రథసప్తమి నోము పూర్తి కథ
పూర్వకాలంలో ఒకానొక మహారాజుకు లేక లేక ఒక కూతురు జన్మించింది. ఆమెను అల్లారు ముద్దుగా పెంచుకుంటున్నాడు. కాని ఆమె పుట్టుక కారణంగా రాజ్యంలో కొన్ని కలతలు ఏర్పడుతున్దేవి. మహారాజు ఏ పని తలపెట్టినా జరిగేదికాడు. ఇందుకు విఙులను పిలిచి శాంతి చేయించాలని నిర్ణయించారు. రాజ్యంలోగల ప్రజ్ఞావంతులు అయిన విప్రులను పిలిపించి అన్ని విషయాలను వివరించాడు. ఈ దుస్థితి తొలగే మార్గం ఏదైనా చెప్పమని అడిగాడు. ఆ విప్రోత్తములందరూ ఒకటై ఆలోచించారు.
రాజా ఈమె గత జన్మలో వితంతువు అంతకు ముందు జన్మలో రధకారుని భార్య రధకారుడు చేసే ప్రతి పనిని విమర్శించి అతని పనులకు అడ్డుతగులుతుండేది. అందువల్ల పై జన్మలో విధవరాలైంది. తన కుటుంబ పోషణ భారం ఆమెదేకావడం వల్ల తప్పనిసరై వ్యభిచారం చేసి సంసారం సాగించింది. వ్యభిచారం కారణంగా అనేక దుష్కృత్యాల పాలైంది. ఆమె రథసప్తమి నోమును నోస్తే తమకు ఈ గండాలుండవు. ఆమెకు గల గతజన్మ పాతకాన్ని రూపు మాసి పోతాయి అని చెప్పారు.
వేద జ్ఞానుల భూతభవిష్యత్ వర్తమానాలు తెలిసిన వేత్తలు నాకు నారాజ్యానికి గల సిరిసంపదలు మీరే, కనుక నాయందు నా పుత్రిక యందు పరిపూర్ణ ప్రేమాభిమానాలు కలుగచేసి నన్ను నా రాజ్యాన్ని కాపాదేతందుకు మీరందరూ రథసప్తమి నోమును నాకుమార్తేచేతనో యుంచండి వ్యయభారాలకు వేరవకండి అన్నాడు రాజు. అందుకు వారందరూ ప్రభువు ఆజ్ఞ ప్రకారము రాజకుమార్తె చేత రథసప్తమి నోమును నోయించారు. అరిష్టాలను తొలగిపోయాయి. సుఖ శాంతులతో జీవితాన్ని గడిపారు.
ఉద్యాపన:
సూర్యభగవానుడు మన కర్మలకు సాక్షి ప్రతి రోజు సూర్యోదయ కాలములో ఆ మహానీయునకు నమస్కరించుకుని మనం మన నిత్య కార్య క్రమాలకు పూజుకోవారి.