Bisi Bele Bath : రుచికరమైన బిసి బేలే బాత్ ఇలా చేసుకొండి
Bisi Bele Bath : సాధారణంగా ప్రతిరోజూ అనేక రకాల బ్రేక్‌ఫాస్ట్‌లు ఉంటాయి. దోశ, ఇడ్లీ మరియు వడ… ఇలా రకరకాల బ్రేక్‌ఫాస్ట్ ఆప్షన్‌లు ఉన్నాయి. అయితే వీటిని మనం ఇంట్లో కూడా సిద్ధం చేసుకోవచ్చు. అయితే, కొన్ని రకాల బ్రేక్‌ఫాస్ట్‌లు హోటళ్లలో మాత్రమే అందుబాటులో ఉంటాయి. అందులో బిసిబేలేబాత్ ఒకటి. ఇది రుచికరమైనదే కాదు.. మనకు శక్తిని, పోషకాహారాన్ని అందిస్తుంది. దీన్ని ఎలా సిద్ధం చేయాలో చాలా మందికి తెలియదు. దీన్ని ఎలా తయారుచేయాలి .దానిని తయారు చేయాడానికి అవసరమైన పదార్థాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
బిసిబెళేబాత్ తయారీకి కావలసిన పదార్థాలు:-
బియ్యం– కిలోన్నర
కందిపప్పు – పావు కప్పు
కొత్తిమీర – ఒక టేబుల్‌స్పూను
శనగపప్పు – 1 టేబుల్‌స్పూను
మినపప్పు -1 టేబుల్‌స్పూను
జీలకర్ర- ఒక టీస్పూన్
మిరియాలు- 1 టీస్పూన్
మెంతులు- పావు టీస్పూన్
ఎండు మిర్చి- 7
కరివేపాకు- ఒక రెమ్మ
లవంగాలు- 3
దాల్చిన చెక్క – 2 (చిన్నవి)
పచ్చి కొబ్బరి తురుము – 1 టేబుల్ స్పూన్
నానబెట్టిన చింతపండు – కొద్దిగా
నీరు – 8 కప్పులు.
కూరగాయల ముక్కలు..
బంగాళదుంప – 1
క్యారెట్ – 2
బెండకాయ – 2
పొట్లకాయ – 1
సొరకాయ – కొద్దిగా
టమోటాలు – 2
బీన్స్ – 5
బెండకాయ – 2.
తాలింపు చేయడానికి కావలసిన పదార్థాలు:-
జీలకర్ర – 1 టీ స్పూన్
ఆవాలు – ఒక టీస్పూన్
ఎండు మిర్చి- 2
కరివేపాకు – ఒక రెబ్బ
నూనె – 2 టేబుల్ స్పూన్ల
ఇంగువ- ఒక టీ స్పూన్
పొడవుగా తరిగిన ఉల్లిపాయ- 1
తరిగిన పచ్చిమిర్చి- 2
Bisi Bele Bath : రుచికరమైన బిసి బేలే బాత్ ఇలా చేసుకొండి
బిసిబేలేబాట్ తయారీ చేసే విధానము:-
ముందుగా స్టవ్ ఆన్ చేసి దాని మీద ఒక కడాయి పెట్టి వేడి చేయాలి . అలా వేడి అయిన కడాయిలో ధనియాలు, మినప పప్పు, శనగపప్పు, జీలకర్ర, మిరియాలు, కరివేపాకు, ఎండు మిర్చి, మెంతులు, లవంగాలు, దాల్చిన చెక్క, పచ్చి కొబ్బరిని వేసి బాగా వేయించుకోవాలి. ఇలా వేయించిన పదార్థాలను మిక్సీ జార్లో వేసి మెత్తని పొడిలా చేసుకోవాలి.
బియ్యం మరియు కందిపప్పును బాగా కడిగి కుక్కర్‌లో వేయాలి . ఈ కుక్కర్‌లో నాలుగు కప్పుల నీరు మరియు కొంచెం పసుపు వేసి, మూతపెట్టి, మూడు సార్లు విజిల్స్ వచ్చే వరకు మీడియం మంట మీద ఉడికించాలి. తరువాత, కుక్కర్ నుండి మూత తీసి, గంటె సహాయంతో అన్నాన్ని మెత్తగా కలుపుకోవాలి .
ఇప్పుడు స్టవ్ మీద పాన్ పెట్టి నూనె పోసి కాగాక తాళింపు పదార్థాలు వేసి తాళింపు చేసుకోవాలి. ఇవి కొద్దిగా వేగిన తరువాత కూరగాయల ముక్కలు , పసుపు, అలాగే రుచికి సరిపడా ఉప్పు మరియు ముందుగా తయారు చేసిన పొడిని వేసి కలపాలి. ఇలా కలిపిన తరువాత చింతపండు రసంతో పాటు నాలుగు కప్పుల నీళ్లు పోసి చిన్న మంట మీద కూరగాయల ముక్కలను మెత్తగా ఉడికించాలి.
ఇలా కూరగాయలు ఉడికిన తర్వాత ఉడికించిన అన్నం వేసి బాగా కలపాలి. ఈ విధంగా కలిపిన తర్వాత చిన్నమంట మీద 5 నిమిషాలు ఉడికించి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఈ విధముగా రుచికరమైన బిసిబెళేబాత్ తయారు అవుతుంది. వేయించిన జీడిపప్పును ఉపయోగించవచ్చు. ఇప్పటికీ వేడిగా ఉండే బిసిబెళేబాత్ రుచికరమైనది మాత్రమే కాదు, శరీరానికి అవసరమైన అన్ని పోషకాలను కూడా కలిగి ఉంటుంది. అదనంగా, ఇది ఆరోగ్య ప్రయోజనాలను కలిగి ఉంది.