చిట్టిబొట్టు నోము పూర్తి కథ

చిట్టిబొట్టు నోము పూర్తి కథ

             పూర్వకాలములో ఒకానొక పదాతి ఇరుగుపొరుగు వారితో చీటికి మాటికి గొడవలు పెట్టుకుంటుండేది.    ఏ ఒక్కరితోను మంచిగా వుండేది కాదు అందరితోను విరోధంగా వుండేది.  ఆమెకు ఎవరు చెప్పారో  ఎలా ఉద్దేశం కలిగిందో చిట్టి బొట్టు నోము నోచింది నోము నియమానుసారం అయిదుగురు పేరంటాల్లకు బొట్టు పెట్టాలి.  అందుకుగాను పిలవబడే పెరంటాళ్ళతో    ఏ ఒక్కరితోను ఆమెకు పొట్టు కించిత్తు కూడా లేదు.  ఎలాగైతేనేం నలుగురికి బొట్టు పెట్టింది.  అయిదవ ఆమెకు బొట్టు పెట్టబోయే సమయంలో ఆమెలోని జగడపు బుద్ది ప్రజ్వరిల్లింది.  ఆమెకు బొట్టు పెట్టకుండా కసిరి కొట్టింది.  ఆవేశం ఆపుకోలేక తన బొట్టు తుదచేసుకుంది.  ఆ విధముగా చిట్టి బొట్టు నోముకు ఉల్లంఘన జరిగింది.

 

             మరుజన్మలో ఒక బ్రాహ్మణుని ఇంట జన్మించింది.  ఆ దంపతులు ఆమెను అల్లారు ముద్దుగా పెంచుకుంటున్నారు.  కాని ఆ బిడ్డ ముఖాన బొట్టు నిలిచేది కాదు.  యెంత ప్రయత్నించిన ఎలా ప్రయత్నించినా ఎన్నిసార్లు  పెట్టినా ఆబిడ్డ నుదుట బొట్టు నిలిచేది కాదు.  ఈ వైపరీత్యానికి ఆ దంపతులు ఎంతగానో బాధపడుతున్దేవారు.  ఒకనాడు ఆ గ్రామానికి వచ్చిన త్రికాలజ్ఞానియైన ఒక యోగిని దర్శించి ఆ దంపతులు తమ బిడ్డలా విషయం చెప్పి వైధవ్య ప్రాప్తి ఉన్నదేమో అన్న భయాందోళనలను విన్న వించుకొని తరుణోపాయం చెప్పవలసినదని ప్రార్ధించారు.  అంతట ఆ యోగి తన మనోనేత్రంతో విషయాని గ్రహించి దంపతుల్లారా విచారించకండి.  గత జన్మలో మీ బిడ్డ పరమ గయ్యాళి ఎవరితోనూ సానిగా పొందక వుద్న్డేది కాదు.  అందరితోను గొడవలు పెట్టుకునేది.  ఈ గొడవలు మాని చిట్టి బొట్టు నోమును నోచి పేరంటాల్లకు బొట్టు పెట్టడంలో ఒక ముత్తిడువను వదిలివేయదమేగాక తన బొట్టును కూడా చేరుపుకుంది.  ఆ కారణంగా ఆమెకు నుదుట బొట్టు నిలవడంలేదు.  మీరామె చేత చిట్టి బొట్టు నోము నోయించండి పరిస్థితి చక్కబడుతుందని వైదవ్య ప్రమాదం తప్పుతుందని చెప్పారు.

             ఆ ప్రకారం ఆ దంపతులు తమ బిడ్డ చేత చిట్టి బొట్టు నోమును నోయించారు.  బొట్టురాలిపదకుండా నుదుట యందు అమరుకున్నది.  గుణవంతుడు, రూపవంతుడైన యువకునితో ఆమెకు వివాహం జరిగింది.  ఈ నోము నోచుకున్న వారి బొట్టు చెదరక మంచి దాంపత్య సౌభాగ్యం కలుగుతుంది.

ఉద్యాపన:  

సంవత్సరకాలంపాటు వారం వారం అయిదుగురు పేరంటాల్లకు బొట్టు పెట్టాలి.  వారిచే అక్షింతలు శిరస్సున జల్లించుకుని వారికి పాదాబివందనం చేసి వారి ఆశీర్వచనాలు పొందాలి.

Leave a Comment