శరీర దుర్వాసన పోవాలంటే ఏం చేయాలి?
పొద్దున్నే శుభ్రంగా స్నానం చేసినప్పటికీ, మధ్యాహ్నానికి శరీరం నుంచి వచ్ఛే చెమట వాసన చాలా ఇబ్బందిపెడుతుంది. శరీరం నుంచి వచ్చే దుర్వాసనను పొగొట్టడానికి ఈ క్రీంది చిట్కాలను పాటిస్తే చాలా మంచి ప్రభావం కూడా కనిపిస్తుంది.
- ఒక బకెట్ నీళ్లలో టేబుల్ స్పూన్ తేనెను కలిపి, ఆ నీటితో స్నానం చేయండి. చెమట కానీ, చెమట నుండి వచ్ఛే వాసన కానీ మీకు రాదు .
- వేసవిలో ఎక్కువ భాగం కాటన్ దుస్తులను ధరించడం వల్ల శరీరానికి బాగా గాలి అందుతుంది. ఫలితంగా దుర్వాసన మీకు రాదు.
- టీ, కాఫీలు చెమట ఉత్పత్తికి కారకాలు. కాబట్టి చెమట వాసన నుంచి తప్పించుకోవడానికి టీ, కాఫీలకు చాల దూరంగా ఉండండి.
- రోజువారీ తీసుకునే ఆహారంలో 20 శాతం మాంసకృతులు, 20 శాతం నూనెలు, కొవ్వు పదార్థాలు మరియు పండ్లు ఉంటే చెమటను దూరం చేసుకోవచ్చ్చును .
- స్నానపు నీటిలో ఉడికించిన పుదినా ఆకులను వేసి స్నానం చేస్తే చర్మం ఎక్కువసేపు తాజాగా కూడా ఉంటుంది.
- సోంపు గింజలు నోటినే కాకుండా శరీర వాసన రాకుండా చాల ప్రభావితం చేస్తాయి. రోజూ ఒక స్పూన్ సోంపు గింజలను తినడం చాల మంచిది .