భృంగరాజ్ తైలం
భృంగరాజ్ మొక్క వళ్ళ కలిగే ప్రయోజనాలను మనము తెలుసుకున్నాం. భృంగరాజ్ తైలం (గుంటగలగర ఆకూ తైలం) ప్రయోజనాలను పూర్తిగా పొందాలంటే ఒక మంచి మార్గం. భృంగరాజ్ తైలం ఇంట్లోనే తయారుచేసుకోవచ్చును .
పల్లెటూళ్లలో ఎక్కువగా గా దొరికే ఈ భృంగరాజ్ పట్టణ ప్రాంతాలలో దొరకడం చాల కష్టం. అన్ని ఆయుర్వేదిక్ స్టోర్స్ లో భృంగరాజ్కూడా దొరుకుతున్నాయి. అందువల్ల పచ్చి ఆకులూ దొరకకపోతే ఎండిన ఆకులూ లేదా పౌడర్ తో ఈ ఆయిల్ ను తయారుచేసుకోవచ్చును .
కావాల్సిన పదార్థాలు:
ఒక కప్పు- భృంగరాజ్ ఆకులని బాగా నూరి మెత్తని ముద్దగా చేసుకోవాలి/భృంగరాజ్ పౌడర్/భృంగరాజ్ ఎండిన ఆకులూ.
కప్పులు- కొబ్బరి నూనె/నువ్వుల నూనె.
తయారుచేసే విధానం:
కొబ్బరి నూనె లేదా నువ్వుల నూనె రెండు కప్పులు ఒక గిన్నెలో తీసుకొని స్టవ్ మీద పెట్టాలి. దీనిలో 1 కప్పు భృంగరాజ్ నూరిన ఆకూ లేదా పౌడర్ లేదా ఎండిన ఆకులూ వేసి సన్నని మంట మీద 15 నుంచి 20 నిముషాలు వరకు వేడిచేయాలి. దీని వల్ల ఆకులలోని ఔషధ గుణాలు అన్ని నూనెలో చేరుతాయి. ఈ ఆయిల్ చల్లారిన తరువాత వడకట్టి ఒక గాజు సీసాలో నిల్వ చేసుకోవాలి. తలస్నానం చేయడానికి రెండు గంటల ముందు ఈ నూనెని కుదుళ్ళకి, జుట్టుకి బాగా అప్లై చేసి మసాజ్ చేసుకోవాలి . తరువాత మైల్డ్ షాంపూ తో లేదా హెర్బల్ షాంపూ తో తలస్నానం చేయాలి.ఇలా వారానికి 2 సార్లు చేస్తూ ఉంటె మంచి ఫలితం ఉంటుంది.
ఇలా తరచు చేయడం వల్ల చిట్లిన జుట్టు తిరిగి ఆరోగ్యాంగా తయారవుతుంది.జుట్టు రాలటం కూడా తగ్గుతుంది. ఒత్తుగా పెరుగుతుంది. కాంతివంతంగా తయారవుతుంది. తలలో ఫుల్లు, చుండ్రు, పేళ్లు కూడా బాగా తగ్గుతాయి.