అయ్యప్పస్వామి యాత్రలో పంబానదీ - విడిది వివరాలు

_*🚩అయ్యప్ప చరితం - 59 వ అధ్యాయం🚩*_

🕉☘️🕉️☘️🕉️☘️🕉️☘️🕉️☘️🕉️

అందరూ భక్తి పారవశ్యంతో పరవశించిపోతూ *‘‘అయ్యప్ప స్వామికి జయము ! హరిహరపుత్రుడు , ధర్మశాస్తా , మణికంఠునికి జయము ! జయము !’’* అంటూ జయజయధ్వానాలు కావించారు !
ఉదయనుడి ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి. ప్రజాకంటకుడైన ఆ దుండగుడు మరణించడంతో వాతావరణం ప్రశాంతంగా మారింది ! చల్లని గాలులు వీస్తూ హాయిని కలిగించాయి హృదయాలకు ! ఉదయనుడి మరణంతో బాధా భయాలు తొలగిపోయి తేలిక పడిన హృదయాలతో అందరూ అయ్యప్ప చుట్టూ చేరి స్తుతించారు.


అయ్యప్పస్వామి యాత్రలో పంబానదీ - విడిది వివరాలు
*‘‘పాహి పాహి అయ్యప్పా ! శరణు శరణు అయ్యప్పా !
భక్తజనప్రియ అయ్యప్పా ! శరణు శరణు అయ్యప్పా !
కలియుగ వరదా అయ్యప్పా ! శరణు శరణు అయ్యప్పా !
పరమ కృపాళో అయ్యప్పా ! శరణు శరణు అయ్యప్పా !
అందరి వైపు ప్రసన్నంగా చూస్తూ అక్కడనుండి పంబానదివైపు దారితీశాడు అయ్యప్ప !


పంబానదీ - విడిది


అయ్యప్ప పంబానది తీరాన్ని చేరి పరివారంతో అక్కడ విడిది చేశాడు ! ఆ ఒడ్డునే డేరాలు వేసి అయ్యప్ప కూర్చోవడానికి ఆసనం వేశారు ! పంబానది వాళ్ళను చూసి సంతోషంతో పరవళ్లు త్రొక్కుతూ ప్రవహిస్తున్నది ! *‘‘గంగతో సమానమైన ఈ నది ఒడ్డున పితరులకు పిండ ప్రదానాలు చేయడం , తర్పణాలు విడవడంవల్ల ఏడు తరాలవారికి సద్గతులు లభిస్తాయి ! మీరందరూ కూడా మరణించిన మీ పెద్దలనుద్దేశించి ఈ నదీ జలాలలో తర్పణాలు అర్పించండి !’’* అని అయ్యప్ప చెప్పడంతో పరివారంలోని వారందరూ భక్తిపూర్వకంగా తర్పణాలు అర్పించారు ! అయ్యప్ప చెప్పడంతో యుద్ధంలో మరణించిన యోధులకు తర్పణాలు విడిచారు .

అయ్యప్ప అక్కడినుండి పంబల రాజుకు , తన తల్లిదండ్రులకు వెంటనే తన విడిదికి రావలసిందిగా దూతలతో వర్తమానం పంపించాడు ! వార్త అందిన వెంటనే వారు ఆనందోత్సాహాలతో బయలుదేరి పంబానదీ తీరాన్ని చేరుకున్నారు.

*‘‘కుమారా ! అయ్యప్ప ! నిన్ను కన్న మేము ధన్యులమైనాము !పంబలరాజ్యం , పాండ్య వంశం ధన్యమైనాయి. కన్నుల కరువు తీరా నిన్ను చూసే భాగ్యాన్ని మరొకసారి మాకు అనుగ్రహించావా తండ్రీ ! అంతకంటే మాకింకేం కావాలి ? నీకు సదా కృతజ్ఞులమై ఉంటాము’’* చేతులు జోడించి అంటున్న వాళ్లను వారించాడు అయ్యప్ప .

*‘‘మీరు పెద్దలు , నాకు వందనీయులు ! నాకు కృతజ్ఞతలు చెప్పవలసిన అవసరం లేదు ! నేను వచ్చిన కార్యం పూర్తయింది ! ఇక నేను నా నివాసానికి బయలుదేరవలసిన సమయం ఆసన్నమైంది ! శబరిగిరి మీద నా నివాసానికి ప్రయాణం సాగించనున్న నా వెంట మీరు కూడా అంతవరకు రావచ్చును’’* అంటూ చెప్పాడు అయ్యప్ప అందరినీ ఉద్దేశించి ! ఆ మాటలు అందరిలో ఆనందోత్సాహాలు కలిగించాయి.

*‘‘అయ్యప్పస్వామీ ! మీ వెంట మేమూ గిరిమీదకు వచ్చేందుకు అవకాశం ప్రసాదించావు ! ఎంతటి కరుణామయుడివి తండ్రీ !’’* అంటూ పరివారంలోని వారందరూ , పంబలరాజు , పాండ్యరాజు , జయవర్థనుడు , ఆయన భార్య అయ్యప్ప వెంట నడుస్తుండగా తాము వెనకగా అనుసరించారు !
పంబా నదిని దాటి శబరిగిరి వైపు దారితీశాడు అయ్యప్ప.


మందిర పునర్నిర్మాణం  

అయ్యప్ప ఆలయ ప్రవేశం
*‘‘సైనికులారా ! మీ ఆయుధాలను ఈ అశ్వత్థవృక్షం దగ్గర వుంచి , అందరూ భగవంతునిపై మనస్సు లగ్నం చేసి ముందుకు పదండి ! అదుగో ! ఆ కనిపిస్తున్న ఆలయమే మణికంఠుని కోసం విశ్వకర్మ , పరశురాములవారు నిర్మించినది’’* కొంతదూరంలో కనిపిస్తున్న ఆలయంవైపు చూపిస్తూ చెప్పాడు అయ్యప్ప !
*‘‘అలాగే స్వామి’’* అంటూ అందరూ ఆయుధాలు , అశ్వత్థ (రావిచెట్టు) వృక్షం దగ్గర భద్రపరిచి *‘స్వామియే శరణం అయ్యప్ప’* అని శరణుఘోష గొంతెత్తి పాడుతూ ముందుకు సాగారు !
అయ్యప్ప ముందు నడవగా అందరూ ఆలయాన్ని సమీపించారు ! ఉదయనుడి దాడులవల్ల ఆలయం కొంత దెబ్బతిన్నది ! పూజారులు అయ్యప్ప విగ్రహానికి పూజార్చనలు జరుపుతున్నా భక్తుల రాకపోకలు ఆగిపోయాయి ! ఆ ప్రాంతమంతా నిశ్శబ్ద నీరవం తాండవమాడుతూ ఉన్నది.

 అక్కడ కొంతకాలంగా !
అయ్యప్ప పరివార సమేతంగా అక్కడకు చేరడంతో పరిసరాలలో చైతన్యం వచ్చింది ! ఎండిపోయిన చెట్లు చిగురించి ప్రకృతి కళకళలాడింది ! అయ్యప్పకు స్వాగతం చెబుతున్నట్లు జల జలమంటూ పుష్పవృష్టి కురిసింది స్వామిమీద.


అయ్యప్ప చుట్టూరా ఒకసారి నిశితంగా పరిశీలించాడు ! ఆయన దృష్టి ఆలయం మీద కేంద్రీకృతమైంది ! అందరూ సంభ్రమాశ్చర్యాలతో చూస్తుండగా ఆలయం పునర్నిర్మింపబడి పూర్వపు శోభతో కలకలలాడింది ! పరశురాములవారు ప్రతిష్ఠించిన విగ్రహం యధాతథంగా దర్శనమిచ్చింది ! ఆయన నియమించిన పూజారుల వంశస్థులు పరుగు పరుగున వచ్చి అయ్యప్పకు స్వాగతం పలికారు.

పద్ధెనిమిది మెట్లను , చిన్ముద్రా , అభయముద్రలు చూపుతూ పట్టుబంధంలో పీఠంమీద ఆసీనమై వున్న స్వామి విగ్రహాన్ని చూస్తూ అందరూ భక్తి పారవశ్యంతో మైమరచిపోయారు.


🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

Sabarimala Ayyappa Swamy

  అయ్యప్ప అంటే ఎవరు?    
 అయ్యప్పస్వామి మాలాధారనరోజు గుడికి తీసుకువెళ్ళవలసిన వస్తువులు 
శబరిమల ఆలయం ఆలయం పుట్టుక గురించి సoక్షిప్తoగా
శబరిమల యాత్ర విశేషాలు
🕉️శబరిమల అయ్యప్ప స్వామి వారి మండల కాల దీక్ష నియమాలు🕉️
అయ్యప్ప స్వామి మండల కాల దీక్ష🚩🕉️
అయ్యప్ప స్వామి వారి చిన్ముద్రలో నిగూఢమైన అర్థం ఏమిటి ?
అయ్యప్ప స్వామి ధ్యాన శ్లోకాలు
అయ్యప్ప స్వామి 18 మెట్ల కథ
అయ్యప్పస్వామి అభిషేకాలు - వాటి ఫలితాలు
అయ్యప్పస్వామి దీక్ష లొ వ్రత నియమాలు గురు ప్రార్థన
శ్రీ అయ్యప్ప స్వామివారి అష్టోత్తర శతనామావళి
  అయ్యప్ప స్వామి వాహనం చిరుతపులి ఎవరో తెలుసా? అయ్యప్ప వృత్తాంతం  
అయ్యప్పస్వామి దీక్షలొ కర్మేంద్రియాలు జ్ఞానేంద్రియాల విషయంగా పాటించవలసిన నియమాలు
శబరిమల‌ అయ్యప్పస్వామి ఇరుముడి ప్రాశస్త్యం ఇరుముడి వివరణ
అయ్యప్పస్వామి యాత్రలో ఇరుముడి కట్టే విధానం
అయ్యప్పస్వామి యాత్రలో శీరంగుత్తి వివరాలు
అయ్యప్పస్వామి యాత్రలో ఆర్యన్‌గావ్ | అచ్చన్ కోవిల్ | ఎరుమేలి | శబరిమల
అయ్యప్పస్వామి యాత్రలో కాళైకట్టె వివరాలు
అయ్యప్పస్వామి యాత్రలో పంబానదీ - విడిది వివరాలు
మాలికాపురత్తమ్మ ఆలయం శబరిమలై పూర్తి వివరాలు
శబరిమలలొని కాంతిమలలో జ్యోతి దర్శనం
అయ్యప్ప దీక్ష విరమణ
కార్తీక పురాణ శ్రవణం వల్ల కలిగే ఫలితం ఏమిటి
  అయ్యప్ప అంటే ఎవరు? దీక్షా సంబంధమైన ఇతర ధర్మ సందేహాలకు ఇక్కడ క్లుప్తంగా వివరణ  
గాయత్రీ మంత్రం రహస్యం
కొబ్బరికాయ చెడిపోతే అపచారమా ? అనర్థమా ?
కార్తీక మాసంలో పాటించవలసిన నియమాలు

0/Post a Comment/Comments

Previous Post Next Post