వివాహములు ఎన్ని రకాలు
వివాహం అనగా రెండు నిండు జీవితాల కలయిక . వేరు వేరు పరిస్థితులలో పెరిగిన ఇద్దరు మాంగల్యం తో ,వేద మంత్ర ఘోషతో , అగ్ని సాక్షిగా ఒకటై కొత్త జీవితానికి పునాది వేయడం .
మాంగల్యం తంతునా నేనా మమ జీవన జీవన హేతున కంటే బాధ్రామి సుభగే త్వం జీవ శరదాం శతం .
మాంగల్యం ద్వారా మా జీవితం 100 సంవత్సరాలు సుఖ సంతోషాలతో కళకళ లాడాలి అని పై మంత్రానికి అర్ధం .
కేవలం ఇద్దరు మనుషులు మాత్రమె కాదు రెండు కుటుంబాల కలయిక వివాహం .
వివాహాలు 8 రకాలని మను ధర్మ శాస్త్రం లో చెప్పబడింది . అవి
భ్రహ్మ వివాహం ;-
పెళ్లి కుమార్తె తండ్రి తనకు నచ్చిన మంచి విజ్ఞానము ,నడవడి కలిగిన యువకుడిని అల్లుడిగా ఎంపిక చేస్తాడు . పెళ్లి కూతురికి వరుడి ఎంపికలో స్వేచ్చ వుండదు . దీనిలో కన్యాదానం ,అగ్నిహోమం ,సప్తపది ,వేద మంత్రోచ్చరణల మద్య వివాహం జరుగుతుంది .
ప్రజాపత్యము ; –
ఈ పద్దతిలో వరుడ్ని కన్యాదాత తగిన రీతిని సత్కరించి , వధూవరులిద్దరిని ధర్మ సంస్థాపన కొరకు పూనుకొమ్మని చెప్పి వారి చేత ప్రమాణం చేయిన్చితరువాత వివాహము జరిపిస్తాడు .
భ్రహ్మ వివాహం,ప్రాజాపత్యము రెండు దగ్గరగా వుంటాయి .
ఆర్ష వివాహం ; –
ఈ పద్దతిలో వధువు తండ్రి వరుడు నుండి ఆవు ,ఎద్దుల జతను కానుకగా తీసుకొని తన కుమార్తెను అతనికి ఇచ్చి వివాహం చేస్తాడు . ఇది కన్యాశుల్కం క్రింద వస్తుంది .
దైవ వివాహం ; –
యజ్ఞ యాగాదులు చేసేవారు తమ కుమార్తెను పురోహితునకు ఇచ్చి వివాహం చేయడాన్ని దైవ వివాహం అంటారు
గాందర్వ వివాహం ; –
గాందర్వ వివాహం (నేటి ప్రేమ వివాహాలు )లో పెద్దల ప్రమేయం లేకుండా ఇష్టపడి వివాహం చేసుకోవడం . దీనిలో స్త్రీ ,పురుషులిద్దరికీ స్వేచ్చ వుంటుంది .
దీనిలో స్త్రీ పురుషులు నచ్చిన వారిని పంచ భూతాల సాక్షిగా వివాహం చేసుకుంటారు . ఉదా ; శకుంతల -దుష్యంతులు ,సావిత్రి -సత్యవంతులు .
అసుర వివాహం ;-
వరుడు కొంత ధనాన్ని , వధువు తండ్రికి ఇచ్చి వధువును వివాహం చేసుకుంటాడు . దీనినే కన్యా శుల్కం అంటారు . దీనికి ఆశ పడి ఒకానొక సమయంలో తమ కుమార్తెలను పండు ముసలి వారికి కుడా ఇచ్చి వివాహం చేసారు .
రాక్షస వివాహం ;-
దీనిలో వరుడు కన్యను ఎత్తుకుపోయి , లేదా కన్య తరుపు వారిని యుద్దంలో ఓడించి వివాహం చేసుకుంటాడు .
ఉదా ; రుక్మిణి దేవి ని శ్రీకృష్ణుడు ,అర్జునుడు సుభద్రను ఈ విధం గానే వివాహం చేసుకున్నారు .
పైసాచికం ; –
నిద్రిస్తున్న లేదా మత్తుమందులు సేవించిన యువతిని వివాహం చేసుకోవడాన్ని పైసాచికం అంటారు . ఈ పద్దతిని మనువు నిషేదించాడు .