Sweet Curd:మ‌ట్టి కుండ‌ను ఉపయోగించి రుచికరమైన స్వీట్ పెరుగును ఇలా తయారు చేయండి

Sweet Curd:మ‌ట్టి కుండ‌ను ఉపయోగించి రుచికరమైన స్వీట్ పెరుగును ఇలా తయారు చేయండి

 

Sweet Curd:మన రోజువారీ ఆహారంలో పెరుగును తీసుకుంటుంది. పెరుగు తినడం వల్ల మనకు ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయని మనందరికీ తెలుసు. రోజువారీ ఆహారంలో భాగంగా పెరుగు తీసుకోవడం వల్ల జీర్ణక్రియ మెరుగుపడుతుంది. ఇది శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచుతుంది. చర్మం మరింత కాంతివంతంగా ఉంటుంది. ఎముకలు దృఢంగా మారుతాయి.

పాలలో చక్కెర సిర‌ప్ ను వేసి మ‌నం స్వీట్ క‌ర్డ్ ను కూడా త‌యారు చేసుకోవ‌చ్చును . దీనినే మిష్టి దోయ్, మీఠా ద‌హీ అని కూడా పిలుస్తారు. ఇది బెంగాలీల సాంప్ర‌దాయ వంట‌కం. ఈ స్వీట్ క‌ర్డ్ ను మ‌నం చాలా సులువుగా త‌యారు చేసుకోవ‌చ్చును . పెరుగును నేరుగా తిన‌లేని వారు ఇలా స్వీట్ క‌ర్డ్ ను త‌యారు చేసుకుని తిన‌వ‌చ్చును . ఎంతో రుచిగా ఉండే ఈ స్వీట్ క‌ర్డ్ ను ఎలా త‌యారు చేసుకోవాలి.దానికి కావలసిన పదార్థాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

 

స్వీట్ పెరుగు తయారు చేయడానికి కావలసిన పదార్థాలు:-

చిక్క‌ని పాలు: 1 L
చక్కెర- 100 గ్రా,
పెరుగు-3 లేదా 4 టీ స్పూన్లు.

Sweet Curd:మ‌ట్టి కుండ‌ను ఉపయోగించి రుచికరమైన స్వీట్ పెరుగును ఇలా తయారు చేయండి

 

స్వీట్ పెరుగు తయారు చేసే విధానం:-

ముందుగా పెరుగును తీసుకుని జ‌ల్లి గిన్నె లేదా పలుచటి వ‌స్రంలో ఉంచి నీరు లేకుండా చేసుకోవాలి. స్ట‌వ్ మీద గిన్నె పెట్టుకోవాలి. గిన్నె
వేడి అయ్యాక పాలు పోయాలి. ఇప్పుడు పాల ప‌రిమాణం త‌గ్గి పాలు రంగు మారే వ‌ర‌కు మ‌రిగించి స్ట‌వ్ ఆఫ్ చేసుకోవాలి.ఇప్పుడు అదే పాల‌లో 50 గ్రా., ల చక్కెరను వేసి చక్కెర క‌రిగే వ‌ర‌కు తిప్పుతూ ఉండాలి.

 

ఇప్పుడు ఒక క‌డాయిలో మిగిలిన చక్కెరను వేసి క‌లుపుతూ చిన్న మంట‌పై చక్కెర మొత్తం కరిగే వ‌ర‌కు తిప్పుతూ ఉండాలి. చక్కెర పూర్తిగా క‌రిగి సిర‌ప్ లా త‌యార‌వుతుంది. దీనిని ముందుగా మ‌రిగించి ఉంచిన పాల‌లో వేసి బాగా క‌లుపుకోవాలి. ఇలా క‌లుపుకున్న పాల‌ను ఒక మ‌ట్టి కుండ‌లోకి తీసుకోవాలి. పాలు గోరు వెచ్చ‌గా ఉన్న‌ప్పుడు నీళ్లు లేకుండా చేసిన పెరుగును వేసుకోవాలి. ఇప్పుడు పెరుగంతా పాలలో క‌లిసిపోయేలా బాగా క‌లిపి మూతను పెట్టుకోవాలి .

ఈ పాల‌ను ఒక రాత్రి అంతా క‌దిలించ‌కుండా ఉంటే పాలు తోడుకుని పెరుగుగా మారుతుంది. ఇలా చేయ‌డం వ‌ల్ల ఎంతో రుచిగా ఉండే తీయటి పెరుగు త‌యార‌వుతుంది. మ‌ట్టి కుండ‌లో పెరుగును ఉంచ‌డం వ‌ల్ల రుచి పెర‌గ‌డంతోపాటు గ‌ట్టిగా త‌యార‌వుతుంది. మ‌ట్టి కుండ‌ అందుబాటులో లేని వారు మామూలు గిన్నెలో అయినా పాల‌ను తోడువేయ‌వ‌చ్చును . ఇలా త‌యారు చేసుకున్న తీయటి పెరుగు ను తిన‌డం వ‌ల్ల రుచితోపాటు ఆరోగ్యం కూడా మీ సొంత‌మ‌వుతుంది. వేస‌వి కాలంలో ఇలా స్వీట్ క‌ర్డ్ ను త‌యారు చేసుకుని తిన‌డం వ‌ల్ల శ‌రీరానికి చలువ చేస్తుంది.