ఫూల్ మఖానా ఆరోగ్య ప్రయోజనాలు వైద్య ఉపయోగాలు మరియు దాని దుష్ప్రభావాలు
బహుశా తామర గింజలు అంటే ఎవరికి తెలియదు. ఇవి phool makhana గానే అందరికి తెలుసు. వీటినే Fox Nuts అని కూడా అంటారు. నార్త్ ఇండియా లో వీటిని ఎక్కువగా వాడుతారు. ప్రతి పండగకి వీటితో వంటలు చేసి దేవుడికి నైవేద్యం సమర్పించడం ఆచారంగా వస్తుంది. మొత్తం తూర్పు ఆసియాలో ఎక్కువగా వాడే ఆహార పదార్ధం ఇది. ఇవి బీహార్ లో ఎక్కువగా పండిస్తారు. ఈ తామర గింజలు తెలుపు ముదురు గోధుమ రంగులలో దొరుకుతాయి. వీటిని పచ్చిగా, ఎండబెట్టి, ఉడకబెట్టి తీసుకుంటారు. వీటిని పచ్చిగా తీసుకోవడం మరింత శ్రేష్టం. వీటిని కూరలు, స్వీట్స్, సూప్స్ మరియు స్నాక్స్ గ తీసుకుంటారు. వీటిని సాంప్రదాయ వైద్యంలో ఎక్కువగా వాడుతారు.
పోషకాలు :
ఇవి అనేక ఔషధ గుణాలను కలిగి ఉంటాయి. వీటిలో క్యాలరీలు తక్కువగా, ఫైబర్ ఎక్కువగా ఉంటాయి. సోడియం తక్కువగా పొటాషియం ఎక్కువగా కలిగి ఉంటుంది. మెగ్నీషియం, పాస్పరస్, మాంగనీస్ వంటి ఖనిజాలతో పాటు Saturated Fats ఉంటాయి.
లాభాలు:
అనీమియా, పిత్త, కఫ వైద్యంలో వీటిని ఎక్కువగా వాడుతారు.
డయేరియాను నియంత్రిస్తుంది, జీర్ణ వ్యవస్థను మెరుగుపరుస్తుంది.
కీళ్లనొప్పులను తగ్గిస్తుంది, నిద్రలేమి సమస్యను నివారిస్తుంది.
స్త్రీ, పురుషులలో ఇది ఒక మంచి ఉత్ప్రేరకంగా పనిచేస్తుంది.
గర్భిణీలకు, బాలింతలకు ఇది ఒక బలవర్ధకమైన ఆహారం. సోడియం తక్కువగా వుండి పొటాషియం ఎక్కువగా ఉండటం వల్ల బీ.పి వ్యాధిగ్రస్తులకు చాల మంచిది
దెబ్బతిన్న ఎంజైములను బాగుచేస్తుంది. శరీరంలోని ప్రి రాడికల్స్ ను, టాక్సిన్స్ ను బయటకు పంపిస్తుంది.
ఫైబర్ ఎక్కువగా ఉండడం వల్ల డైట్ పాటించేవారికి, షుగర్ వ్యాధిగ్రస్తులకు మరియు బరువు తగ్గాలనుకునేవారికి చాలా బాగా ఉపకరిస్తుంది.
నష్టాలు:
కొందరికి ఈ తామర గింజలు పడవు. ఎలర్జీ, గ్యాస్ సమస్యలు వస్తాయి. ఇంకా ఇది బ్లడ్ లో షుగర్ లెవెల్స్ ని తగిస్తుంది అందువలన షుగర్ వ్యాధిగ్రస్తులు వీటిని మోతాదులో తీసుకోవాలి.
గమనిక:
తెలుపు రంగులో కంటే ముదురు గోధుమ రంగులో వుండే వాటిని తీసుకోవడం మంచిది, ఎందుకంటే కొందరు వీటిని రంగుకోసం హైడ్రోజన్ పెరాక్సయిడ్ , సోడియం హైడ్రాక్సైడ్ వంటి వాటితో బ్లీచ్ చేసి మరీ అమ్ముతున్నారు.
- అల్లం లెమన్ టీ తీసుకోవడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు
- అవనిలో ఒక అరుదయిన మూలిక సదాపాకు
- అవిసె గింజల ప్రయోజనాలు, ఉపయోగాలు, మోతాదు మరియు దుష్ప్రభావాలు
- అవిసె గింజలు ప్రయోజనాలు, ఉపయోగాలు, మరియు దుష్ప్రభావాలు
- అవోకాడో ఆయిల్ యొక్క ప్రయోజనాలు
- అశ్వగంధ -అనేక ఔషధ గుణాలకు నిలయం
- అశ్వగంధ అందించే పది అద్భుతమైన ప్రయోజనాలు..!
- అశ్వగంధ సేవనం వల్ల ప్రయోజనాలు మరియు దుష్పలితాలు
- అసాధారణ ఆరోగ్య ప్రయోజనాలను కలిగి ఉన్న రాజ్ మా
- అసాధారణ ప్రయోజనాలనందించే తాటి బెల్లం
- అసిడిటీ సమస్య-పరిష్కారాలు
- ఆకుకూరలుతో కలిగే మేలు
- ఆక్రోటు యొక్క ప్రయోజనాలు ఉపయోగాలు మరియు దుష్ప్రభావాలు
- ఆపిల్ పండు లోని విశేషాలు
- ఆపిల్ ప్రయోజనాలు, కేలరీలు పోషక విలువలు, దుష్ప్రభావాలు మరియు ఉపయోగాలు ఔ