ఏకాదశి ఎన్ని ఉన్నాయి వాటి వివరాలు
* సంవత్సర పొడుగునా నెలకి రెండు పక్షాలు 1.శుక్ల పక్షము ,2. కృష్ణ పక్షము ఉంటాయి .పక్షానికొక ఏకాదశి చొప్పున్న ..ఇరవైనాలుగు ఏకాదషులుంటాయి . ప్రతి నెలా ఆమావాస్య కి , పౌర్ణమికి ముందు ఈ ఏకాదశులోస్తుంటాయి .
* ప్రతినెలలో పూర్ణిమకి ముందు వచ్చే ఏకాదశిని “శుద్ధేకాదశి(శుద్ధ ఏకాదశి)” అంటారు. సంవత్సరం మొత్తంలోఇటువంటిశుద్ధ ఏకాదశులు 12 వుంటాయి.
ప్రతి నేలా అమావాస్య కి ముందు వచ్చే ఏకాదశి ని ” బహుళ ఏకాదశి ” సంవత్సరం మొత్తం లో ఇటు వంటి బహుళ ఏకాదషులు 12 ఉంటాయి .
- మాసము/పక్షము/తిథి—– పర్వదినం
- చైత్ర శుద్ధ ఏకాదశి———- కామదైకాదశి
- చైత్ర బహుళ ఏకాదశి —— వరూధిన్యైకాదశి
- వైశాఖ శుద్ధ ఏకాదశి— —- మోహిన్యైకాదశి
- వైశాఖ బహుళ ఏకాదశి —- అపరఏకాదశి
- జేష్ఠ శుద్ధ ఏకాదశి ——— నిర్జలైకాదశి
- జేష్ఠ బహుళ ఏకాదశి——- యోగిన్యైకాదశి
- ఆషాఢ శుద్ధ ఏకాదశి —— తొలిఏకాదశి, శయనైకాదశి
- ఆషాఢ బహుళ ఏకాదశి- — కామ్యైకాదశి
- శ్రావణ శుద్ధ ఏకాదశి—- — పుత్రఏకాదశి
- శ్రావణ బహుళ ఏకాదశి —- అజైకాదశి
- భాద్రపద శుద్ధ ఏకాదశి—- -పరివర్తన్యైకాదశి
- భాద్రపద బహుళ ఏకాదశి– ఇంద్రఏకాదశి
- ఆశ్వయుజ శుద్ధ ఏకాదశి- – మహాజ్జయేకాదశి
- ఆశ్వయుజ బహుళ ఏకాదశి- రమైకాదశి
- కార్తీక శుద్ధ ఏకాదశి ——— ఉత్థానైకాదశి, బోధనైకాదశి
- కార్తీక బహుళ ఏకాదశి—— ఉత్పత్యైకాదశి
- మార్గశిర శుద్ధ ఏకాదశి —— ధృవైకాదశి, ఉత్తమైకాదశి
- మార్గశిర బహుళ ఏకాదశి—- సఫలైకాదశి
- పుష్య శుద్ధ ఏకాదశి ——— వైకుంఠఏకాదశి, మోక్షఏకాదశి
- పుష్య బహుళ ఏకాదశి—– తిలైకాదశి
- మాఘ శుద్ధ ఏకాదశి——- భీష్మఏకాదశి, జయైకాదశి
- మాఘ బహుళ ఏకాదశి—- విజయైకాదశి
- ఫాల్గుణ శుద్ధ ఏకాదశి—— అమలవైకాదశి
- ఫాల్గుణ బహుళ ఏకాదశి— పాపవిమోచననైకాదశి