Paneer Making:సులభంగా పనీర్ ఇంట్లో తయారు చేసుకోవచ్చు
Paneer Making : రోజంతా పాలు తాగడం మన శరీరానికి మేలు చేస్తుందని మనకు బాగా తెలుసు. పాలు కాల్షియం యొక్క గొప్ప మూలం. పాలు తాగడం వల్ల ఎముకలు బలపడతాయి. అదనంగా, శరీరానికి అవసరమైన ప్రతి పోషకాహారం అందుతుంది. పాలు తాగడం వల్ల దంతాలు ఆరోగ్యంగా ఉంటాయి. మానసిక ఒత్తిడిని కూడా తగ్గిస్తుంది. రోగనిరోధక శక్తిని పెంపొందిస్తుంది. పాలు తాగడం వల్ల విటమిన్ డి లోపం వల్ల వచ్చే ఆరోగ్య సమస్యలను తగ్గించుకోవచ్చును . బరువు తగ్గడానికి పాలు కూడా సహాయపడతాయి.
వివిధ రకాల పదార్థాలను తయారు చేయడానికి పాలను ఉపయోగిస్తాము. పాలతో చేసే వస్తువులలో పనీర్ కూడా ఒకటి. పనీర్‌తో చాలా టేస్ట్‌తో రకరకాల భోజనాలు తయారు చేస్తాం.పన్నీర్ ను ఆహారంగా తీసుకోవడం వల్ల కూడా పాలను తాగడం వల్ల కలిగే ప్రయోజనాలను మనం పొందవచ్చును . మనకు పన్నీర్ బయట ఎక్కువగా దొరుకుతూ ఉంటుంది. దీని ఖరీదు కూడా చాలా ఎక్కువ.
అయితే చాలా సులభముగా పాలను ఉపయోగించి బయట దొరికే పన్నీర్ లాగానే మనం ఇంట్లోనూ దీన్ని తయారు చేసుకోవచ్చును . ఇంట్లో పన్నీర్ ను ఏ విధంగా తయారు చేసుకోవాలి. దానికి కావాల్సిన పదార్ధాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
Paneer Making:సులభంగా పనీర్ ఇంట్లో తయారు చేసుకోవచ్చు
ముందుగా స్టవ్ ఆన్ చేసుకోవాలి. దాని మీద ఒక గిన్నెపెట్టుకోవాలి. గిన్నె వేడి అయ్యికా దానిలో లీటర్ చిక్కని పాలను తీసుకుని 15 నిమిషాల పాటు చిన్న మంటపై మరిగించాలి. పాలు బాగా మరిగిన తరువాత రెండు టేబుల్ స్పూన్ల నిమ్మ రసాన్ని వేసి కలుపుకోవాలి.ఇలా కలిపిన వెంటనే పాలు విరుగుతాయి. ఇప్పుడు మంటను పెద్దగా చేసి మరో 3 నిమిషాల పాటు ఉంచి తరువాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి.
ఒక గిన్నెలో పెద్దగా ఉండే జల్లి గంటేను ఉంచి దానిలో శుభ్రమైన వస్త్రాన్ని ఉంచి విరిగించిన పాల మిశ్రమాన్ని అంతా పోయాలి. దీని వల్ల నీరు అంతా పోతుంది. అదే వస్త్రంలో మిగిలి ఉన్న పాల మిశ్రమాన్ని రెండు సార్లు మంచి నీటితో బాగా కడిగి నీరు లేకుండా చేత్తో పిండుకోవాలి .
తరువాత ఈ మిశ్రమాన్ని సమానంగా ఉండే చెక్క పీట లేదా ప్లేట్ పై వస్త్రాన్ని ఉంచి సమానంగా చేసుకోవాలి. ఇప్పుడు దీని మీద బరువుగా ఉండే రోలు లేదా ఇతర వస్తువులను ఉంచి 2 నుండి 3 మూడు గంటల పాటు అలాగే ఉంచుకోవాలి . ఇలా చేయడం వల్ల నీరు అంతా పోయి మెత్తగా ఉండే పన్నీర్ తయారవుతుంది. ఇప్పుడు ఈ మిశ్రమము మీద ఉండే బరువును తొలగించి పన్నీర్ ను కావల్సిన పరిమాణంలో ముక్కలుగా కట్ చేసుకోవాలి.ఈ పద్ధతిలో తయారుచేసిన పనీర్ బయట కనిపించే పనీర్‌ను పోలి ఉంటుంది.రిఫ్రిజిరేటర్‌లో నిల్వ ఉంచినప్పుడు ఇది రెండు వారాల వరకు తాజాగా ఉంటుంది. ఈ పద్ధతిలో తయారుచేసిన పనీర్‌తో విభిన్నమైన భోజనం వండడం మరియు తినడం రుచికరమైనది మాత్రమే కాదు, ఆరోగ్యానికి కూడా మేలు చేస్తుంది.