దంపతుల తాంబూల నోము పూర్తి కథ

దంపతుల తాంబూల నోము పూర్తి కథ 

             పూర్వం గంగానదీ తీరమున విప్రవతి అనబడే బ్రాహ్మణ అగ్రహారం వుండేది.  ఆ గ్రామంలోని బ్రాహ్మణ కుటుంబాలలో గోపాల శర్మ అనబడే విప్రిత్తముని కుటుంబము పెద్ద కుటుంబము.  ఆయనకు ముగ్గురు కుమారులు పెద్ద వారిద్దరికీ వివాహాలు అయి చక్కగా జీవిస్తున్నారు.  మూడవవానికి కూడా వివాహం చేశాడు.  అదేమీ ప్రార్బ్ధమోగాని ఆ కోడలు కాపురానికి రాగానే అందరితోను చీటికి మాటికి గొడవలు జరుగుతుండేవి.  అయినవారు కానివారు ఆమె మీద నిందలు మోపి అనరాని మాటలతో దుర్భాశలాడుతుండేవారు.  వారందరితో ఎంతో మంచిగా మసలుకోవాలన్న ఆమెకు సాధ్యమయ్యేది  కాదు.  

దంపతుల తాంబూల నోము పూర్తి కథ


           కాలం గడచి పోతున్నదేకాని పరిస్థితులలో ఎటువంటి మార్పు రాకపోగా నిందలు నిష్టూరాలు ఎక్కువై పోయాయి.  అందుకు తమవల్ల దోషమేమితో తెలియని ఆ చిన్న కోడలు వారందరి మధ్య మసలుకోలేక ఒకనాటి రాత్రి ఊరూ పోలిపెరలోని శివాలయానికి వెళ్లి గోడుగోడున విలపించాసాగింది.  తనతప్పేమిటి ఈ ముప్పు తీరాలంటే ఏమి చెయ్యాలి, చావే నాకు శరణ్యమా!  అని అమాయకంగా ప్రశ్నించింది.  ఆమె ఆవేదనకు జాలిపడ్డ శివుడు సాక్షాత్కరించి బిడ్డా నీ వలన దోషమేమిలేదు.  నేవెంత సౌమ్యంగా వినయవిధేయతలతో మసలుకున్నా చులకనగా హేళనగా నీ జీవితమూ సాగుతుంది.  ఇందుకు గల కారణము గత జన్మలో దంపతతాంబూలాల నోము నోచి మధ్యలో ఆపివేశావు.  ఆ కారణం చేత స్త్రీలకు పురుషులకు నీపట్ల ద్వేశాభావాలు కలుగుతున్నది.  ఇది తోలగాలంటే నీవు నీ ఇంటికి పోయి దంపతతాంబూలాల నోము నోచుకో ఈ నోముకారనముగా నీ చుట్తో గల ఇరుగు పొరుగు వారు నీ ఇంటివారు మేట్టినిన్తివారు నీమీద ప్రేమానురాగాలు కలిగి నిన్ను ఆదరిస్తారు.  అని ప్రభోదించాడు.  


              ఆమె ఆ ప్రకారం ఇంటికి వెళ్లి దంపతతాంబూలాల నోము నోచుకోని అయినవారందరిలో గౌరవమర్యాదలు మన్ననలతో హాయిగా జీవిస్తారు. 

ఉద్యాపన: 

పార్వతీ పరమేశ్వరులకు పీటం ఏర్పాటు చేసి శతనామావలితో ఆ ఆదిదంపతులను ఆరాధించాలి.  గుణవంతులైన దంపతులను ఆహ్వానించి వాళ్లకు తలంటి నీళ్ళు పోసి నూతన వస్త్రాలు కట్టబెట్టి పంచ భక్ష్య పరమాన్నాలతో భోజనాలు ఆరగిమ్పజేసి దక్షిణ తాంబూలాలతో గౌరవించి వారికి పాదాభివందనం చేసి వాళ్ళ ఆశీస్సులు తీసుకోవాలి.  ఇలా పదిహేను వారాలు చేసి ఆఖరున అన్న సంతర్పణ చేయాలి.  ఇలా చేయడము వలన సాతివారిలో తోటివారిలో మేటిగా గుర్తిమ్పబడి గౌరవ మర్యాదలు గల జీవితాన్ని గడపగలుగుతారు.  

0/Post a Comment/Comments

Previous Post Next Post
ddddd