లక్ష్మీ కటాక్షం కొరకు రాశి మంత్రాలు..!!*

*లక్ష్మీ కటాక్షం కొరకు రాశి మంత్రాలు..!!* 

కొందరికి తమ జన్మరాశి తెలియక పోవచ్చును . 

వారి సౌకర్యార్థం, వారి పేరులోని మొదటి అక్షరాన్ని బట్టి కూడా ఏ విధమైన మంత్రజపం చేసుకోవచ్చునన్న విషయం సూచించబడింది.

లక్ష్మీ ఉపాసన అనే గ్రంథంలో ఏయే రాశులలో పుట్టిన జాతకులు లక్ష్మీ కటాక్షం కోసం, 
ఏ మంత్ర జపం చేయాలన్న విషయం వివరింపబడింది. 
శ్రీ మహాలక్ష్మిదేవి అనుగ్రహసిద్ధి కోసం ఆయా రాశులలో పుట్టినవారు చేయాల్సిన మంత్ర జపం నిర్దేశింపబడింది.

లక్ష్మీ కటాక్షం కొరకు రాశి మంత్రాలుగురుముఖతః ఉపదేశం పొందిన మంత్రాలు వెంటనే ఫలితాలను చూపిస్తే, 
భక్తి శ్రద్ధలతో చేసే మంత్రజపం కూడా తప్పక మంచి ఫలితాలనిస్తుంది. 
మన రాశికి, లేక మన పేరుకు అనువైన మంత్రాన్ని జపిస్తే, తప్పక ఆ మహాలక్ష్మీదేవి అనుగ్రహానికి పాత్రులవుతాం. 

అందుచేత రాశిని బట్టి ఈ క్రింది మంత్రాలను జపించే వారికి అష్టైశ్వర్యాలు, సుఖసంతోషాలు చేకూరుతాయి.

ఈ మంత్రాలు బీజాక్షర సమన్వితాలు.
అందుచేత ఈ మంత్రాలను గురుముఖముగా తెలుసుకొని అభ్యసించిన మరీ మంచిది.
మహాలక్ష్మీదేవి పరిపూర్ణ కటాక్షం కోసం 
ఈ మంత్రాలను పఠించాలి. 

ఇంకా మంత్రాలను త్రిసంధ్యలలో పఠిస్తే, ధ్యానమావాహనాది షోడశోపచారపూజలు చేసిన ఫలితం కలుగుతుంది.

1.మేషరాశి.💐
మహా లక్ష్మి కరుణా కటాక్షాలు పొందడానికి 
"ఓం ఐం క్లీం సౌ:" అనే మంత్రాన్ని జపిస్తూ ఉండాలి. కేవలం శుక్రవారమే కాకుండా.. 
ఎప్పుడు వీలైతే అప్పుడు జపించడం వల్ల మంచి ఫలితాలు పొందవచ్చును .

2. వృషభ రాశి.💐
లక్ష్మీ దేవి అనుగ్రహం పొందడానికి వృషభ రాశి వాళ్లు 
"ఓం ఐం క్లీం శ్రీః" అనే మంత్రాన్ని జపించాలి.

3. మిథునరాశి..💐
తమ ఇంట సిరి సంపదలు కురవాలంటే.. 
మిథునరాశి వాళ్లు జపించాల్సిన మంత్రం 
"ఓం క్లీం ఐం సౌ:"

4. కర్కాటక రాశి వాళ్లు.💐
లక్ష్మీదేవి కటాక్షం పొందాలంటే "ఓం ఐం క్లీం శ్రీః" అని భక్తితో మంత్ర జంపం చేయాలి.

5. సింహరాశి.💐
లక్ష్మీదేవి అనుగ్రహం పొందాలంటే.. సింహరాశి వాళ్లు 
"ఓం హ్రీం ఐం సౌ:" అనే మంత్రాన్ని మనసులో ధ్యానించాలి.

6. కన్యా రాశి వాళ్లు.💐
మహా లక్ష్మీ కటాక్షం పొందడానికి.. 
ఆ తల్లిని పూజించేటప్పుడు "ఓం శ్రీం ఐం సౌ:" అనే మంత్రాన్ని జపిస్తూ ఉండాలి. 
ఎప్పుడు వీలైతే అప్పుడు లక్ష్మీ నామస్మరణ చేయడం వల్ల ఆ తల్లి కరుణా కటాక్షాలు పొందవచ్చు.

7. తులారాశి వాళ్లు.💐
లక్ష్మీదేవి అనుగ్రహం పొందడానికి "ఓం హ్రీం క్లీం శ్రీం:" అనే మంత్రాన్ని ధ్యానిస్తూ ఉండాలి.

8. వృశ్చిక రాశి.💐
లక్ష్మీ దేవి అనుగ్రహం ఉన్నప్పుడు ఇంట్లో సకల సంపదలు, ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి. 
కాబట్టి ఆ అమ్మవారిని ప్రసన్నం చేసుకోవడానికి వృశ్చికరాశి వాళ్లు "ఓం ఐం క్లీం సౌ:" అనే మంత్రం జపించాలి.

9. ధనుస్సు రాశి.💐
లక్ష్మీ దేవి అనుగ్రహ సిద్ధి పొందాలంటే.. ధనుస్సు రాశి వాళ్లు "ఓం హ్రీం క్లీం సౌ:" అనే మంత్రం ధ్యానించాలి.

10. మకర రాశి.💐
లక్ష్మీ మంత్రం జంపిచడం వల్ల ఆ తల్లి కరుణా కటాక్షాలు సిద్ధిస్తాయి. 
కాబట్టి మీది మకరరాశి అయితే.. 
మీరు "ఓం ఐం క్లీం హ్రీం శ్రీం సౌ:" అనే మంత్రం జపించాలి.

11. కుంభ రాశి.💐
 లక్షీ దేవి అనుగ్రహం పొందడానికి" ఓం హ్రీం ఐం క్లీం శ్రీం" అనే మంత్రాన్ని ధ్యానించాలి.

12. మీనరాశి.💐
మనసు ప్రశాంతంగా, దైవంపై ఏకాగ్రత పెట్టి మీనరాశి వాళ్లు ఆ మహాలక్ష్మీని ధ్యానించాలి. 
ఆ సమయంలో "ఓం హ్రీం క్లీం సౌ:" అనే మంత్రాన్ని జపించడం వల్ల అమ్మవారి అనుగ్రహం పొందవచ్చు.

ఓం శ్రీ మహాలక్ష్మీ దేవ్యై నమః..!!🙏

 *సర్వే జనా సుఖినోభవంతు..!!* 💐

  💐శ్రీ మాత్రే నమః💐

0/Post a Comment/Comments

Previous Post Next Post