Putnala Pappu Laddu:రుచికరమైన పుట్నాల ప‌ప్పు ల‌డ్డూలు శరీరానికి ఎంతో బ‌లం

Putnala Pappu Laddu:రుచికరమైన పుట్నాల ప‌ప్పు ల‌డ్డూలు శరీరానికి ఎంతో బ‌లం

Putnala Pappu Laddu:శ‌న‌గ‌ల‌ను వేయించి పుట్నాల ప‌ప్పును త‌యారు చేస్తార‌ని మ‌నంద‌రికీ బాగా తెలుసు. పుట్నాల ప‌ప్పును కూడా మ‌నం వంటలో ఉపయోగిస్తారు. పుట్నాల ప‌ప్పుతో చేసే పచ్చడి,కారం పొడి చాలా రుచిగా ఉంటాయి.ఆహారంగా పుట్నాల ప‌ప్పును తీసుకోవ‌డం వ‌ల్ల  అనేక ప్ర‌యోజ‌నాల‌ను పొంద‌వ‌చ్చును.

 

పుట్నాల ప‌ప్పు యొక్క ఉపయోగాలు :-

గుండె ఆరోగ్యాన్ని మెరుగుప‌ర‌చ‌డంలో, ఎముకల‌ను దృఢంగా ఉంచ‌డంలో, మ‌ల‌బ‌ద్ద‌కాన్ని నివారించ‌డంలో పుట్నాల ప‌ప్పు ఎంతో ఉప‌యోగ‌ప‌డుతుంది.పుట్నాల పప్పు జుట్టు మరియు చర్మ సంబంధిత సమస్యలకు చికిత్స చేయడానికి కూడా ఉపయోగించబడుతుంది. పుట్నా పప్పుతో లడ్డూలను తయారు చేయడం కూడా సాధ్యమే. ఈ లడ్డూలు చాలా రుచికరమైనవి. విటిని త్వరగా తయారు చేసుకోవచ్చును . పుట్నా పప్పుతో వీటిని ఎలా తయారు చేయాలో వాటిని కావలసిన పదార్థాలు గురించి తెలుసుకుందాం.

 

పుట్నాల ప‌ప్పు లడ్డూలు తయారు చేయడానికి కావలసిన పదార్థాలు:-

పుట్నా పప్పు – 2 కప్పులు
తురిమిన బెల్లం – 1 కప్పు
జీడిపప్పు – 15
బాదం పప్పు – 15
యాలకుల పొడి – 1/4 టీస్పూన్
నెయ్యి – 100 గ్రా.

Putnala Pappu Laddu:రుచికరమైన పుట్నాల ప‌ప్పు ల‌డ్డూలు శరీరానికి ఎంతో బ‌లం

పుట్నాల ప‌ప్పు లడ్డూలు తయారు చేసే విధానము :-

ముందుగా ఒక క‌డాయిలో ఒక టేబుల్ స్పూన్ నెయ్యిని వేసి నెయ్యి కరిగిన త‌రువాత జీడి ప‌ప్పు, బాదం ప‌ప్పును వేసి రంగు మారే వ‌ర‌కు బాగా వేయించుకోవాలి. అలా వేగిన జీడి ప‌ప్పు, బాదం ప‌ప్పును త‌రువాత ఒక ప్లేట్ లోకి తీసుకుని చ‌ల్ల‌గా అయ్యే వ‌ర‌కు ప‌క్క‌న‌ పెట్టుకోవాలి .

అదే క‌డాయిలో మ‌రో టీ స్పూన్ నెయ్యిని, పుట్నాల పప్పును కూడా వేసి పుట్నాల ప‌ప్పు కూడా రంగు మారే వ‌ర‌కు వేయించి చ‌ల్ల‌గా అయ్యే వ‌ర‌కు పక్కన ఉంచాలి. ఇప్పుడు ఒక జార్ లో ముందుగా వేయించి పెట్టుకున్న పుట్నాల‌ను వేసి కొద్దిగా బ‌ర‌క‌గా ఉండేలా మిక్సీ ప‌ట్టుకుని ఒక గిన్నెలోకి తీసుకోవాలి. అదే జార్ లో వేయించిన బాదం ప‌ప్పును జీడిప‌ప‌ప్పును కూడా వేసి క‌చ్చా ప‌చ్చా ఉండేలా మిక్సీ ప‌ట్టి పుట్నాల ప‌ప్పు మిశ్ర‌మంలో వేసి క‌లుపుకోవాలి. ఆమిశ్ర‌మంలోనే బెల్లం తురుమును వేసి అంతా క‌లిసేలా బాగా క‌లుపుకోవాలి.

ఇప్పుడు కొద్ది కొద్దిగా నెయ్యిని వేసుకుంటూ క‌లుపుతూ కావ‌ల్సిన ప‌రిమాణంలో ల‌డ్డూలూ త‌యారు చేసుకోవాలి. ఇలా తయారు చేయడం వల్ల పుట్నా పప్పుతో చేసిన చాలా రుచికరమైన లడ్డూలు తయారవుతాయి. ఈ ల‌డ్డూల త‌యారీలో నెయ్యికి బ‌దులుగా పాల‌ను కూడా ఉప‌యోగించ‌వ‌చ్చును. ఈ ల‌డ్డూలు మూత ఉండే డ‌బ్బాలో నిల్వ చేసుకోవ‌డం వ‌ల్ల 10 నుండి 15 రోజుల వ‌ర‌కు తాజాగా ఉంటాయి. మ‌ధ్యాహ్నం భోజ‌నం త‌రువాత ఒక‌టి లేదా రెండు చొప్పున ఈ ల‌డ్డూల‌ను తిన‌డం వ‌ల్ల శరీరానికి కావల్సిన పోషణ, శక్తి అందుతాయి. అంతకు మించి ఆరోగ్య ప్రయోజనాలున్నాయి