Dates Laddu : పంచదార లేకుండా ఖర్జూరా లడ్డూలు ఇలా చేసుకోవచ్చు

Dates Laddu : పంచదార లేకుండా ఖర్జూరా లడ్డూలు ఇలా చేసుకోవచ్చు

 

Dates Laddu: ఖర్జూరం తినడం వల్ల కలిగే ప్రయోజనాల గురించి మనందరికీ తెలుసు. ఇవి తక్షణ శక్తిని అందిస్తాయి. ఇది రోగనిరోధక శక్తిని కూడా పెంచుతుంది. ఇది జీర్ణవ్యవస్థను శుభ్రపరుస్తుంది. ఇది రక్తహీనతను తగ్గిస్తుంది. ఖర్జూరాన్ని అనేక ప్రయోజనాల కోసం ఉపయోగించవచ్చును . ఖర్జూరం నుండి లడ్డూలను కూడా తయారు చేసుకోవచ్చు మరియు వాటిని తినవచ్చును . రోజూ ఖర్జూరం తినడానికి ఇబ్బంది పడే వారు వాటితో లడ్డూలు తయారు చేసుకొని రోజుకు ఒకటి తినవచ్చును . అనేక ప్రయోజనాలు ఉన్నాయి. ఖర్జూరాల‌తో లడ్డూల‌ను ఎలా త‌యారు చేయాలి. దానికి కావలసిన పదార్థాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

 

 

 

ఖర్జూరా లడ్డూల తయారీకి కావలసిన పదార్థాలు:-

జొన్న పిండి- అరకప్పు
ఖర్జూరం- 12 (విత్తనాలు తీసి తర్వాత సన్నగా తరిగినవి)
బాదం ప‌ప్పు, వాల్ న‌ట్స్ తురుము-మూడు టేబుల్ స్పూన్లు
నీళ్లు – అరకప్పు
నెయ్యి- రెండు టీస్పూన్లు
అవిసె గింజలు -1/2 టీస్పూన్.

 

Dates Laddu : పంచదార లేకుండా ఖర్జూరా లడ్డూలు ఇలా చేసుకోవచ్చు

ఖర్జూరా లడ్డూలను తయారు చేసే విధానము:-

ముందుగా స్టవ్ ఆన్ చేసి దాని మీద ఒక గిన్నె పెట్టి వేడి చేయాలి.అలా వేడి అయిన గిన్నెలో జొన్న‌పిండిని వేసి రంగు మారేంత వ‌ర‌కు వేయించుకొని ఆతరువాత ఒక ప్లేట్లో తీసుకొని చ‌ల్లార్చాలి. ఇప్పుడుఅదే గిన్నెలో నీళ్లు పోసి దాంట్లో తురిమిన ఖ‌ర్జూరాలు వేసి చిన్న మంట‌పై ఉడికించాలి. ఖ‌ర్జూరాలు నీళ్ల‌ను పీల్చుకుని మెత్త‌గా అయ్యాకవేయించి పెట్టుకున్న జొన్న పిండి,బాదం, పిస్తా తురుమును వేసి బాగాక‌లుపుకోవాలి. బాగా ఉడికిన ఈ మిశ్ర‌మాన్ని ఉండ‌లుగా చుట్టుకోవాలి .

ఈ లడ్డూలు గుండ్రంగా రావడానికి అర చేతుల‌కు కాస్త నెయ్యి రాసుకుని ఉండ‌లు చుడితే చక్కగా వస్తాయి . ఈ విధముగా ఖ‌ర్జూరా ల‌డ్డూల‌ను తయారు చేసుకోవచ్చును. వీటిని తయారు చెయ్యడానికీ చ‌క్కెర,నూనె వాడకం లేదు. కాబట్టి ఇవి చాలా ఆరోగ్య‌వంత‌మైన‌వి.ఖ‌ర్జూరాల‌ను రెగ్యులర్ గా తిన‌లేని వారు ఇలా ల‌డ్డూల‌ను త‌యారు చేసి రోజుకు ఒక‌టి తిన్నా చాలు.రకరకాల పోషకాలు అందుతాయి. అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. పిల్లలు ఈ లడ్డూలను ఇష్టపడతారు.