Cashew Nuts Laddu:రోజూ ఒక్కసారైనా జీడిపప్పు లడ్డూ తినండి
Cashew Nuts Laddu : మన రోజువారీ ఆహారంలో భాగంగా డ్రైఫ్రూట్స్ తీసుకోవడం వల్ల మనకు చాలా ప్రయోజనాలు లభిస్తాయి. డ్రై ఫ్రూట్స్ శరీరానికి కావలసిన అన్ని పోషణలను అందిస్తాయి. పిల్లల ఎదుగుదలకు ఇవి చాలా ఉపయోగకరంగా ఉంటాయి. డ్రై ఫ్రూట్స్ గుండె ఆరోగ్యాన్ని కాపాడడంలో మరియు ఎముకలను బలోపేతం చేయడంలో మేలు చేస్తాయి. ఇవి బీపీ, డయాబెటిక్ సమస్యలను తగ్గించడంలో తోడ్పడతాయి. ఇవి ఆరోగ్యకరమైన బరువు తగ్గడానికి దారితీస్తాయి. రోగనిరోధక వ్యవస్థ కూడా మెరుగుపడుతుంది. మనం రోజూ రకరకాల డ్రైఫ్రూట్స్ను తినలేం.వీటితో లడ్డూలను తయారు చేసుకుని ప్రతి రోజూ ఒకటి తినడం వల్ల శరీరానికి అన్ని రకాల పోషకాలు లభిస్తాయి. డ్రై ఫ్రూట్స్ తో లడ్డూలను ఎలా తయారు చేయాలి వాటికి కావలసిన పదార్థాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
జీడిపప్పు లడ్డూ తయారు చేయడానికి కావలసిన పదార్థాలు:-
బాదం- అరకప్పు
జీడిపప్పు – 1 కప్పు
ఎండుద్రాక్ష – 2 టేబుల్ స్పూన్లు
పుచ్చకాయ గింజలు – పావు కప్పు
గుమ్మడి గింజలు – పావు కప్పు
ఎండు కొబ్బరిపొడి -సుమారు పావు కప్పు
యాలకుల పొడి-ఒక టీస్పూన్
తురిమిన బెల్లం- పావు కప్పు
నెయ్యి – 1 టేబుల్ స్పూన్
నీరు – మూడు వంతులు.
Cashew Nuts Laddu:రోజూ ఒక్కసారైనా జీడిపప్పు లడ్డూ తినండి
జీడిపప్పు లడ్డూను తయారు చేసే విధానము:-
ముందుగా స్టవ్ ఆన్ చేసి దాని మీద ఒక కడాయిని పెట్టుకోవాలి. ఇప్పుడు కడాయి వేడి అయితే దానిలో నెయ్యి వేసి వేడి చేయాలి .నెయ్యి వేడయ్యాక బాదంపప్పులను వేసి కాసేపు వేయించాలి. బాదంపప్పులు వేగిన తర్వాత జీడిపప్పులను కూడా వేసి దోరగా వేయించుకోవాలి. అవి దోరగా వేగిన తరువాత ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి .
తరువాత అదే బాణలిలో ఎండు ద్రాక్షను వేసి దోరగా వేయించి వాటిని కూడా ప్లేట్లోకి తీసుకోవాలి.ఇప్పుడు పుచ్చకాయ గింజలు మరియు గుమ్మడి గింజలు కూడా వేయించి వాటిని కూడా ప్లేట్లోకి తీసుకోవాలి. అదే కడాయిలో కొబ్బరి పొడిని వేసి ఒక నిమిషం పాటు వేయించి ఒక గిన్నెలోకి తీసుకోవాలి. ఎప్పుడు ఒక మిక్సీ జారులో వేయించిన బాదం మరియు జీడిపప్పును వేసి మెత్తని పొడిలా కాకుండా కొద్దిగా కచ్చా పచ్చాగా ఉండేలా చేసి దానిలో కొబ్బరి పొడిని, గుమ్మడి గింజలు మరియు పుచ్చకాయ గింజలను వేసి మరొక సారి మిక్సీ పట్టుకోవాలి.
తర్వాత ఈ మిశ్రమంలో ఎండుద్రాక్ష అలాగే యాలకుల పొడి వేసి బాగా కలపాలి. తరువాత స్టవ్ ఆన్ చేసి ఒక కడాయి పెట్టుకోవాలి. ఇప్పుడు దానిలో బెల్లం తురుమును, నీటిని వేసుకోవాలి. ఆ మిశ్రమాన్నిగంటె సహాయంతో బెల్లం కరిగే వరకు తిప్పుతూ ఉండాలి. బెల్లం పూర్తిగా కరిగిన తరువాత వడకట్టుకోవాలి.ఇలా వడకట్టిన బెల్లం నీటిని అదే కడాయిలో పోసి 10 నిమిషాల పాటు మరిగిం చాలి.ఈ లడ్డూ తయారీకి పాకం అవసరం లేదు. ఇలా ఉడికిన పాకంలో కొబ్బరి పొడి మిశ్రమాన్ని వేసి చిన్న మంటపై బాగా కలిపి లడ్డూలలా చేయడానికి వచ్చే వరకు ఉడికించి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి.
ఈ మిశ్రమం కొద్దిగా చల్లారిన తరువాత కావల్సిన పరిమాణంలో తీసుకొని లడ్డూలలా చేసుకోవాలి. ఈవిధముగా ఎంతో రుచిగా ఉండే జీడిపప్పు లడ్డూ తయారవుతుంది. ఈ లడ్డూలు 10 నుండి 15 రోజుల వరకు నిల్వ ఉంటాయి. వీటి తయారీలో పంచదారను లేదా ఖర్జూరను కూడా ఉపయోగించవచ్చును . జీడిపప్పు లడ్డూ ప్రతి రోజూ భోజనం తరువాత ఒకటి తినడం వల్ల శరీరానికి ఎంతో మేలు జరుగుతుంది . పిల్లలకు ఈ లడ్డునూ ఇవ్వడం వల్ల చురుకుగా ఉండడంతోపాటు జ్ఞాపక శక్తి కూడా పెరుగుతుంది. చర్మ ఆరోగ్యాన్ని మెరుగుపరచడంతోపాటు చర్మం నిగారించేలా చేయడంలో కూడా జీడిపప్పు లడ్డూ బాగా సహాయపడతాయి. రోజుకి ఒకటి చొప్పున జీడిపప్పు లడ్డూలను తీసుకోవడం వల్ల రక్తహీనత సమస్య తగ్గి మానసిక స్థితి కూడా మెరుగుపడుతుంది.