Korrala Pongali :ఆరోగ్యకరమైన కొర్రల పొంగలి ఇలా చేసుకొండి

Korrala Pongali :ఆరోగ్యకరమైన కొర్రల పొంగలి ఇలా చేసుకొండి

 

Korrala Pongali : కొర్రల పొంగలి నేడు చాలా మంది ఆహారంలో భాగంగా తయారు చేస్తున్నారు. దీని వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి. అయితే, అత్యంత ప్రజాదరణ పొందిన స్నాక్స్‌లో కొర్ర లు అనేక ప్రయోజనాలను అందిస్తుంది. వీటిని వండే విధానం గురించి చాలా మందికి తెలియదు. అవి నేరుగా తినగలిగే ఆహార పదార్థం కాదు. అయినప్పటికీ, వాటిని చాలా రుచికరమైనదిగా వండుతారు. ఈ పదార్థాలతో చేసిన పొంగలి రుచికరంగా ఉంటుంది. అదనంగా పోషకాలు మరియు ఆరోగ్య ప్రయోజనాలను కూడా పొందుతాము. కొర్రలను ఉపయోగించి పొంగలిని ఎలా తయారు చేయాలి. దానికి తయారు చేయడానికి కావలసిన పదార్థాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

 

కొర్రలను ఉపయోగించి పొంగలి తయారు చేయడానికి కావలసిన పదార్థాలు:-

కొర్రలు-కప్పు
పెసర పప్పు- కప్పు
నెయ్యి -అరకప్పు
జీడిపప్పు – రెండు టీస్పూన్లు
మిరపకాయలు- 5 లేదా 6
అల్లంపొడి – 1 టీస్పూన్
జీలకర్ర-పావు టీస్పూన్
మిరియాల పొడి- పావు టీస్పూన్
ఇంగువ- చిటికెడు
కరివేపాకు – రెండు రెమ్మలు
ఉప్పు -రుచికి సరిపడా

Korrala Pongali :ఆరోగ్యకరమైన కొర్రల పొంగలి ఇలా చేసుకొండి

కొర్రలను ఉపయోగించి పొంగలి తయారు చేసే విధానము:-

ముందుగా కొర్రలను శుభ్రంగా కడిగి ఆరు లేదా ఏడు గంటల పాటు నానబెట్టుకోవాలి. తరువాత స్టవ్ ఆన్ చేసుకోవాలి. ఆన్ చేసిన స్టవ్ మీద ఒక పాన్ పెట్టుకోవాలి . పాన్ వేడి అయ్యాక దానిలో నెయ్యి వేయాలి. అది వేడి అయి కరిగిన తరువాత దానిలో పెసరపపప్పు వేసి బాగా వేయించాలి. ఆలా వేగిన పెసరపపప్పును ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ఇప్పుడు అదే పాన్లో నానబెట్టిన కొర్రలను పోసి నీరంతా పోయే వరకు బాగా వేయించాలి. వీటిని రోట్లో వేసి దంచుకోవాలి.ఈ మిశ్రమానికి పెసరపపప్పు వేసి నీళ్లు పోసి అరగంటపాటు బాగా ఉడికించుకోవాలి.

ఇప్పుడు మరోక పాన్‌లో నెయ్యి వేసి వేడెక్కాక జీలకర్ర, పచ్చిమిర్చి, అల్లం తరుగు, మిరియాల పొడి, ఇంగువ, కరివేపాకును కూడా వేసి వేయించాలి. ఈ తాళింపును ఉడికించిన కొర్రల్లో కలుపుకోవాలి . ఈ విధముగా రుచికరమైన కొర్రల పొంగలి తయారవుతుంది. దీన్ని నేరుగా తినవచ్చును . కాస్త నెయ్యి వేసి కలిపి తింటే ఇంకా రుచిగా ఉంటుంది. దీని వల్ల మనకు కావల్సిన పోషకాలు మరియు ఆరోగ్య ప్రయోజనాలు లభిస్తాయి.