Palli Laddu:ఎన్నో పోషకాలు ఉన్న పల్లి లడ్డూలు ఇలా చేయండి
Palli Laddu: మన వంటశాలలలో పల్లీలను వివిధ రకాలుగా ఉపయోగించడం జరుగుతుంది . పల్లీల నుంచి తీసిన నూనెను వండేందుకు ఉపయోగిస్తారు. మనం అల్పాహారం కోసం తయారుచేసే చట్నీలో పల్లీలను తరచుగా ఉపయోగిస్తారు. పల్లీలను పొడిగా చేసి కూరలను. పచ్చళ్లను తయారు చేస్తూ ఉంటాం. పల్లీలను ఉపయోగించి స్వీట్లు కూడా తయారు చేస్తాం. పల్లి లడ్డు (పల్లి ముద్ద) పల్లీలను ఉపయోగించి చేసే స్వీట్లలో ఒకటి. పల్లీలను బెల్లంతో కలిపి తినడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. రక్తహీనతతో బాధపడేవారికి ఇవి చక్కని ఔషధం. విటిని సులభంగా తయారు చేయవచ్చు. పల్లీ లడ్డూలను ఎలా తయారు చేయాలి. దానికి కావలసిన పదార్థాల గురించి ఇప్పుడు తెలుసుకుందాము .
పల్లీ లడ్డూలు తయారు చేయడానికి కావలసిన పదార్థాలు:-
పల్లి – ఒక కప్పు
తురిమిన బెల్లం-ఒక కప్పు
నెయ్యి – 1 టేబుల్ స్పూన్
యాలకుల పొడి- చిటికెడు
నీరు – ఒక గ్లాసు టీ.
Palli Laddu:ఎన్నో పోషకాలు ఉన్న పల్లి లడ్డూలు ఇలా చేయండి
పల్లీ లడ్డూలు తయారు చేసే విధానము :-
ముందుగా స్టవ్ ఆన్ చేసుకోవాలి . దాని మీద ఒక కడాయి పెట్టి వేడి చేసుకోవాలి. కడాయి వేడి అయిన తరువాత దానిలో పల్లీలను వేసి మీడియం వేడి మీద వేయించాలి. పల్లీలుబాగా వేగిన తరువాత వాటిని ఒక ప్లేట్ లోకి తీసుకోవాలి. అవి కొద్దిగా చల్చారిన తరువాత పొట్టును తీసేయాలి.
ఒక గిన్నె తీసుకొని దానిలో బెల్లం తురుమును వేయాలి . ఇప్పుడు బెల్లం తురుము మునిగే వరకు నీళ్లను పోసి బెల్లాన్ని కరిగించాలి.ఇలా కరిగిన బెల్లాన్ని జల్లి గంటెతో వడకట్టాలి.ఇలా చేస్తే బెల్లంలోని మలినాలు తొలగిపోతాయి. ఈ బెల్లం మిశ్రమము ఉన్న గిన్నెను స్టవ్ మీద పెట్టి పాకం వచ్చే వరకు మరిగించాలి. పాకం వచ్చిందా తెలుసుకోవడానికి ఒక ప్లేట్ లో నీటిని తీసుకుని దానిలో ఈ మిశ్రమాన్ని వేసి చేత్తో ఉండలా చేయాలి. బెల్లం మిశ్రమం ఉండలా చేయడానికి వస్తే పాకం తయారు అయినది అర్ధము .
బెల్లం మిశ్రమం ముద్దగా చేయడానికి రాకపోతే మరి కొద్ది సేపు ఉడికించాలి. పాకం వచ్చిన తరువాత యాలకుల పొడి వేసి కలిపి మంటను చిన్నగా చేసి ముందుగా వేయించి పొట్టు తీసి పెట్టుకున్న పల్లీలను కూడా వేసి బాగా కలిపి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడు దీనిలో నెయ్యి వేసి కలపుకోవాలి.
మరొక ప్లేట్ను తీసుకొని నెయ్యిని రాసి పల్లి మరియు బెల్లం మిశ్రమాన్ని ఆ ప్లేట్ లోకి తీసుకుని గోరు వెచ్చగా అయ్యే వరకు చల్చార బెట్టుకోవాలి . ఈ మిశ్రమం గోరు వెచ్చగా అయిన తరువాత మనకు కావల్సిన పరిమాణంలో లడ్డూలలా చేసుకోవాలి. ఈ విధంగా రుచిగా ఉండే పల్లి లడ్డూలు తయారవుతాయి. వీటిని మూత ఉండే గాజు సీసాలో నిల్వ చేయడం వల్ల పది రోజుల పాటు తాజాగా ఉంటాయి.
ఈ పద్ధతిలో తయారుచేసిన పల్లీలు మరియు బెల్లం కలపడం ద్వారా పల్లి పట్టీలను తయారు చేయవచ్చును . రోజుకు రెండు లడ్డూలు తీసుకోవడం వల్ల శరీరానికి ఎంతో మేలు జరుగుతుంది. పెద్దలు మరియు పిల్లలు ఇద్దరూ ఈ లడ్డూలను తినవచ్చును . ఈ పద్ధతిలో లడ్డూలను తయారు చేయడం మరియు తినడం వల్ల బెల్లం మరియు పల్లీలలోని పోషకాలను సద్వినియోగం చేసుకుంటారు. పల్లీ లడ్డూలతో మలబద్ధకం సమస్య నయమవుతుంది. ఎముకలు, దంతాలు బలపడు తాయి. రక్తహీనత సమస్యను దూరం చేస్తుంది. వెన్నునొప్పి ఋతు చక్రాలను తగ్గించడానికి కూడా ఇవి సహాయపడతాయి. గుండె ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది.