Nuvvula Karam Podi : ఆరోగ్యకరమైన నువ్వుల కారం పొడి ఇలా తయారు చేసుకొండి
Nuvvula Karam Podi : నువ్వులను మొదటి నుండి మనం వంటలలో వాడే పదార్థాల్లో ఒకటి. నువ్వులు మన శరీరానికి చేసే మేలు అంతా ఇంతా కాదు. నువ్వులలో అధికంగా కాల్షియం ఉంటుంది . నువ్వులు పిల్లల ఎదుగుదలకు అలాగే ఎముకలను దృఢంగా మార్చడంలో ఎంతో మేలు చేస్తాయి. నువ్వులు ఫైబర్ యొక్క గొప్ప మూలం. నువ్వులు ఆరోగ్యకరమైన కొవ్వుల మూలం. నువ్వులు బిపిని తగ్గించడంలో మరియు శరీరంలో నొప్పులను, వాపులను తగ్గించడంలో కూడా సహాయపడతాయి.
నువ్వులలో బి కాంప్లెక్స్ విటమిన్లు ఎక్కువగా ఉంటాయి. ప్రోటీన్ అందించే మొక్కల ఆధారిత ఆహారాలలో నువ్వులు ఉన్నాయి. నువ్వులను ఆహారంలో తరచుగా తీసుకోవడం వల్ల శరీరంలో రోగనిరోధక శక్తి పెరుగుతుంది. నువ్వులను అనేక ఆహార పదార్థాల తయారీకి ఉపయోగిస్తారు. నువ్వులను పొడిగా చేసి పచ్చళ్లను, కూరలను తయారు చేస్తాము. మనం నువ్వుల నూనెను తరచు ఉపయోగిస్తాము. నువ్వులతో ఎంతో రుచిగా ఉండే కారం పొడిని కూడా తయారు చేసుకోవచ్చును . ఇది ఎంతో అద్భుతమైన రుచిని కలిగి ఉంటుంది. దీన్ని అన్నంలో మొదటి ముద్దతో తింటే అనేకమైన లాభాలు కలుగుతాయి. నువ్వుల కారం పొడిని ఎలా తయారు చేయాలి. దీనికి తయారు చేయడానికి కావలసిన పదార్థాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
నువ్వుల కారం పొడి తయారు చేయడానికి కావలసిన పదార్థాలు:-
నువ్వులు – 100 గ్రాములు
ధనియాలు – ఒక టీస్పూన్
కరివేపాకు- గుప్పెడు
ఎండు మిరపకాయలు- 10
జీలకర్ర- అర టీస్పూన్
ఆవాలు – పావు కప్పు
మెంతులు – 5 నుండి 6
పసుపు – చిటికెడు
కచ్చా పచ్చాగా చేసిన వెల్లుల్లి రెబ్బలు- 10
ఉప్పు – రుచికి సరిపడా
Nuvvula Karam Podi : ఆరోగ్యకరమైన నువ్వుల కారం పొడి ఇలా తయారు చేసుకొండి
నువ్వుల కారం పొడి తయారు చేసే విధానము:-
ముందుగా స్టవ్ ఆన్ చేసి దాని మీద కడాయి పెట్టి వేడి చేసుకోవాలి. అలా వేడి అయిన కడాయిలో నూనె పోసి ధనియాలు, ఎండు మిరపకాయలు, కరివేపాకు ఆవాలు, జీలకర్ర మరియు మెంతులు వేసి బాగా వేయించాలి. అలా వేయించిన వాటిలో నువ్వులు కూడా వేయాలి.ఇలా వేయించుకున్న మిశ్రమాన్ని పూర్తిగా చల్లారనివ్వాలి.
ఒక మిక్సీ జార్ లో చల్లారిన మిశ్రమంతో పాటు పసుపు, ఉప్పు కూడా వేసి కొద్దిగా బరకగా ఉండేలా మిక్సీ పట్టుకొని,చివరగా వెల్లుల్లి రెబ్బలను వేసి కొద్దిగా మిక్సీ పట్టుకోవాలి. ఈ విధముగా రుచికరమైన నువ్వుల కారం పొడి తయారవుతుంది. ఈ కారం పొడినిమూత ఉన్న కంటైనర్‌లో ఉంచుకోవాలి.
ఈ విధంగా, కారం పొడి చాలా కాలం పాటు ఉంచబడుతుంది. ఈ కారం పొడిని నల్ల నువ్వులతో కూడా తయారు చేసుకోవచ్చు. రుచికరమైన నువ్వుల కారం పొడిని ఉదయం అల్పాహారంలో తయారు చేసే వివిధ రకాల ఆహార పదార్థాలతోపాటు వేడి వేడి అన్నంలో నెయ్యితో కలిపి తినవచ్చును.నువ్వులతో కారం పొడిని తయారు చేసుకుని తినడం వల్ల రుచిగా ఉండడంతోపాటు శరీరానికి ఎంతో మేలు జరుగుతుంది.