కాలిన గాయాలకు వంటింటి వైద్యం

కాలిన గాయాలకు వంటింటి వైద్యం

తేనె – తేనె యాంటీ బాక్టీరియల్ గుణాలను కలిగి ఉంటుంది. కాలిన గాయాలపై తేనె పూయడం వలన మంట తగ్గి చల్లగా మారుతుంది . గాయం లోపలి భాగాన్ని కూడా తొందరగా  కూడా    మాన్పుతుంది. ఇన్ఫెక్షన్లు రాకుండా కాపాడుతుంది .

పుదీనా ఆకులూ – పుదీనా ఆకులను  మెత్తని పేస్ట్ ల తయారుచేసి కాలిన గాయాలపై లేపనం లాగా పూయాలి. ఇది ఆరిన తరువాత  చల్లని నీళ్లు పోసి   కడిగేయలి. బచ్చలి కూర ఆకులతో కూడా ఇలా చేయడం వల్ల మంచి గుణము  ఉంటుంది.

అలోవెరా జెల్ – అలోవెరా జెల్ను కాలిన చోట రాసి కొద్ది సమయం  అలాగే ఉంచాలి. ఈ విధంగా  రాయటం  వల్ల మంట తగ్గి గాయం త్వరగా తగ్గుతుంది. ఆవిధంగా  డెడ్ స్కిన్ సెల్స్ ని కూడా తొలగిస్తుంది.

టమాటో – టమాటోను మెత్తని పేస్ట్ ల లాగా చేసి గాయాలపైనా పూయడం వల్ల గాయాలను త్వరగా మాన్పడమే కాకుండా మచ్చలు లేకుండా చేస్తుంది.

బంగాళాదుంప – బంగాళాదుంప ఉడికించి మెత్తని పేస్ట్ ని  చేసి కాలిన గాయాలపైనా రాయాలి.  అల  15 నిముషాలు ఉంచడం వలన నొప్పి, మంట తగ్గి మచ్చలు పడకుండా చేస్తాయి.

తమలపాకు రసం – తమలపాకు రసం ను  తీసుకొని లేపనంగా రాయడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. తమలపాకు యాంటీ సెప్టిక్ గుణాలను కలిగి ఉండటం వల్ల గాయం  తొందరగా  తగ్గుతుంది .

బంతి మొక్క తీసుకొని  మెత్తని  గుజ్జుగా చేసి రాయడం వల్ల ఎలాంటి మచ్చ పడదు.

గోరింటాకు ముద్దలో వెనిగర్ లేదా నిమ్మరసం కలిపి రాయడం వల్ల మంట తగ్గి గాయాలను తొందరగా  మాన్పుతుంది.

పసుపుతో  కొద్ది తేనెను తీసుకొని పేస్ట్లా    తయారు చేసి దానిని  రాయడం వల్ల  మంచి ఫలితం ఉంటుంది.  ఉల్లిపాయను అడ్డంగా కట్ చేసి గాయం   రాయడం  వల్ల  కూడా నొప్పి తగ్గుతుంది.

కాలిన గాయాలకు  చల్లటి పాలను పూయడం, ఐస్ క్యూబ్ తో రాయడం, కొబ్బరి నూనె పూయడం వల్ల మంచి ఫలితం కూడా కనపడుతుంది .

 

 

Leave a Comment