Brahma Murari Surarchita Lingam Lyrics Song | Lingashtakam | Shiva Stuti | Hara Om Namah Shivaya

 Brahma Murari Surarchita Lingam Lyrics Song | Lingashtakam | Shiva Stuti | Hara Om Namah


బ్రహ్మ మురారి సురార్చిత లింగం పూర్తి పాట | లింగాష్టకం | శివ స్తుతి | హర ఓం నమః శివాయ




బ్రహ్మ మురారి సురార్చిత లింగం పూర్తి పాట | లింగాష్టకం | శివ స్తుతి | హర ఓం నమః శివాయ


"బ్రహ్మ మురారి సురార్చిత లింగం పూర్తి పాట | లింగాష్టకం | శివ స్తుతి | హర ఓం నమః శివాయ" Song Info

Note
పాటలో “పరాత్పరం” అనే పదం దగ్గర “పరమపదం” అని పలకడం జరిగింది
దీని అర్ధం
లింగాష్టకమను ఈ పుణ్య ప్రదమైన 8 శ్లోకములను శివలింగం దగ్గర చదువువారు శివలోకమును పొంది శివానందమును అనుభవించెదరు.

Lingashtakam Lyrics In Telugu

బ్రహ్మమురారి సురార్చిత లింగం
నిర్మలభాసిత శోభిత లింగమ్
జన్మజ దుఃఖ వినాశక లింగం
తత్ప్రనమామి సదాశివ లింగమ్ || 1 ||

దేవముని ప్రవరార్చిత లింగం
కామదహన కరుణాకర లింగమ్
రావణ దర్ప వినాశక లింగం
తత్ప్రనమామి సదాశివ లింగమ్ || 2 ||



సర్వ సుగంధ సులేపిత లింగం
బుద్ధి వివర్ధన కారణ లింగమ్
సిద్ధ సురాసుర వందిత లింగం
తత్ప్రనమామి సదాశివ లింగమ్ || 3 ||

కనక మహామణి భూషిత లింగం
ఫణిపతి వేష్టిత శోభిత లింగమ్
దక్షసుయజ్ఞ వినాశన లింగం
తత్ప్రనమామి సదాశివ లింగమ్ || 4 ||

కుంకుమ చందన లేపిత లింగం
పంకజ హార సుశోభిత లింగమ్
సంచిత పాప వినాశన లింగం
తత్ప్రనమామి సదాశివ లింగమ్ || 5 ||



దేవగణార్చిత సేవిత లింగం
భావై-ర్భక్తిభిరేవ చ లింగమ్
దినకరకోటి ప్రభాకర లింగం
తత్ప్రనమామి సదాశివ లింగం || 6 ||

అష్టదళో పరివేష్టిత లింగం
సర్వసముద్భవ కారణ లింగమ్
అష్టదరిద్ర వినాశన లింగం
తత్ప్రనమామి సదాశివ లింగమ్ || 7 ||

సురగురు సురవర పూజిత లింగం
సురవన పుష్ప సదార్చిత లింగమ్
‘పరాత్పరం’ పరమాత్మక లింగం ( “పరమపదం ” )
తత్ప్రనమామి సదాశివ లింగమ్ || 8 ||

"బ్రహ్మ మురారి సురార్చిత లింగం పూర్తి పాట | లింగాష్టకం | శివ స్తుతి | హర ఓం నమః శివాయ" Song Video

Note : పాటలో “పరాత్పరం” అనే పదం దగ్గర “పరమపదం” అని పలకడం జరిగింది దీని అర్ధం :

లింగాష్టకమిదం పుణ్యం యః పఠేత్శివ సన్నిధౌ
శివలోకమవాప్నోతి శివేన సహ మోదతే

గమనిక – పాటలో “పరాత్పరం” అనే పదం దగ్గర “పరమపదం” అని పలకడం జరిగింది

పైన 8 శ్లోకాల అర్ధం

(1) ఏ లింగమును బ్రహ్మ , విష్ణు మొదలగు సురులు అర్పించుదురో , ఏ లింగము నిర్మలత్వము అను శోభతో కూడి ఉన్నదో , ఏ లింగము జన్మమునకు ముడిపడి యున్న దుఃఖములను నశింపజేయగలదో , అటువంటి సదాశివలింగమునకు నేను నమస్కరిస్తున్నాను.

(2) ఏ లింగమును దేవతల యొక్క, ఋషుల యొక్క తరతరాలు అర్పించుచున్నాయో , ఏ లింగము కోరికలను కాల్చివేసి కరుణను కలిగి యున్నదో, ఏ లింగము రావణాసురుని గర్వము నాశనము చేసిందో, అటువంటి సదాశివలింగమునకు నేను నమస్కరిస్తున్నాను.

(3) ఏ లింగము అన్ని రకముల సుగంధములచే అద్దబడి ఉన్నదో , ఏ లింగము బుద్ది వికాసమునకు కారణం అయి ఉందో , ఏ లింగము సిద్దులు , దేవతలు , అసురులచే వందనము చేయబడుచున్నదో , అటువంటి సదాశివలింగమునకు నేను నమస్కరిస్తున్నాను.

(4) ఏ లింగము బంగారము మరియు గొప్ప మణులచే అలంకరింపబడి ఉన్నదో , ఏ లింగము సర్పరాజముచే చుట్టుకొనబడి అలంకరింపబడి ఉన్నదో , ఏ లింగము దక్ష యజ్ఞమును నాశనము చేసిందో , అటువంటి సదాశివమునకు నేను నమస్కరిస్తున్నాను.


 
(5) ఏ లింగము కుంకుమ మరియు గంధముతో అద్దబడి ఉన్నాడో , ఏ లింగము తామర పువ్వుల హారముతో అలంకరింపబడి ఉన్నాడో , ఏ లింగము సంపాదించిన పాపరాశిని నాశనము చేయగలదో , అటువంటి సదాశివలింగమునకు నేను నమస్కరిస్తున్నాను.

(6) ఏ లింగమును దేవగణములచే భావముతో , భక్తితో పూజింపబడుచూ సేవింపబడుచూ ఉన్నదో , ఏ లింగము కోటిసూర్య సమానమైన శోభతో ఉన్నదో , అటువంటి సదాశివలింగమునకు నేను నమస్కరిస్తున్నాను.

(7) ఏ లింగము 8 దళములను చుట్టూ కలిగి ఉన్నదో , ఏ లింగము సమస్త సృష్టికి కారణమై ఉన్నదో , ఏ లింగము 8 రకాల దరిద్రములను నాశనం చేయగలదో అటువంటి సదాశివలింగమునకు నేను నమస్కరిస్తున్నాను.

(8) ఏ లింగము సురుల యొక్క “బృహస్పతి” మరియు ఉత్తమము అయిన సురులచే పూజింపబడుచున్నదో, ఏ లింగము దేవతల పూదోటయందున్న పువ్వులచే అర్చన చేయబడుచున్నదో , ఏ లింగము ఉత్తమం అయినదానికన్నా ఉన్నతమైన పరమాత్మ స్థాయిలో ఉన్నదో , అటువంటి సదాశివలింగమునకు నేను నమస్కరిస్తున్నాను.

లింగాష్టకమిదం పుణ్యం యః పఠేత్శివ సన్నిధౌ
శివలోకమవాప్నోతి శివేన సహ మోదతే

0/Post a Comment/Comments

Previous Post Next Post