అయ్యప్ప దీక్ష విరమణ

*_?అయ్యప్ప చరితం – 70_?*
?☘️?️☘️?️☘️?️☘️?️☘️?️
*దీక్ష విరమణ* 
తిరిగి తమ ఊర్లకు చేరుకున్న తరువాత ఇరుముడిలో కట్టి తెచ్చిన బియ్యంతో పొంగలి తయారుచేసి ప్రసాదంగా కుటుంబ సభ్యులందరూ స్వీకరించాలి !
తరువాత ముందుగా మాల వేయించుకున్న గుడికి వెళ్లి గురు స్వాములను దర్శించుకుంటారు మాలధారులు ! గురుస్వామి మంత్రపూర్వకంగా వారి మెడలనుండి మాల తీసివేయడంతో దీక్ష విరమణ జరుగుతుంది !

 

*మాలావిసర్జన మంత్రం*
*అపూర్వమచలా రోగాద్దివ్య దర్శన కారణః* *శాస్త్రుముద్రాత్ మహదేవ దేహిమే*
*వ్రత విమోచన సమస్త సలీద రక్షకనే*
*శరణమయ్యప్ప స్వామియే శరణం*
పై మంత్రాన్ని చెప్పిస్తూ మాలను తీయిస్తారు గురుస్వామి ! ఆయనకు కృతజ్ఞతా పూర్వకంగా దక్షిణ తాంబూలాలు సమర్పించి ఇండ్లకు చేరుకుంటారు  దీక్ష తీసుకుని యాత్ర చేసుకువచ్చిన భక్తులు !
*దీక్షవస్త్రాల పవిత్రత*
యాత్రలో ఎన్నో తీర్థాలలో మునిగి , కాలినడకన వెళ్ళేటప్పుడు ఆ ప్రాంత ధూళి సోకి పునీతవౌతాయి దీక్షాధారులు ధరించే వస్త్రాలు ! వాటిని ధరించి స్వామి దర్శనం చేయడంవల్ల వాటికి మరింత పవిత్రత చేకూరుతుంది ! అందుచేత ఇండ్లకు చేరుకోగానే ముందుగా ఆ వస్త్రాలను విప్పి ఒక పాత్రలో తడిపి , ఆ తడిపిన నీటిని ఇల్లంతా ప్రోక్షించాలి ! తరువాత వస్త్రాలను శుభ్రంగా వుతికి , ఆరిన తరువాత శుభ్రమైన స్థానంలో భద్రపరచుకుని తిరిగి యాత్రకు మరుసటి సంవత్సరం వెళ్ళేటప్పుడు వాడుకోవచ్చును ! ఈ వస్త్రదారణవల్ల చిత్తశుద్ధి కలుగుతుంది ! మనోధైర్యం పెరుగుతుంది !
*దీక్షాకాలంలో వాడుకున్న చాప , దుప్పట్లను దీర్ఘరోగాలతో బాధ పడుతున్న వారికి దానం చేయవచ్చును ! మాలలు జాగ్రత్తగా భద్రపరచుకోవాలి ఇతరులకు ఇవ్వకుండా ! మరు సంవత్సరం వాటినే ధరించాలి ! దీక్షకాలంలో చేసే నియమాలు వచ్చే పుణ్యఫలమంతా మాలలోనే విలీనమై వుంటుంది !*
‘‘శబరిమల అయ్యప్పను ప్రతిరోజూ వెళ్లి దర్శనం చేసుకోవడానికి వీలుకాదు ! ఆలయం కొన్ని ప్రత్యేక కాలాలలోనే తెరిచి వుంటుంది !
ఆలయం తెరిచి వుంచే రోజులు
1.  ప్రతి సంవత్సరం నవంబర్ 16 నుండి డిసెంబర్ 27 వరకు ఆలయం తెరిచి ఉంచుతారు ! ఈ కాలాన్ని మండల పూజాకాలం అంటారు.
2.  జనవరి 1 నుండి 20వ తేదీ వరకు ఆలయం తెరిచి ఉంటుంది. ఈ సమయంలో దేశ విదేశాల నుండి అసంఖ్యాకంగా భక్తులు తరలివస్తారు. మకరజ్యోతి , మకర విళక్కు (దీపం) ఉత్సవాలు చూడటానికి !
3.  మలయాళ పంచాంగం ప్రకారం ప్రతి నెలా మొదటి ఐదు రోజులు ఆలయం తెరిచి వుంటుంది !
4.  అయ్యప్ప స్వామివారి పుట్టినరోజు ఫాల్గుణ మాసం , శుక్లపక్ష పంచమి , ఉత్తరా నక్షత్రంతో కూడిన పర్వదినం ! మార్చి ఆఖరు – ఏప్రిల్ మొదటివారంలో వచ్చే ఈ రోజున *‘ఫాల్గుణి ఉత్తర’* పూజ అని స్వామివారికి జన్మనక్షత్ర విశేష పూజలు జరుగుతాయి !
5. *విషు మహోత్సవం:* మలయాళీయుల  కొత్త సంవత్సరాదిని *‘విషు* ’ అని అంటారు ! ఈ రోజు కేరళ రాష్టమ్రంతటా అయ్యప్పస్వామి వారిని గుడులలో పండ్లు , పూలు , ధాన్యాలతో అలంకరిస్తారు !
???????????

Leave a Comment