ఆమ్లా సబ్జీ తయారీ విధానం

ఆమ్లా సబ్జీ తయారీ విధానం

కావలసినవి
ఉసిరికాయ ముక్కలు (గింజలు తీసేసి) – ఒక కప్పు, ఆవనూనె – అర టేబుల్‌ స్పూను, పచ్చిమిర్చి – రెండు (నిలువుగా తరిగి), కారం, జీలకర్ర – ఒక్కొక్కటీ ఒక్కో అర టీస్పూను, పసుపు -పావు టీస్పూను, సోంపు – అర టీస్పూను (కచ్చాపచ్చాగా పొడిచేసి), ధనియాలు – ఒక టీస్పూను (కచ్చాపచ్చాగా పొడిచేసి), ఇంగువ – చిటికెడు, ఉప్పు – రుచికి సరిపడా, బెల్లం తరుగు – ఒక టేబుల్‌స్పూను. కూరపై చల్లడానికి – కొత్తిమీర తరుగు కొద్దిగా.
తయారీవిధానం
నాన్‌స్టిక్‌ పాన్‌లో నూనె వేడిచేసి పచ్చిమిర్చి ముక్కలు, జీలకర్ర, ఆవాలు వేసి సన్నని మంటపై దోరగా వేగించాలి. అందులో ఆమ్లా ముక్కలు వేసి సన్నని మంటపై మూడు నిమిషాలు ఉడికించాలి. ఉడికే క్రమంలో ఈ ముక్కల్ని మధ్య మధ్యలో కలపాలి.
ఆ మిశ్రమంలో కారం, పసుపు, సోంపు, ధనియాల పొడులు, ఇంగువ, ఉప్పు వేసి బాగా కలిపి ఒక నిమిషం ఉడికించాలి. తర్వాత అరకప్పు నీళ్లు, రెడీగా పెట్టుకున్న బెల్లం తరుగు వేసి బాగా కలిపి మూత పెట్టి నాలుగు నిమిషాలు ఉడికించాలి. మధ్య మధ్యలో ఈ మిశ్రమాన్ని గరిటెతో కలపాలి. కూర దగ్గర పడిన తర్వాత దించి దానిపై కొత్తిమీర తరుగు చల్లి వేడి వేడి అన్నంతో తింటే ఎంతో రుచిగా ఉంటుంది.