Uppu Shanagalu :ఇలా త‌యారుచేసి శ‌న‌గ‌ల‌ను తినడం వల్ల ఎంతో ఆరోగ్య‌క‌రం

Uppu Shanagalu :ఇలా త‌యారుచేసి శ‌న‌గ‌ల‌ను తినడం వల్ల ఎంతో ఆరోగ్య‌క‌రం

Uppu Shanagalu: మ‌న వంటింట్లో ఉప‌యోగించే ప‌ప్పు ధాన్యాల‌లో శ‌న‌గ‌లు కూడా ఒక‌టి. ప్రాచీన కాలం నుండి మ‌నం శ‌న‌గ‌ల‌ను ఆహారంగా తీసుకుంటూ ఉన్నాం. శ‌న‌గ‌ల‌ను ఆహారంగా తీసుకోవ‌డం వ‌ల్ల మ‌నం అనేక ఆరోగ్య‌క‌ర‌మైన ప్ర‌యోజ‌నాల‌ను పొంద‌వ‌చ్చును . షుగ‌ర్ వ్యాధి గ్ర‌స్తులకు శ‌న‌గ‌లు ఎంత‌గానో మేలు చేస్తాయి. వీటిని త‌ర‌చూ ఆహారంలో భాగంగా తీసుకోవడం వ‌ల్ల షుగ‌ర్ వ్యాధి నియంత్ర‌ణ‌లో ఉంటుంది. వీటిలో ఉండే కాల్షియం, ఐర‌న్ వంటి మిన‌ర‌ల్స్ ఎముక‌ల‌ను దృఢంగా ఉంచ‌డంలో బాగా స‌హాయ‌ప‌డ‌తాయి. శ‌న‌గ‌ల‌ను త‌ర‌చూ తీసుకోవ‌డం వ‌ల్ల బీపీతోపాటు శ‌రీరంలో కొలెస్ట్రాల్ స్థాయిలు నియంత్ర‌ణ‌లో ఉంటాయి. మాన‌సిక స్థితి కూడా మెరుగుప‌డుతుంది.

శ‌న‌గ‌లు అజీర్తిని త‌గ్గించ‌డంలో కూడా స‌హాయ‌ప‌డ‌తాయి. మ‌నం శ‌న‌గ‌ల‌తో గుగిళ్ల‌తోపాటుగా కూర‌ల‌ను కూడా త‌యారు చేస్తాము . వీటితోపాటు శ‌న‌గ‌ల‌ను ఉప్పు శ‌న‌గ‌లుగా చేసుకుని కూడా తిన‌వ‌చ్చును . మ‌న‌కు బ‌య‌ట ఉప్పు శ‌న‌గ‌లు ఎక్కువ‌గా దొరుకుతూ ఉంటాయి. చాలా సులువుగా మరియు త‌క్కువ స‌మ‌యంలోనే ఉప్పు శ‌న‌గ‌లను ఇంట్లో కూడా త‌యారు చేసుకోవ‌చ్చును . ఇంట్లో ఉప్పు శ‌న‌గ‌ల‌ను ఎలా తయారు చేసుకోవాలి.దానికి కావలసిన పదార్థాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

 

ఉప్పు శ‌న‌గ‌లు తయారు చేయడానికి కావలసిన పదార్థాలు:-

శ‌న‌గ‌లు- ఒక‌టిన్న‌ర క‌ప్పు
ఉప్పు- 3 కప్పులు.

Uppu Shanagalu :ఇలా త‌యారుచేసి శ‌న‌గ‌ల‌ను తినడం వల్ల ఎంతో ఆరోగ్య‌క‌రం

ఉప్పు శ‌న‌గ‌లు తయారు చేసే విధానం:-

ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని దాని మీద ఒక కడాయి పెట్టుకోవాలి . ఇప్పుడు కడాయిలో ఉప్పును వేసి పెద్ద మంట‌పై ప‌ది నిమిషాల పాటు వేడి చేసుకోవాలి. తరువాత దానిలో శ‌న‌గ‌ల‌ను వేసి పెద్ద మంట‌పై 3 నుండి 4 నిమిషాల పాటు బాగా వేయించుకోవాలి. ఇవి బాగా వేయించిన తరువాత స్ట‌వ్ ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడు వాటిని జ‌ల్లి గంట‌తో ఉప్పు నుండి శ‌న‌గ‌ల‌ను వేరు చేసుకోవాలి. ఈ విధముగా ఉప్పు శ‌న‌గ‌లు త‌యార‌వుతాయి.

 

నూనెలు మరియు మ‌సాలాల‌ను వాడ‌కుండా త‌యారు చేసిన ఈ శ‌న‌గ‌ల‌ను తిన‌డం వ‌ల్ల ఆరోగ్యానికి ఎంతో మేలు క‌లుగుతుంది. సాయంత్రం స‌మ‌యాల్లో ఆరోగ్యానికి హానిని క‌లిగించే చిరు తిళ్ల‌ను తిన‌డానికి బ‌దులుగా ఇలా ఉప్పు శ‌న‌గ‌ల‌ను త‌యారు చేసుకుని తిన‌డం వ‌ల్ల రుచిగా ఉండ‌డంతోపాటు శ‌న‌గ‌లను ఆహారంగా తీసుకోవ‌డం వ‌ల్ల క‌లిగే ప్ర‌యోజ‌నాల‌ను పొంద‌తారు . దీంతోపాటు అనేక పోష‌కాలు కూడా ల‌భిస్తాయి. ఆరోగ్యంగా ఉంటారు.