ఆముదం చెట్టు -మానవుల పాలిట అమృత కలశం
కీళ్లనొప్పులు – ఆముదం ఆకుల పైనా నువ్వులనూనె రాసి కాస్త వేడిచేసి నొప్పి ఉన్నచోట కట్టుకట్టాలి. ఇలా తరచూ చేయడం వళ్ళ నొప్పి నుండి తొందరగా ఉపశమనం కలుగుతుంది.
మొలల సమస్య – కర్పూరం మరియు కొన్ని ఆముదం ఆకులు కలిపి దంచి మెత్తని పేస్ట్ ల తయారుచేయాలి. దీనిని మలద్వారం దగ్గర పూయాలి లేదా కట్టుకట్టాలి. ఇలా తరచు చేయడం వల్ల మొలల సమస్య తగ్గుముఖం పడుతుంది.
పచ్చకామెర్లు – ఆముదం లేత ఆకులు, కొన్ని వెల్లుల్లి కలిపి నూరి రోజు 2 సార్లు తీసుకుంటుంటే పచ్చకామెర్లు సమస్యను తొందరగా అరికట్టవచ్చు.
పాల వృద్ధికి – బాలింతలలో పాలు తక్కువగా ఉంటే వారి స్థనాలపైన ఆముదం పూసి, ఆముదం ఆకులను వేడిచేసి కాపుడం పెట్టడం వల్ల పాల వృద్ధి బాగా పెరుగుతుంది .
పులిపిరుల సమస్య – పులిపిరులు ఉన్నవారు తరుచు వాటిపైన ఆముదం పూస్తూ ఉంటే కొద్దిరోజులకు అవి రాలిపోతాయి.
సయాటికా నొప్పి – 4, 5 ఆముదం గింజలను నలగొట్టి పాలలో వేసి మరిగించి వడగట్టి తాగడం వల్ల నడుం నొప్పి, సయాటికా బాధించదు.
మలబద్దకం – ఒక గ్లాస్ వేడి పాలలో 1స్పూన్ ఆముదం ను కలిపి రాత్రిపూట తీసుకుంటుంటే ఈ సమస్య తొందరగా తగ్గుతుంది.
ఋతు సమయంలో వచ్ఛే నొప్పి తగ్గడానికి ఆముదం ఆకుల్ని వేడిచేసి పొత్తికడుపుపై కట్టుకట్టాలి. ఇలా తరచు చేయడం వల్ల నొప్పి తగ్గిపోతుంది.
డ్రై స్కిన్ ఉన్నవారు 1/2 కప్ ఆముదం, కర్పూర థైలం ,మరియు బాదాం నూనె కలిపి మర్దన చేస్తూ ఉంటే చర్మం మృదువుగా కూడా తయారవుతుంది.
జుట్టు కుదుళ్ళకి ఆముదం పట్టించడం వల్ల జుట్టు మృదువుగా, ఒత్తుగా తయారవుతుంది. అంతేకాకుండా చుండ్రు, జుట్టు చిట్లడం సమస్య తగ్గిపోతుంది.
రాత్రి పడుకునే ముందు కాళ్ళకి, చేతులకి ఆముదం రాసుకోవడం వల్ల మృదువుగా తయారవుతాయి.
ఆముదం తో ఒంటికి మసాజ్ చేసుకొని, వేడి నీటితో స్నానము చేయడం వల్ల మంచి నిద్ర పడుతుంది.
మలబద్దకం కోసం ఎక్కువరోజులు ఆముదం వాడటం వల్ల మలబద్దకం పెరిగే అవకాశం ఉంది.
గర్భవతులు మొదటి 3-4 నెలలు ఆముదం వాడకూడదు. అబార్షన్ అయ్యే ప్రమాదం ఉంది.