Broccoli Fry:ఇంట్లోనే ఎంతో ఆరోగ్యకరమైన బ్రొకలీ ఫ్రై చేసుకోవచ్చును
Broccoli Fry: బ్రోకలీ మనకు ఆరోగ్యకరమైన కూరగాయలలో ఒకటి. ఇది ఆకుపచ్చ మరియు కాలీఫ్లవర్‌ను పోలి ఉంటుంది. ఇది చాలా తక్కువ మొత్తంలో తింటారు. ఇది మనకు మార్కెట్ చాలా తక్కువగా కనబడుతుంది. మీ ఆహారంలో ఇతర కూరగాయలతో పాటు దీనిని చేర్చుకోవడం మన శరీరానికి చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఇది మన శరీరానికి అవసరమైన వివిధ రకాల పోషకాలతో నిండి ఉంటుంది. బ్రోకలీని క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల కంటి చూపు బాగా పెరుగుతుంది. వృద్ధాప్య ఛాయలను తగ్గిస్తాయి. ఆరోగ్యకరమైన జుట్టు ఉంటుంది.
శరీరంలో రోగనిరోధక శక్తి కూడా పెరుగుతుంది. దీనిని తరచూ తింటూ ఉండడం వల్ల పలు రకాల క్యాన్సర్ లు వచ్చే అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయి.ఫైబర్ యొక్క అధిక కంటెంట్ మలబద్ధకాన్ని తగ్గించడంలో సహాయపడుతుంది. ఇది ఎముకల ఆరోగ్యాన్ని మరియు దృఢత్వాన్ని కాపాడుకోవడంలో కూడా సహాయపడుతుంది. బ్రోకలీని సాధారణంగా సలాడ్‌గా తీసుకుంటారు. సలాడ్‌తో పాటు, దీనిని ఫ్రైగా తీసుకోవచ్చును . బ్రోకలీ ఫ్రైను ఎలా తయారుచేయాలి.. దానిని తయారుచేయడానికి అవసరమైన పదార్థాల గురించి ఇప్పుడు తెలుసుకుందాము .
బ్రోకలీ ఫ్రై చేయడానికి కావలసిన పదార్థాలు:-
పెద్దగా తరిగిన బ్రోకలీ- 1 (మీడియం)
నూనె – 1 టేబుల్ స్పూన్
జీలకర్ర- ఒక టీస్పూన్
వేయించిన ధనియాలు- ఒక టీస్పూన్
పుట్నా పప్పు- 2 టేబుల్ స్పూన్లు
వెల్లుల్లి రెబ్బలు – 4
ఎండు కొబ్బరి – చిన్న
పసుపు – పావు టీస్పూన్
కారం – అర టీస్పూన్
తరిగిన కొత్తిమీర – కొద్దిగా
ఉప్పు – తగినంత
Broccoli Fry:ఇంట్లోనే ఎంతో ఆరోగ్యకరమైన బ్రొకలీ ఫ్రై చేసుకోవచ్చును
బ్రకోలీ ఫ్రై తయారు చేసే విధానం :-
ముందుగా ఒక జార్ లో వేయించిన ధనియాలను, అర టీ స్పూన్ జీలకర్రను, పుట్నాల పప్పును, వెల్లుల్లి రెబ్బలను, ఎండు కొబ్బరిని, పసుపు, కొద్దిగా ఉప్పు మరియు కారాన్ని వేసి మెత్తని పొడిలా తయారు చేసుకోవాలి. ఇప్పుడు ఒక కడాయిలో నూనె వేసి నూనె వేడెక్కిన తర్వాత జీలకర్రను వేసి వేయించుకోవాలి. తరువాత బ్రొకలీ ముక్కలను వేసి కలిపి మూత పెట్టి చిన్నమంటపై వేయించుకోవాలి.
ఇలా వేయించుకున్న మిశ్రమానికి ముందుగా మిక్సీ పట్టుకున్న పుట్నాల పొడిని వేసి కలిపి 2 నిమిషాల పాటు వేయించి చివరగా కొత్తిమీరను వేసి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే బ్రొకలీ ఫ్రై తయారవుతుంది. ఇది అన్నం, చపాతీ పుల్కా మొదలైన వాటితో రుచిగా ఉంటుంది. ఇది రుచికరమైనది మాత్రమే కాదు, మొత్తం ఆరోగ్యానికి కూడా చాలా ఉపయోగకరంగా ఉంటుంది.