స్ట్రాబెర్రీస్ వలన లాభాలు నష్టాలు
స్ట్రాబెర్రీలలో ఉండే ఫెనోలిక్ కంపౌండ్స్ కాన్సర్ కణతిని తగ్గించడంలో తోడ్పడతాయి. ముక్యంగా రొమ్ము కాన్సర్ ను నయం చేయడంలో దోహదపడతాయి.
రక్తంలో కొవ్వుశాతం తగ్గిస్తాయి. గుండె సమస్యలకు చెక్ పెడతాయి.
దీనిలో అధిక మోతాదులో ఉండే ఫైబర్ పొట్ట దగ్గరి కొవ్వుని కరిగించి మంచి శరీర ఆకృతిని ఇస్తుంది.
వీటిలో చాలా తక్కువగా ఉండే క్యాలోరిస్ డైట్ పాటించేవారికి చాలా బాగా ఉపయోగపడతాయి.
బరువుని నియంత్రించే హార్మోన్ల పనితీరుని క్రమబద్దీకరించే ఎల్లాజిక్ యాసిడ్ స్ట్రాబెర్రీలలో ఉంటుంది. అందువల్ల బరువు నియంత్రణలో ఉండేలా చేస్తుంది.
అజీర్ణ సమస్యలను తగ్గించి, గ్యాస్, మలబద్దకం, అసిడిటీ తదితర సమస్యల నుండి ఉపశమనం కూడా కలిగిస్తుంది.
వీటిలో ఉండే ఆంథోసనియన్స్ ఆడిపోనెక్టిం అనే హార్మోన్ ను ఉత్పత్తి చేస్తాయి. ఇవి మన శరీర మెటబాలిజమ్ ను బాగా నియంత్రిస్తుంది.
స్ట్రాబెర్రీలను రెగ్యులర్ గ తినడం వలన ఏజింగ్ ప్రాసెస్ ను తగ్గించి యవ్వనంగా కనిపించేలా చేస్తాయి.
కంటి ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది.
గర్భిణీ స్త్రీలు వీటిని తగిన మోతాదులో తీసుకోవడం వల్ల పుట్టబోయే బిడ్డ కదృష్టి లోపాలు లేకుండా పుడతారు.
- స్ట్రాబెర్రీలలో బ్లాక్ బెర్రీస్ తినదగినవి కావు.
- గర్భిణీ స్త్రీలు వీటిని తగిన మోతాదులో మాత్రమే తీసుకోవాలి.