అటుకులతో ఆరోగ్యం
అటుకులు మనందరికీ సంప్రదాయమైన చిరుతిండిగానే బాగా తెలుసు. మన పూర్వికులు అటుకులతో దాగి ఉన్న ఆరోగ్య ప్రయోజనాలు మనకందించాలనే ఉద్దేశంతో వీటిని మనకు అలవాటు చేసారు. ఇపుడు మనం పిల్లలకు ఇస్తున్న స్నాక్స్, చిప్స్ వంటి వాటి కంటే అటుకులు ఎంతో బలవర్ధకమైన ఆహారం.
పోషకాలు: అటుకులలో విటమిన్ A, B6 మరియు B12, C, D, E, K లు కూడా ఉంటాయి. కార్బోహైడ్రేట్స్, ఐరన్ ఇంకా ఫైబర్ ఎక్కువమోతాదులో కలిగి ఉంటాయి. సోడియం, పొటాషియం, మరియు మెగ్నీషియం, సెలినియం, పాస్పరస్లు ఉంటాయి. ఎక్కువ మోతాదులో యాంటీ ఆక్సిడెంట్లను కలిగి ఉంటాయి.
ప్రయోజనాలు:
అటుకులలో యాంటీ ఆక్సిడెంట్స్ కొలస్ట్రాల్ ని బాగా తగ్గిస్తాయి.
శరీర కణాలకు ఆక్సిజన్ సాఫీగా సరఫరా అయ్యేలా కూడా సహకరిస్తాయి.
అటుకులు షుగర్ లెవెల్స్ ని బాగా కంట్రోల్ చేస్తాయి. అటుకులు తిన్నతరువాత గ్లూకోజ్ ని చాల నెమ్మదిగా రక్తంలోకి విడుదల చేస్తాయి.
చాల తేలిగ్గా జీర్ణం అవుతాయి.
రక్తహీనత సమస్యని కూడా తగ్గిస్తాయి.
పిల్లలకి, గర్భిణీలకు, బాలింతలకు మంచి బలవర్ధకమైన ఆహారం.
బరువు తగ్గాలనుకునేవారు, షుగర్ పేషన్ట్స్ వారు రోజు తీసుకొనే ఆహారం లో చేర్చుకోవటం మంచిది.
పెరుగులో అటుకులు కలిపి దద్దోజనం లాగా తీసుకోవడం వల్ల కాల్షియం బాగా శరీరానికి అందేలా చేస్తుంది. కీళ్ల నొప్పులు ఉన్నవారికి ఇది అమృతం లాంటిది.