శబరిమల‌ అయ్యప్పస్వామి ఇరుముడి ప్రాశస్త్యం ఇరుముడి వివరణ

ఇరుముడి ప్రాశస్త్యం. ఇరుముడి వివరణ.*

     *“ ఇరుముడి”* శబరిమలకు కట్టుట ఒక సాంప్రధాయము, ఆచారము అని అన్నారు. ఇరుముడి అనగా రెండుముడుల కలియిక. ముంధుగా,  ముందుముడి *“దేవుడికి”,* వెనుక ముడి *“జీవుడికి”.* అనగా ముందు ముడిలో ఆ శబరీషుడి అభిషేకం, పూజకు కావలసిన సంభారములు. వెనుక ముడి లో బియ్యం, పప్పు ఇత్యాధి నిత్య ఆహార పధార్థములు. ఒకమారు పవిత్రంగా ఇరుముడి కట్టిన పిదప, ఎటువంటి సంధర్భంలోను ముందు ముడి విప్పరాధు. అది ఆ శబరీషుడి సన్నిధిలో పూజలు, అభిషేకాలు చేయుటకు  ముందు  మాత్రమే విప్ప వలెను. వెనుక నున్న రెండవ ముడి ఈ జీవుడు అనగా యాత్ర చేయు ధీక్షాపరుడు, కేవలం యాత్ర చేయుటకు గాను, కావలయు శక్తికై  అల్ప ఆహారం భుజించుటం కోసం.  ఆ ముడిని యాత్ర చేయునపుడు  భోజనం చేయుటకు గాను విప్పి అందు కొంత కావలసిన భాగం తీసుకొని, వండుకొని భుజించుటకు వాడుకొని, తిరిగి మూట  కట్టుకోవాలి. ఆ దీక్షా కాలమున ధీక్షాపరుడు శుచి, శుబ్రత కలిగిన కేవలం శాఖాహారం మాత్రం ,ఒక పూట తీసుకోవాలి. వెళ్లునది పూర్తిగా అరణ్య మార్గం,, పూటకూళ్ళ గృహములు వుండేవి  కావు, వున్నా కేరళ రాజ్యములో అప్పటి  వారు ఎక్కువ శాతం మాంసాహారులు మాత్రమే, అప్పుడు వుండే వారు. అందువల్ల ఈ “ *రెండవ ముడి”.*    అని నా గురువు నాకు  వివరించారు.

 *ఇప్పుడు సాంప్రధాయం, ఆచారం గురించి కొంచెం వివరణ.* 

శబరిమల ఆలయం ఆలయం పుట్టుక గురించి  సoక్షిప్తoగా  

 

 

      సాంప్రదాయo అనగా అప్పటి కాల పరిస్థితుల మేరకు ఒక సత్కార్యం చేయాలనుకున్న, పెద్ధలు అంధరు కలసి ఒక చోట గుమికూడి ఆ కార్యం నిర్విఘ్నముగా, సజావుగా జరపాలన్న, అందులోని సాధక భాధలు, వాటిని అధిగమించుటకు గాను చేయవలసిన కార్యాచరణను, ఒకరి కొకరు సంప్రద్ధింఛుకొని నిర్ణయాలు తీసుకొనే వారు. అలా సంప్రధించి తీసుకొన్న  నిర్ణయాలే, కాలక్రమమున *సాంప్రదాయముగా* చెప్ప బడినధి.
      ఇక *ఆచారమ* నగా పై విధముగా తీసుకున్న నిర్ణయాలను అప్పటి వారు తు.చ. తప్పక ఆచరించే వారు. ఇలా పూర్వీకులచే ఆచరింపబడినధి కాన నేడు  అదే *”ఆచారముగా”* మారినధి.
       ఈ ఆచార సాంప్రధయాలు ఇదమిత్తంగా ఇలానే వుండాలి అని ఎక్కడా వ్రాయబడలేధు. కాల పరిస్తుతులను బట్టి, ఆయా ప్రదేశాన్ని బట్టీ మారి పోతూ వుంటుంధి. పూర్వం నెల రోజులు చేసే పెళ్ళిళ్ళు నేడు ఒక గంటకు పరిమితమైనధి. ఇప్పుడు వాటి గురించి ఎక్కువగా చర్చిండo అప్రస్తుతం.

Leave a Comment