Ragi Onion Chapati: రుచికరమైన రాగి ఉల్లిపాయ చపాతీని ఇలా చేసుకొండి

Ragi Onion Chapati: రుచికరమైన రాగి ఉల్లిపాయ చపాతీని ఇలా చేసుకొండి

 

Ragi Onion Chapati: మన శరీరానికి రాగుల వల్ల కలిగే ప్రయోజనాల గురించి మనందరికీ తెలుసు. ఈ ఆహారాన్ని తీసుకోవడం వల్ల మనకు అనేక ప్రయోజనాలు ఉన్నాయి. ఇవి శరీర ఉష్ణోగ్రతను తగ్గిస్తాయి. అందుకే చాలా మంది వేసవిలో రాగులను జావగా తాగుతారు. వీటిని ఉపయోగించి చపాతీలు కూడా చేసుకోవచ్చు. వీటికి ఉల్లిపాయలు వేస్తే చాలా రుచిగా ఉంటాయి. వాటి వల్ల ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఉన్నాయి. రాగులు, ఉల్లిపాయలతో చపాతీలను ఎలా తయారు చేయాలి. వాటికి తయారీకి కావలసిన పదార్థాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

 

Ragi Onion Chapati: రుచికరమైన రాగి ఉల్లిపాయ చపాతీని ఇలా చేసుకొండి

 

రాగి ఉల్లిపాయల చపాతీ తయారీకి కావలసిన పదార్థాలు:-

రాగి పిండి – ఒక కప్పు
ఉల్లితరుగు – పావు కప్పు
ఉప్పు -తగినంత
చిన్న చిన్న మిరపకాయలు- 1
పెరుగు- 2 టీస్పూన్లు
కొత్తిమీర – 1/2 కప్పు
నూనె- తగినంత.

Ragi Onion Chapati: రుచికరమైన రాగి ఉల్లిపాయ చపాతీని ఇలా చేసుకొండి

రాగి ఉల్లిపాయ చపాతీ తయారు చేసే విధానం :-

ఒక వెడల్పాటి పాత్రలో రాగి పిండి, ఉల్లి తరుగు, పచ్చి మిర్చి తరుగు, పెరుగు, కొత్తిమీర ఉప్పు వేసి చపాతీ పిండిలా గట్టిగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న మిశ్రమాన్ని చిన్న చిన్న ఉండలు చేసి పక్కన పెట్టుకోవాలి. ఇలా పెట్టుకున్న ఉండలను ఒక్కోటిగా తీసుకొని చపాతీలాగా ఒత్తుకొవాలి. రాగి చపాతీ త్వరగా విరిగిపోతుంది. కాబ్బటి
చేతికి నూనె రాసుకుని చేత్తోనే ఒత్తాలి.

ఇప్పుడు స్టవ్‌ ఆన్ చేసుకొని దాని మీద పెనం పెట్టుకోవాలి.పెనం కొద్దిగా వేడెక్కాక నూనె వేసి ఒత్తి ఉంచుకున్న రాగి చపాతీని వేసి జాగ్రత్తగా రెండు వైపులా కాల్చి తీసుకోవాలి. ఈ చపాతీలు పెరుగు, టమాటా పచ్చడిలతో తింటే చాలా రుచిగా ఉంటాయి. ఇవి మనకు ఆరోగ్యాన్ని, పోషకాలను, శక్తిని అందిస్తాయి.