Sesame Seeds Peanuts Laddu:ఆరోగ్యకరమైన నువ్వుల పల్లి లడ్డు ఇలా చేయండి
Sesame Seeds Peanuts Laddu: మన ఇంట్లో నువ్వులు మరియు ఇతర గింజలతో చేసిన వివిధ రకాల లడ్డూలను తయారు చేస్తాము. ఈ లడ్డులూ రుచికరమైనది మాత్రమే కాదు, శరీరానికి కూడా చాలా మేలు చేస్తుంది. వీటితో పాటు రెండింటినీ కలిపి ఈ లడ్డూలను తయారు చేయగలుగుతున్నాము. అవి కూడా చాలా రుచికరమైనవి. పల్లీలు, నువ్వులతో చేసిన లడ్డూలు చేసి తింటే దృఢంగా మారుతుంది. రక్తహీనత సమస్యలు కూడా తగ్గుతాయి. పిల్లలకు తినిపించే ఆహారపదార్థాలు వారి మెదడును ఉత్సాహంగా ఉంచుతాయి. అవి పిల్లల అభివృద్ధికి చాలా ఉపయోగకరంగా ఉంటాయి.
స్త్రీలు ఈ లడ్డూలను తరచూ ఆహారంగా తీసుకోవడం వల్ల నెలసరి క్రమం తప్పకుండా వస్తుంది. PCODతో సంబంధం ఉన్న సమస్యలు తగ్గుతాయిమరియు ఋతు చక్రం నుండి ఉత్పన్నమయ్యే సమస్యలు తగ్గుతాయి.ఈ లడ్డూలు మగవారికి కూడా అద్భుతమైనవి. వారు ఎదుర్కొనే సమస్యలు తక్కువగా ఉంటాయి. పల్లీలు, నువ్వుల లడ్డూలు సులభంగా తయారు చేసుకోవచ్చు. వీటిని తయారు చేయడానికి అవసరమైన పదార్థాల గురించి ఇప్పుడు తెలుసుకుందాము.
నువ్వులు-పల్లి లడ్డూ తయారీకి కావలసిన పదార్థాలు:-
నువ్వులు- ఒక కప్పు
పల్లీలు – 1 కప్పు
తురిమిన బెల్లం- ఒక కప్పు
నెయ్యి కొంచెం
Sesame Seeds Peanuts Laddu:ఆరోగ్యకరమైన నువ్వుల పల్లి లడ్డు ఇలా చేయండి
నువ్వులు-పల్లి లడ్డూ తయారీ చేసే విధానము:-
ముందుగా స్టవ్ ఆన్ చేసి దాని మీద పాన్ పెట్టి వేడి చేయాలి . అలా వేడి అయిన పాన్ లో పల్లీలను వేసి చిన్న మంత్ మీద దోరగా వేయించి తీసి ఒక ప్లేట్లో పక్కన పెట్టుకోవాలి.ఇప్పుడు అదే పాన్ లో నువ్వులు వేసి రంగు మారే వరకు వేయించుకోవాలి. వీటిని కూడా పల్లీలు ఉంచిన అదే ప్లేట్‌లో కి మార్చాలి. ఇవి బాగా చల్లారిన తరువాత ఒక జార్ లో వేసి మరీ మెత్తగా కాకుండా మిక్సీ పట్టుకోవాలి.ఇప్పుడు ఈ మిశ్రమంలోనే తురిమిన బెల్లం వేసి మరో సారి మిక్సీ పట్టాలి.
ఈ మిశ్రమాన్ని మొత్తము ఒక గిన్నెలో వేసి చేతులకు నెయ్యి రాసుకుంటూ కావల్సిన పరిమాణంలో తీసుకొని లడ్డూలలా చేయాలి. ఈ విధముగా రుచిగా ఉండే నువ్వులు పల్లీల లడ్డూలు తయారవుతాయి. వీటిని పది రోజుల వరకు నిల్వ ఉంటాయి.వీటిని ప్రతిరోజూ తీసుకోవడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు.