నాన్న ఏడ్వడం__ఎప్పుడైనా చూశారా ? పూర్తిగా చదవండి

👨🏻

  *భావోద్వేగానికి*
  *గురి చేస్తోన్న*
 నాన్న ఏడ్వడం_
_ఎప్పుడైనా చూశారా.?_

_జీవితాంతం పిల్లల కోసం తపిస్తూ,_
_వారి అభివృద్ధి కోసం పాటుపడే వ్యక్తి తండ్రి._

_అలాంటి నాన్న గొప్పతనాన్ని వివరించే ప్రయత్నం చేశారు ప్రముఖ దర్శకుడు పూరీ జగన్నాథ్‌._

_పూరీ మ్యూజింగ్స్‌లో భాగంగా 'డాడీ' గురించి మాట్లాడారు._
_తండ్రి తన పిల్లల కోసం జీవితంలో ఎన్నో కోల్పోతాడని పేర్కొన్నారు._

_''నాన్న మన కోసం ఏం చేశాడో మనకు తెలియదు. ఎన్ని కష్టాలు పడ్డాడో తెలియదు._

నాన్న ఏడ్వడం__ఎప్పుడైనా చూశారా


 
_ఎందుకంటే.._

_నాన్న ఎవరికీ చెప్పడు. పిల్లలకి, భార్యకి అసలు చెప్పడు. అమ్మలా ప్రేమను బయటికి చూపించడం నాన్నకు రాదు._

_నాన్న ఇంటికి ఎప్పుడో వస్తాడు, వెళ్లిపోతాడు. బిజీగా ఉన్న నాన్న రాత్రిపూట ఇంటికి వచ్చి మంచం మీద ఎదుగుతున్న పిల్లల్ని చూస్తుంటాడు._

_'ఎప్పుడూ పనేనా? కాస్త ఇంటి దగ్గర ఉండొచ్చుగా..'_
_అని చిరాకు పడుతున్న అమ్మ మాటలు వింటుంటాం._

_పిల్లలు కూడా నాన్నను మిస్‌ అవుతుంటారు._
_నిజానికి *నాన్నను, నాన్నే..* మిస్‌ అవుతుంటాడు._
_పెళ్లై, పిల్లలు పుట్టగానే నాన్న జీవితం నాన్న చేతుల్లో ఉండదు._
_మనందరి కోసం నాన్న రాత్రి, పగలు పనిచేయాలి. చదువులు, సమస్యలు, బంధువులు, పండగలు, బర్త్‌డేలు, ఆసుపత్రులు.. వీటన్నింటితో నాన్న నలిగిపోతుంటాడు''_

_''ఆయనకు ఆరోగ్య సమస్యలు వస్తుంటాయి. వృద్ధాప్యం వల్ల అని పిల్లలు అనుకుంటారు. వృద్ధాప్యం ఇంకా రాలేదు.. మీ కోసం అనుక్షణం కరిగిపోతూ, కాలిపోతున్న నాన్నకి లోపల ఆరోగ్యం ఎంత దెబ్బ తింటోందో తెలియదు._
_నాన్న డాక్టర్‌ను కలిసిన విషయం కూడా మనకు తెలియదు. ఎందుకంటే.. ఆ రిపోర్ట్‌లు తీసుకుని ఇంటికి రాడు. తన పిల్లలు గొప్ప వాళ్లు అవుతారని నాన్నకు విపరీతమైన నమ్మకం._
_అందుకే అప్పులు చేసి చదివిస్తాడు. ఆఫీసుకు సెలవు పెట్టి, స్కూల్‌లో పిల్లల సీటు కోసం లైన్‌లో నిల్చుంటాడు._
 

_మీరు పరీక్ష రాస్తుంటే బయట రోడ్డు పక్కన ఎండలో నిల్చుని ఉంటాడు. పిల్లలు ఏదో సాధించేస్తారని ఆశ._
_ఎక్కడ, ఎన్ని సంతకాలు పెడతాడో మనకు తెలియదు''_

_''కొన్ని వందలసార్లు అమ్మ ఏడ్వడం చూశాం._
_కానీ, నాన్న ఏడ్వడం ఎప్పుడైనా చూశారా?.._

_నాన్న కూడా ఏడుస్తాడు._
_కానీ మీ ముందు ఏడ్వడం ఆయనకు ఇష్టం ఉండదు. ఎక్కడో ఒంటరిగా కూర్చుని ఏడుస్తాడు._

_పిల్లలు పెద్దయి, ఏదో పని చేసుకునే సమయానికి.. నాన్న అన్నీ అమ్ముకుని, అంతా ఆరిపోయి, అంతంత ఆరోగ్యంతో మిగిలిపోతాడు._

_అప్పుడే పిల్లలు నాన్నకు.. చెప్పడం మొదలుపెడతారు._
_'ఇన్నాళ్లూ వీళ్ల కోసం ఇంత చేశానా?, నేను ఎవరి కోసం బతికాను?' అనే ఆలోచనలు నాన్నకు వస్తాయి._
_'నా కోసం నేను ఏదీ దాచుకోలేదే..' అనుకుంటాడు._
 
_నిజానికి 'నేను' అనే ఆలోచన అప్పటి వరకు నాన్నకు తెలియదు''_

_'ఉన్న రెండు ఎకరాలు నాన్న పోగొట్టాడు అనుకుంటాం. ఎందుకంటే అమ్మ అలాగే చెబుతుంది కాబట్టి._
_ప్రతి కొడుకు ఏదో ఒక సమయంలో నాన్నను ఏడిపిస్తాడు._
_నాన్న గుండెలపై తంతాడు._
_అప్పటికి ఏడ్వడానికి నాన్నకు కన్నీళ్లు కూడా మిగలవు._
_అవి ఎప్పుడో ఆవిరైపోయుంటాయి._
_కొడుకు ఎంత మంచివాడు, ప్రయోజకుడైతే తండ్రిని అంత బాధ పెడతాడు._
_వాడికి ఎంత సక్సెస్‌ వస్తే.._
_అంత ఎక్కువగా తండ్రిని ఏడిపిస్తాడు._
_ఇది నిజం._

_మీకు కొడుకు పుడితే వాడి స్నేహితుల పేర్లు గుర్తుంటాయి._
_బర్త్‌డే వస్తే, పిల్లల్ని ఆహ్వానిస్తాం._

_కానీ,_
మీ నాన్న స్నేహితులు ఎవరో మీకు తెలియదు._
_అసలు మీ నాన్న పుట్టినరోజు కూడా మీకు గుర్తుండదు._

_ఎందుకంటే_
_మీ పిల్లలే మీ భవిష్యత్తని ఫీల్‌ అవుతారు._
_నాన్న మీ భవిష్యత్తు కాదు._

_కానీ.._
_నాన్నకు మీరే భవిష్యత్తు._

_మీ కోసం రిస్క్‌ తీసుకోలేక, ధైర్యం సరిపోక మీ నాన్న తన కెరీర్‌ను నాశనం చేసుకున్నాడు._
_మీ మూలంగానే మీ నాన్నలో ఉన్న ఎనర్జీ పోయింది. ఎక్స్‌ట్రార్డినరీ అవ్వాల్సిన ఎంతో మంది నాన్నలు జీవితంలో తమ పిల్లల కోసం ఆర్డినరీగా మిగిలిపోయారు..'_
*అని పూరీ చెప్పిన మాటలు భావోద్వేగానికి గురి చేసేలా ఉన్నాయి.*

0/Post a Comment/Comments

Previous Post Next Post
ddddd