ఉగాది పచ్చడి తయారీ విధానం అవసరమై పదార్ధాలు
ప్రతి సంవత్సరం చైత్రమాసంలో శుక్లపక్షం పాడ్యమి తిథినాడు ఉగాది పండుగ ను జరుపు కుంటారు. ఈ రోజున “ఉగాది పచ్చడి” ప్రత్యేకమైంది. ఉగాది పచ్చడి షడ్రుచుల సమ్మేళనం – వగరు, పులుపు, కారం, ఉప్పు,తీపి, చేదు అనే రుచులు కలసిన ఉగాది పచ్చడి తెలుగువారికి ముఖ్యమైన ది . సంవత్సరం పొడుగునా ఎదురయ్యే మంచి చెడులను, కష్ట సుఖాలను దూరం కావాలనే సందేశాన్ని ఉగాది పచ్చడి ఇస్తుంది. ఈ పచ్చడి కొరకు మామిడి కాయలు కొన్ని అరటి పళ్ళు రెండు , కొద్దిగా వేప పువ్వు, చింతపండుకొద్దిగా , జామకాయలురెండు , చెరకు,బెల్లం తగినంత మొదలగునవి అవసరం ఉంటాయి . అలాంటి ఉగాది పచ్చడి ఎలా తయారుచేయాలో తెలుసుకుందాం!
ఉగాది పచ్చడికి కావల్సిన పదార్థాలు:
వేపపువ్వు- తగినంతలేతది
చిన్న చెరుకు ముక్క లేదా బెల్లం కొద్దిగా
చిన్న కొబ్బరి ముక్క -1
అరటిపళ్లు- 2
చింతపండు – తగినంత
చిన్న మామిడికాయ- 1
పచ్చి మిరపకాయ లేదా కారం కొద్దిగా
ఉప్పు- తగినంత
నీళ్లు – సరిపడా
తయారీ విధానం
ముందుగా వేప పువ్వును కాడల నుంచి వేరు చేసుకోవాలి చింతపండులో కొద్దిగా నీళ్లు పోసి కొద్ది సేపు నానబెట్టి తర్వాత దాన్ని గుజ్జును వేరుగా చేసుకోవాలి . మామిడికాయలు , మిరప కాయలు, కొబ్బరి సన్నగా చిన్నగా తరుగుకోవాలి . బెల్లము లేదా చెరుకు రసం సిద్ధం చేసిన తరువాత , మిగతా పండ్లను కూడా చిన్నగా తరిగి పెట్టుకోవాలి. బెల్లం పానకం లో చింతపండు గుజ్జు కలపాలి. ఈ మిశ్రమంలో మామిడికాయ చిన్న ముక్కలు , తరిగిన కొబ్బరి, మిరపకాయ ముక్కలను వేసి కలుపుకోవాలి చివరిగా ఒక అర స్పూను ఉప్పు వేసి కలుపుకోవాలి. అప్పుడు షడ్రుచుల ఉగాది పచ్చడి తయారైనట్టే . ఇక వసంత లక్ష్మీని ఆహ్వానించి, నైవేద్యంగా సమర్పించి, తర్వాత తీసుకోవాలి . అంతేకాదు మిగతా వాళ్లకు అందజేయాలి .