్వేద ఉపయోగాలున్నాయి. హిందూ ధర్మం లోని ఆచారాలు ఆరోగ్యప్రధానంగా ఉంటాయి.


రావి చెట్టుపై నివసించే దేవతలు


బ్రహ్మపురాణం ప్రకారం రావిచెట్టు శ్రీమహావిష్ణుని జన్మస్థలం. అంతేకాదు శ్రీమహాలక్ష్మి కూడా రావిచెట్టు పై నివసిస్తుంది. బ్రహ్మ విష్ణు పరమేశ్వరులు తమ దివ్యాయుధాలను రావిచేట్టుపైనే ఉంచుతారని పురాణ గాథలు చెబుతున్నాయి. రావణాసురుని చెరలో ఉన్న సీతమ్మ రావి చెట్టు నీడనే ఉండేదట. సీతమ్మకు ఆశ్రయమిచ్చిన రావిచెట్టంటే హనుమంతునికి ఎంతో ఇష్టమని రామాయణం తెలుపుతుంది.


రావిచెట్టుని పూజించడం వలన కలిగే శుభాలు

రావి చెట్టుని పూజించడం వలన శనిబాధలు తొలగుతాయి. సంతాన ప్రాప్తి కలుగుతుంది. వివాహ సమస్యలు తీరుతాయి. లక్ష్మీ కటాక్షం కలుగుతుంది.


0/Post a Comment/Comments

Previous Post Next Post