జనగాం జిల్లా పాలకుర్తి మండలం గ్రామాల వివరాలు

 జనగాం జిల్లా పాలకుర్తి మండలం గ్రామాల వివరాలు

తెలంగాణ రాష్ట్రం, జనగామ జిల్లా లోని  పాలకుర్తి మండలం.2016 లో జరిగిన జిల్లాల పునర్వ్యవస్థీకరణకు ముందు ఈ మండలం వరంగల్ జిల్లా లో ఉండేది. ప్రస్తుతం ఈ మండలం స్టేషన్ ఘన్‌పూర్ రెవిన్యూ డివిజనులో  ఒక భాగం. పునర్వ్యవస్థీకరణకు ముందు ఇది జనగామ డివిజనులో ఉండేది.ఈ మండలంలో  21  రెవెన్యూ గ్రామాలు ఉన్నాయి.

మండల జనాభా

ఈ మండల  జనాభా 2011 భారత జనగణన గణాంకాల ప్రకారం మొత్తం  58,194, పురుషులు 29,315, స్త్రీలు 28,879.

1 కోతలాబాద్

2 ఈరవెన్ను

3 తిర్మలగిరి

4 గూడూరు

5 బొమ్మెరా

6 అయ్యంగారిపల్లె

7 తొర్రూర్

8 శతపురం

9 విస్నూర్

10 లక్ష్మీనారాయణ పురం

11 పాలకుర్తి

12 కొండాపురం

13 దర్దేపల్లె

14 తీగరం

15 మైలారం

16 చెన్నూరు

17 మంచుప్పుల

18 వల్మిడి

19 ముత్తారం

20 మల్లంపల్లె

21 వావిలాల

కవి పాల్కురికి సోమనాథుడు జన్మస్థలం

సా.శ. 1190 లో పాలకుర్తి మండలం,పాలకుర్తి గ్రామంలో విష్ణురామిదేవుడు శ్రియాదేవి దంపతులకు సోమనాథుడు జన్మించాడు.సోమేశ్వరుని భక్తుడై ఆ స్వామిమీద సోమనాథ స్తవం కూడా  రాశాడు. జానపద తెలుగు కవిత్వానికి,ద్విపద ఛందస్సుకు ప్రాచుర్యాన్ని చేకూర్చాడు. వీర శైవ మతావలంబకుడు. తెలుగు, కన్నడ భాషలలో అనేక  రచనలు చేశాడు. తెలుగులో ఆనాటి సంప్రదాయానికి భిన్నంగా దేశభాషలో ద్విపద రచనలు చేశాడు.

 

 

Leave a Comment