Budamkaya Pachadi:రుచికరమైన బుడంకాయ రోటీ పచ్చడి ఇలా తయారు చేసుకొండి

Budamkaya Pachadi:రుచికరమైన బుడంకాయ రోటీ పచ్చడి ఇలా తయారు చేసుకొండి

 

Budamkaya Pachadi:మనకు అందుబాటులో ఉన్న కూరగాయలలో బుడంకాయ ఒకటి. ఇది గ్రామాల్లో ఎక్కువగా కనిపిస్తుంది. బుడం కాయలు దొండ‌కాయల‌ వలె చిన్నవిగా ఉంటాయి. దోసకాయల మాదిరిగా ఉండటం వల్ల వీటిని బుడం దోసకాయలు అని కూడా అంటారు. ఇవి కూడా దోసకాయల కుటుంబానికి చెందినవి . విటిలో కేలరీలు తక్కువగా ఉంటాయి మరియు నీరు సమృద్ధిగా ఉంటాయి. వీ టిని ఆహారంగా తీసుకోవడం వల్ల జీర్ణక్రియకు సహాయపడుతుంది మరియు శరీరానికి కూడా మేలు చేస్తుంది.

బుడంకాయలలో కాల్షియం, పొటాషియం, ప్రొటీన్లు విటమిన్ సి విటమిన్ కె, ఫైబర్ మరియు యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. బుడంకాయలతో కూర, పప్పు, పచ్చడి కూడా చేసుకోవచ్చును . బుడంకాయలతో చేసిన పచ్చడి ఒక రుచికరమైన వంటకం. ఈ ప‌చ్చ‌డిని రోట్లో త‌యారు చేసుకుంటే ఇంకా రుచిగా కూడా ఉంటుంది. రోట్లో వేసి బుడంకాయ ప‌చ్చ‌డిని ఎలా త‌యారు చేసుకోవాలి . దానికి తయారు చేయడానికి కావలసిన పదార్థాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

 

 

బుడంకాయ రోటీ పచ్చడి తయారు చేయడానికి కావలసిన పదార్థాలు:-

బుడంకాయలు- అర కిలో
పచ్చిమిర్చి – 20
తరిగిన ఉల్లిపాయలు- 2. (పెద్దవి),
చింతపండు నానబెట్టి-30 గ్రాములు
పసుపు -సగం టీ స్పూన్
ఉప్పు – రుచికి త‌గినంత‌
పల్లీలు – ఒక కప్పు
నూనె – 2 టేబుల్ స్పూన్లు.

Budamkaya Pachadi:రుచికరమైన బుడంకాయ రోటీ పచ్చడి ఇలా తయారు చేసుకొండి

బుడంకాయ రోటీ పచ్చడి తయారు చేసే విధానము :-

ముందుగా బుడంకాయ‌ల‌ను శుభ్రంగ‌గా క‌డిగి గుండ్ర‌టి ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని దాని మీద ఒక కడాయి పెట్టి వేడి చేసుకోవాలి . ఇలా వేడి అయిన కడాయిలో ప‌ల్లీల‌ను వేసి బాగా వేయించుకోవాలి. అలా వేయించిన ప‌ల్లీల‌ పొట్టు తీసి ప‌క్క‌కు పెట్టుకోవాలి. అదే కడాయిలో కొద్దిగా నూనె వేసి ప‌చ్చి మిర‌ప‌కాయ‌ల‌ను బాగా వేసి వేయించాలి. ఇలా వేగిన దానిలో బుడంకాయ ముక్క‌ల‌ను కూడా వేసి వేయించుకోవాలి.

ఇప్పుడు ముందుగా రోట్లో ప‌ల్లీల‌ను వేసి మెత్త‌గా రుబ్బుకోవాలి.అలా రుబ్బిన మిశ్రమాన్ని ఒక ప్లేట్ లోకి తీసుకుని ప‌క్క‌కు పెట్టుకోవాలి. త‌రువాత వేయించిన ప‌చ్చి మిర్చి, బుడం కాయ‌ల‌ను వేసి రుబ్బుకోవాలి. త‌రువాత నాన‌బెట్టిన చింత‌పండును, ఉప్పును, ప‌సుపును వేసి కచ్చా ప‌చ్చాగా దంచుకోవాలి.

త‌రువాత మెత్త‌గా చేసుకున్న ప‌ల్లీల‌ను, త‌రిగిన ఉల్లిపాయ‌ల‌ను వేసి మ‌రోకసారి దంచుకోవాలి. ప‌చ్చ‌డి మ‌రీ గ‌ట్టిగా ఉంటే చింత‌పండును నాన‌బెట్టిన నీళ్ల‌ను వేసి దంచుకోవాలి. ఇలా తయారు అయిన మిశ్రమాన్ని ఒక గిన్నెలోకి తీసుకోవాలి. ఈ విధంగా రుచిగా ఉండే బుడం కాయ రోటి ప‌చ్చ‌డి త‌యార‌వుతుంది. దీనిని మిక్సీ జార్ లో వేసి కూడా బుడం కాయ ప‌చ్చ‌డి తయారు చేసుకోవచ్చును .

దీన్ని దోశ మరియు అన్నంతో కలిపి తింటే చాలా రుచిగా ఉంటుంది. బుడంకాయ‌ల‌ను ఆహారంగా తీసుకోవడం వల్ల జుట్టు మరియు చర్మాన్నిచక్కగా ఉంచుకోవచ్చు. శరీరంలో రోగనిరోధక శక్తి కూడా పెరుగుతుంది.