పురాణ స్త్రీలు – వారి వివరాలు

పురాణ స్త్రీలు – వారి వివరాలు

 

  • లక్ష్మీదేవి – శ్రీ మహావిష్ణుని భార్య. వరముల నిచ్చునది, ధనాధీశురాలు.
  •  సీతాదేవి – శ్రీరాముని భార్య, అతి రూపవతి, మహా పతివ్రత.
  • సరస్వతి :-బ్రహ్మదేవుని భార్య, చదువులరాణి, గొప్ప అందగత్తె.
  • రంభ: ఇంద్రసభలో నాట్యమాడు అప్పర స్త్రీ. అతిరూపవతి.
  • శూర్పణఖ :- రావణుని చెల్లెలు, కురూపి.
  • మందర :- కైకేయి దాసి, తంత్రగత్తె.
  • కైకేయి : దశరథ మహారాజు భార్య, అతి మూర్ఖురాలు
  • మండోదరి :- రావణుని భార్య, పార్వతీ భక్తురాలు.
  • పార్వతి:- శివుని భార్య, హిమవంతుని కుమార్తె.
  • శబరి: ఒక బోయస్త్రీ, శ్రీరామ భక్తురాలు.
  • అహల్య : గౌతముని భార్య, అందగత్తె.
  • ద్రౌపది : పాండవుల భార్య, ధీరురాలు.
  • జగన్మోహిని – విష్ణువు ధరించిన ప్రీరూపము, త్రిభువన సుందరి.
  • పూతన :- రాక్షస స్త్రీ, దుష్టురాలు.
  • కాళి: పార్వతి అవతారము, రౌద్రమూర్తి, భయంకరరూపిణి.
  • రుక్మిణీదేవి :- కుండిన నగరపు చక్రవర్తి భీష్మకుని పుత్రిక, శ్రీకృష్ణుని భార్య.
  • సత్యభామ :- పత్రాజిత్తు కుమార్తె, శ్రీకృష్ణుని అష్టమహిషులలో నొకతె, ద్రౌపది ఈమెకు
  • పతివ్రతా ధర్మములను నేర్పెను.
  • లోపాముద్ర :– సప్త మహాఋషులలో వొకడైన అగస్త్య మహామునిభార్య, మహాపతివ్రత.
  • అనసూయ: అత్రిమహాముని ధర్మపత్ని, మహాపతివ్రత, తన పాతివ్రత్య మహిమచే
  • త్రిమూర్తులను పసిబిడ్డలుగా చేసి లాలించెను.
  • శచీదేవి : ఇంద్రుని పట్టమహిషి.
  • సుభద్ర: శ్రీకృష్ణుని సోదరి, అర్జునునిభార్య, బాలవీరుడగు అభిమన్యుని గన్న
  • వీరమాత.

 

Leave a Comment