Beetroot Rice: ఇలా బీట్‌రూట్‌ రైస్ తయారు చేసి తినండి

Beetroot Rice: ఇలా బీట్‌రూట్‌ రైస్ తయారు చేసి తినండి

 

Beetroot Rice: మనం తినే రూట్ వెజిటేబుల్స్‌లో బీట్‌రూట్ రైస్ ఒకటి. మన ఆహారంలో బీట్‌రూట్ తినడం వల్ల కలిగే ప్రయోజనాల గురించి మనందరికీ తెలుసు. బీట్‌రూట్ ఖనిజాలు మరియు విటమిన్ల యొక్క గొప్ప మూలం. బీట్‌రూట్ తీసుకోవడం వల్ల నోరు మరియు మలం గులాబీ రంగులోకి మారుతాయి. బీట్ రూట్ బీపీని తగ్గించి గుండె ఆరోగ్యాన్ని పెంపొందించడంలో చాలా మేలు చేస్తుంది. బీట్ రూట్ బరువు తగ్గడానికి సహాయపడుతుంది, మధుమేహం యొక్క ప్రభావాలను నియంత్రిస్తుంది మరియు రోగనిరోధక శక్తిని పెంచుతుంది. ఇది రక్తహీనతను తగ్గిస్తుంది. కంటి చూపును మెరుగుపరుస్తుంది. బీట్‌రూట్‌ను సహజ పద్ధతిలో తినలేని వారు అన్నం వండుకుని తినవచ్చును . ఇది చాలా రుచికరమైనది. ఇందులో ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఉన్నాయి. బీట్‌రూట్ రైస్‌ను ఎలా త‌యారు చేయాలి .దాని తయారు చేయడానికి కావలసిన పదార్థాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

 

బీట్‌రూట్ రైస్ తయారు చేయడానికి కావలసిన పదార్థాలు:-

తరిగిన బీట్‌రూట్- 2. (మధ్యస్థమైనవి)
నానబెట్టిన బియ్యం- మూడు కప్పులు
ఆలివ్ ఆయిల్ – ఒక టేబుల్ స్పూన్
బిర్యానీ ఆకులు – 2
మిరియాలు – అర టీస్పూన్
లవంగాలు – 4
సజీరా- అర టీస్పూన్
యాలకులు – 2
దాల్చిన చెక్క – 4
పచ్చిమిర్చి ముక్కలు- 3
పొడవుగా తరిగిన ఉల్లిపాయ -(పెద్దది)
అల్లం వెల్లుల్లి పేస్ట్ – ఒక టేబుల్ స్పూన్
పసుపు – పావు టీస్పూన్
కారం, అర టీస్పూన్
పచ్చి బఠానీ- సగం కప్పు
తరిగిన పుదీనా ఆకులు- 5 లేదా 6
నీరు – 4 మరియు ఒకటిన్నర కప్పులు
ఉప్పు- రుచికి సరిపడా .

Beetroot Rice: ఇలా బీట్‌రూట్‌ రైస్ తయారు చేసి తినండి

బీట్ రూట్ రైస్ తయారీ చేసే విధానం:-

ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని దాని మీద కుక్క‌ర్ పెట్టి వేడి చేయాలి. అలా వేడి అయిన కుక్క‌ర్ లో నూనె వేసుకోవాలి. నూనె కాగాక దానిలో బిర్యానీ ఆకులు, మిరియాలు లవంగాలు, సజీరా దాల్చిన చెక్క మరియు యాలకులు వేసి వేయించాలి. ఇలా వేగిన మిశ్రమలో తరిగిన పచ్చిమిర్చి, ఉల్లిపాయలు వేసి బాగా వేయించాలి.తరువాత దానిలో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చి వాసన పోయే వరకు బాగా వేయించి పసుపు ,కారంపొడి వేసి బాగా కలుపుకోవాలి.

ఇప్పుడు ఈ మిశ్రమంలో పచ్చి బఠానీలు మరియు పుదీనా ఆకులను కూడా వేసి వేయించిన తరువాత బీట్‌రూట్ ముక్కలు, సరిపడా ఉప్పు వేసి బాగా వేయించుకోవాలి. అలా వేయించిన మిశ్రమానికి నానబెట్టిన బియ్యాన్ని వేసి ఐదు నిమిషాలు పాటు లుపుకొవాలి.తర్వాత నీళ్లు పోసి మూతపెట్టి 3 విజిల్స్ వచ్చేవరకు ఉడికించి, మంటను ఆపివేయండి. మూత తీసి బియ్యాన్ని నెమ్మదిగా కదిలించండి. ఇది చాలా రుచికరమైన బీట్ రూట్ రైస్‌గా తయారవుతుంది. బీట్‌రూట్‌ జ్యూస్‌ని నేరుగా తాగలేని వారు.. బీట్‌రూట్‌ను తినలేని వారు.ఇలా బీట్ రూట్ రైస్‌గా చేసుకుని తిన‌డం వ‌ల్ల కూడా.. బీట్ రూట్ లో ఉండే పోషకాలు మ‌న‌ శరీరానికి ల‌భిస్తాయి.