Muskmelon Salad : తర్బూజాలతో తయారుచేసిన చల్లని సలాడ్
Muskmelon Salad : వేసవిలో చల్లగా ఉండేందుకు చాలా మంది రకరకాల చర్యలు తీసుకుంటారు. ఇందుకోసం చల్లని పదార్థాలను తీసుకోవడం చాలా మంచిది. వేసవి కాలంలో మన శరీరాన్ని చల్లగా ఉంచడానికి తర్బూజా రసం చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఇవి ఏడాది పొడవునా సులభంగా అందుబాటులో ఉంటాయి.
అయినప్పటికీ, వేసవిలో వీటిని ఎక్కువగా వినియోగిస్తారు. ఇవి రుచికి చప్పగా ఉంటాయి. అందువల్ల, కాబట్టి తర్బూజాలతో ఎక్కువగా జ్యూస్ తయారు చేసి తాగుతుంటారు. వీటితో సలాడ్‌లు తయారు చేసి తినడం కూడా సాధ్యమే. ఇది చాలా రుచికరమైనది. జ్యూస్ తాగలేని వారు తర్బూజాలతో సలాడ్ తయారు చేసి తినవచ్చును.
ఇలా తర్బూజా తిన్నా కూడా మనకు వీటితో ప్రయోజనాలు కలుగుతాయి. ఇక తర్బూజాలతో సలాడ్‌ను ఎలా తయారు చేయాలి. దానికి తయారీకి కావలసిన పదార్థాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
తర్బూజా సలాడ్ తయారీకి కావలసిన పదార్థాలు:-
తర్బూజా – ఒకటి పెద్దది
బొప్పాయి ముక్కలు – కొన్ని
నిమ్మరసం – అరకప్పు
పచ్చిమిర్చి -1
ఆవాలు పేస్ట్ – స్పూను
ఉప్పు – కొద్దిగా
పంచదార -పావు కప్పు
ఉప్పు, తగినంత.
Muskmelon Salad : తర్బూజాలతో తయారుచేసిన చల్లని సలాడ్
తర్బూజా సలాడ్ తయారు చేసే విధానము:-
ముందుగా స్టవ్ ఆన్ చేసి దాని మీద ఒక గిన్నె పెట్టుకొని వేడి చేసుకోవాలి . ఇలా వేడి అయిన గిన్నెలో నీళ్లు పోసి చక్కెర, నిమ్మరసం, పచ్చి మిర్చి వేసి బాగా మరిగించాలి. అలా మరిగిన వాటిని జల్లెడ సహాయంతో వడకట్టి ఫ్రిజ్‌లో పెట్టుకోవాలి.
ఇప్పుడు తర్బూజా, బొప్పాయి పండ్లను ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసిన పండ్ల ముక్కలపై ఫ్రిజ్‌లో పెట్టుకున్న మిశ్రమాన్ని పోయాలి. తరువాత దాని మీద మిరియాల పొడి, ఆవాల పేస్టును వేసి కలపాలి . ఈ మిశ్రమము మీద రుచికి సరిపడా ఉప్పును కూడా వేసుకోవాలి.సలాడ్ చల్లగా తింటే రుచిగా ఉంటుంది. దీన్ని తీసుకోవడం వల్ల శరీరం మొత్తం ఉష్ణోగ్రత తగ్గుతుంది. పోషకాలు సులువుగా లభిస్తాయి.