వంకాయ అద్భుత ఆరోగ్య ప్రయోజనాలు,Health Benefits Of Brinjal

వంకాయ అద్భుత ఆరోగ్య ప్రయోజనాలు,Health Benefits Of Brinjal

వంకాయ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. ఇది ఆహార ప్రేమికులకు ఇష్టమైన కూరగాయలలో ఒకటి. గుత్తి వంకాయ కూరను ఇష్టపడని వ్యక్తులు ఎవరుంటారు చెప్పండి. అయితే కొందరు మాత్రం వంకాయను తినేందుకు వెనకాడతారు. ఎందుకంటే అందరికీ వంకాయ పడదు. స్కిన్ అలర్జీలతో బాధపడేవారు వంకాయకు దూరంగా ఉండటమే  చాలా మంచిది. ఎక్కువ గా  కాకుండా వారానికి ఒక్కసారి వంకాయను ఆహారంగా తీసుకున్నా చాలు.

వంకాయ తొక్క‌లో ఫైబ‌ర్‌, పొటాషియం మరియు  మెగ్నిషియంలు పుష్క‌లంగా ఉంటాయి. దీంతో మ‌న శ‌రీరానికి పోష‌ణకు  కూడా  ల‌భిస్తుంది. వంకాయ‌ల్లో పాస్ఫ‌ర‌స్‌, ఐర‌న్‌, కాల్షియం, విట‌మిన్ బి1, బి2, బి3 మరియు  బి6లు పుష్క‌లంగా ఉంటాయి. అందువ‌ల్ల జీర్ణ‌వ్య‌వ‌స్థ‌లో ఏవైనా స‌మ‌స్య‌లు ఉంటే పోతాయి. క్రమం తప్పకుండా వంకాయను  తీసుకొంటే శరీరంలోని కొలెస్ట్రాల్ స్థాయిలు చాలా తగ్గుతాయి. అంతేకాకుండా మీ రక్తపోటు సాధారణ స్థాయిలో నిర్వహించడానికి కూడా సహాయపడుతుంది. నిద్రలేమి సమస్యతో బాధపడేవారు పడుకోడానికి సుమారు 4 గంటల ముందు కాల్చిన వంకాయని తినడం చాలా  ఉత్తమం.

 

వంకాయ అద్భుత ఆరోగ్య ప్రయోజనాలు,Health Benefits Of Brinjal

ఆరోగ్య ప్రయోజనాలివే:

  •   వంకాయలో పిండి పదార్థాలు మరియు  ఫైబర్  చాలా సమృద్ధిగా ఉంటాయి.
  •  వంకాయలోని పొటాషియం శరీరంలోని హైడ్రైట్లను తొలగించి గుండె సమస్యలు రాకుండా  నివారిస్తుంది.
  •  వంకాయ శరీరంలో కొవ్వులను బాగా  కరిగిస్తుంది.
  •  రక్త ప్రవాహాన్ని కూడా మెరుగుపరుస్తుంది.
  •  వంకాయలోని ఫోలేట్, పొటాషియం, మెగ్నీషియం మరియు  విటమిన్ బీ3, బీ6, బీటా కేరోటిన్, యాంటీఆక్సిడెంట్లు తదితర పోషకాలు ఉంటాయి .  గుండెపోటు మరియు  స్ట్రోక్ ముప్పును కూడా  తగ్గిస్తాయి.
  •  వంకాయ శరీరంలోని అదనపు ఐరన్‌ను కూడా తొలగిస్తుంది.
  •  వంకాయలో కరిగే పైబర్ ఎక్కువగా ఉంటుంది. అందువల్ల తినగానే కడుపు నిండినట్లు కూడా ఉంటుంది.
  • మధుమేహం రోగుల రక్తంలోని చక్కెర్ల (గ్లోకోజ్) స్థాయిని తగ్గించడంలో వంకాయ బాగా పనిచేస్తుంది.
  •  వంకాయ శరీరంలోని విషతుల్యాలను మరియు వ్యర్థాలను కూడా  తొలగిస్తుంది.
  •  శరీరానికి అందే కెలోరీలను బర్న్ చేసి బరువు తగ్గేందుకు బాగా  సహకరిస్తుంది.
  •  వంకాయ జీర్ణక్రియను  బాగా మెరుగుపరుస్తుంది.
  •  ఉబ్బసం, మలబద్ధకం, పేగు సంబంధిత సమస్యలు మరియు  పుండ్లు, పెద్ద పేగు క్యానర్సన్లు తగ్గించడంలో కీలకంగా పనిచేస్తుంది.
  •  వంకాయ శరీరానికి పడితే చర్మంపై ముడతలు లేకుండా యాంటీ ఏజింగ్  మరియు ఏజెంట్‌గా కూడా  పనిచేస్తుంది.
  •  జుట్టు బలోపేతం కావడానికి వంకాయ సహకరిస్తుంది. జుట్టు ఎదుగుదలకు అవసరమైన పోషకాలను కూడా అందిస్తుంది.
  •  మలేరియా వ్యాధితో బాధపడుతున్న వ్యక్తులకు కాల్చిన వంకాయకు కాస్త చక్కర ముట్టించి ఇవ్వాలంటారు.
  •  నిద్రలేమి సమస్యతో బాధపడేవారు పడుకోడానికి సుమారు 4 గంటల ముందు కాల్చిన వంకాయని తినడం  చాలా  ఉత్తమం.
  •  వంకాయ గుత్తి మూలశంక (పైల్స్), హేమరాయిడ్స్ నివారణ చికిత్సలో కూడా  ఉపయోగిస్తారు.
  •  వంకాయ శరీర వాసనను  కూడా నివారిస్తుంది.
  •  వంకాయలోని ఫైబర్ శరీరంలోని విషాన్ని, రసాయనాలను గ్రహించి పెద్ద పేగు క్యాన్సర్ నుంచి రక్షిస్తుంది.
  •  శరీరంలోని కణాలు.. క్యాన్సర్ గడ్డలుగా ఏర్పడకుండా వంకాయ కాపాడుతుంది.
  •  కీళ్ల నొప్పుల నుంచి ఉపశమనం కోసం వంకాయను పిండి కట్టుల్లో  కూడా వాడతారు.
  •  వంకాయలో సోడియం తక్కువ. కాబట్టి.. బీపీ సమస్యతో బాధపడేవారు తినొచ్చును .

Tags:brinjal health benefits,health benefits of eggplant,health benefits of brinjal,eggplant health benefits,health benefits,benefits of brinjal,brinjal benefits,amazing health benefits of brinjal,brinjal,health benefits of brinjals,eggplant benefits for health,benefits of eggplant,health tips,eggplant benefits,health,brinjal health benefits in tamil,health benefits of brinjal curry,health benefits of brinjal curry in telugu

Leave a Comment