మునగాకు– మానవుల పాలిట సంజీవని
పోషకాలు:
ఐదు రకాల క్యాన్సర్ నివారణలో మునగాకు ఉపయోగపడుతుంది.
మునగాకు యాంటీ ట్యూమర్స్ గా కూడా బాగా పనిచేస్తుంది.
థైరాయిడ్ ను రెగ్యులేట్ చేస్తుంది. షుగర్ లెవెల్స్ ని కూడా కంట్రోల్ చేస్తుంది.
మునగాకు కషాయం రోజు తాగడం వలన దృష్టి మాంద్యం మరియు రేచీకటి కూడా తొలగిపోతాయి.
ముందుగా వచ్ఛే కీళ్ల నొప్పులకు మునగాకు లేపనంతో కట్టు కట్టుకోవటం వలన తొందరగా తగ్గిపోతాయి . మునగాకును చర్మ వ్యాదులకు లేపనంగా వాడుతారు.
మునగాకు రసాన్ని, దోసకాయ రసంతో కలిపి తాగటం వలన గుండె, మూత్ర పిండాల మరియు కాలేయం లో వచ్ఛే సమస్యలు క్రమంగా కూడా తగ్గిపోతాయి.
మునగాకు రసం ఒక చెంచా కొబ్బరి నీళ్లలో కలిపి తీసుకోవటం వల్ల విరోచనాలు కూడా తగ్గుతాయి.
మునగాకు రసం గర్భిణీలకు మరియు బాలింతలకు అమృతం లాంటిది. బాలింతలకు మునగాకుతో కూరలు చేసి తినిపించటం వలన పాలు బాగా అభివృద్ధి చెందుతాయి .
మునగాకు రసాన్ని తరచు తీసుకోవటం వలన రక్తహీనత సమస్యలు కూడా చాలా వరకు తగ్గిపోతాయి.
మునగాకు రసాన్ని పాలలో కలిపి పిల్లలకు తాగించటం వలన ఎముకలు చాలా గట్టి గా మారుతాయి .
మునగాకు కషాయం తయారు చేసి అందులో కొంచెం ఉప్పు, మిరియాలపొడి మరియు నిమ్మరసం కలిపి తాగితే దగ్గు, టి.బి , ఆస్తమా వంటి వ్యాదులు కూడా తగ్గుతాయి.