అర్జున చెట్టు బెరడు ప్రయోజనాలు ఉపయోగాలు మరియు దుష్ప్రభావాలు

అర్జున చెట్టు బెరడు ప్రయోజనాలు ఉపయోగాలు మరియు దుష్ప్రభావాలు

అర్జున బెరడు అంటే ఏమిటి?
అర్జున చెట్టు టెర్మినల్యా జాతికి చెందిన సతత హరిత (evergreen) చెట్టు. అది కరక్కాయ చెట్టు (టెర్మినాలియా చెబులా) మరియు బహేదా చెట్టు (టెర్మినలియా బెల్లెరికా) వంటి ఔషధ అద్భుతాలతో పాటుగా కూడా   ఉంది. ఈ అలంకార చెట్టు యొక్క ఔషధ సామర్ధ్యం దాని లోపలి బెరడులో ఉంది.  దీన్ని గుండెకు ఒక టానిక్గా  కూడా భావిస్తారు. నిజానికి, ఈ చెట్టు యొక్క ప్రస్తావన రిగ్ వేదంలో కనిపిస్తుంది. ఆయుర్వేద వైద్యులు ఎక్కువగా గుండె ఆరోగ్యాన్ని పెంచుకోవడానికి అర్జున బెరడును సూచిస్తారు. వైద్యపరంగా మాట్లాడితే, అర్జున చెట్టు యొక్క బెరడు వివిధ రకాల గుండె వ్యాధులలో గుండె ఆగిపోవడం, గుండెపోటు మరియు గుండె వైకల్యాలలో దాని వైద్య ప్రయోజనాల కోసం చాలా అధ్యయనం కూడా చెయ్యబడింది. అర్జున బెరడును హృదయ చక్రంగా (మానవ శరీరం యొక్క శక్తి కేంద్రం) విశ్వసిస్తారు మరియు దాని ఔషధ లక్షణాలను పశ్చిమ మూలికలలో హవ్తోర్న్ అను పొద తో కూడా  పోలుస్తారు.
భారతదేశంలో జన్మించిన, అర్జున చెట్టు సాధారణంగా నదులు మరియు ప్రవాహాల సమీపంలో దొరుకుతుంది.  ఇది 25 నుండి 30 మీటర్ల ఎత్తు వరకు పెరుగుతుంది. అర్జున బెరడు నునుపుగా మరియు బూడిద రంగులో ఉంటుంది.  కానీ మధ్యలో కొన్ని ఆకుపచ్చ మరియు ఎరుపు మచ్చలు కలిగి ఉంటుంది. అర్జున ఆకులు దీర్ఘచతురస్రాకారంలో ఉంటాయి మరియు దాని శాఖలలో ప్రతి ఆకు ఎదురు ఎదురుగా ఉంటాయి. మే నుండి జూలై నెలల్లో ఈ చెట్టుకు తెల్లటి పుష్పాలు వికసిస్తాయి. అర్జున పండు పచ్చిగా ఉన్నప్పుడు ఆకుపచ్చగా ఉంటుంది మరియు పక్వానికి చేరినప్పుడు ముదురు గోధుమ రంగులోకి కూడా మారుతుంది. అర్జున పండుకు ప్రత్యేకమైన రెక్కలు ఉంటాయి అవి ఈ పండును గుర్తించదగ్గ లక్షణాలలో ఇది ఒకటి.
మీకు తెలుసా?
టెర్మినలియా అనేది లాటిన్ పదం నుండి ఉద్భవించింది. అనగా చివరిది అని అర్ధం. ఇది దాని శాఖల చివరన పెరిగే అర్జున వృక్షపు ఆకులు గురించి చెప్పి ఉండవచ్ఛును  . అర్జున అంటే తెలుపు లేదా ప్రకాశవంతమైనది అని అర్ధం, దానికా పేరు దాని తెల్ల పువ్వులు లేదా దాని మెరిసే తెల్ల బెరడు వలన  అని నమ్ముతారు.

అర్జున చెట్టు గురించి కొన్ని ప్రాధిమిక నిజాలు.

శాస్త్రీయ నామము: టెర్మినేలియా అర్జున (Terminalia arjuna)
కుటుంబం: కంబ్రెటేసీ (Combretaceae)
సాధారణ నామము: అర్జున వైట్ మారుడా
సంసృత నామము: అర్జునా, ధవళ, నదీసర్జ
ఉపయోగపడే భాగాలు: బెరడు

స్థానిక ప్రాంతం మరియు భౌగోళిక వెస్తిర్ణం
: అర్జున చెట్టు స్థానిక ప్రాంతం ఇండియా మరియు శ్రీలంక కానీ బాంగ్లాదేశ్, నేపాల్, పాకిస్తాన్, ఇండోనేషియా, థాయిలాండ్ మరియు మలేషియాలో కూడా కనిపిస్తుంది.

శక్తి శాస్త్రం
: అర్జున బెరడు పిత్త మరియు కఫాలను తగ్గించి వాటాన్ని పేంచుతుంది.  కాబట్టి అది శరీరం పై చల్లని ప్రభావాన్ని  కూడా చూపిస్తుంది.
 • అర్జున చెట్టు బెరడు ఆరోగ్య ప్రయోజనాలు
 • అర్జున బెరడు ఎలా ఉపయోగించాలి
 • అర్జున బెరడు మోతాదు
 • అర్జున చెట్టు బెరడు దుష్ప్రభావాలు

 

అర్జున చెట్టు బెరడు ఆరోగ్య ప్రయోజనాలు

అర్జున చెట్టు బెరడుకి చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి.  కానీ ముఖ్యంగా అది గుండె ఆరోగ్యంలో మెరుగైనది. అర్జున చెట్టు ఆరోగ్య ప్రయోజనాలు .
రక్తపోటును నియంత్రిస్తుంది: అర్జున బెరడు రక్తపోటును నియంత్రించడానికి ఇతర మూలికలతో కలిపి ఇవ్వబడుతుంది. ఇది శ్వాస అందకపోవడాన్ని మరియు సిస్టోలిక్ రక్తపోటును తగ్గిస్తుందని  కూడా కనుగొనబడింది.
ఎథెరోస్క్లెరోసిస్ను నిరోధిస్తుంది: పాలుతో కలిపి అర్జున బెరడు తీసుకున్నప్పుడు, అది కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గిస్తుందని శాస్త్రీయంగా కూడా నిరూపించబడింది. యాంటియోక్సిడెంట్గా  ఉండటం వలన ఇది లిపిడ్ పెరాక్సిడేషన్  కూడా నిరోధిస్తుంది.  అందువలన ఎథెరోస్క్లెరోసిస్ ప్రమాదాన్ని  కూడా తగ్గిస్తుంది.
గుండెకు మంచిది: అర్జున బెరడు కొలెస్ట్రాల్ మరియు రక్తపోటును కూడా  తగ్గిస్తుంది.  హృదయ వ్యాధులకు ఈ రెండు ప్రధాన ప్రమాద కారకాలు. యాంటీఆక్సిడెంట్ మరియు యాంటీ-క్లాటింగ్  ఏజెంట్ ( anti-clotting agent) కావడం వలన ఇది స్ట్రోక్, గుండెపోటు మరియు వయసు-ఆధారిత హృదయ సంబంధ సమస్యలను కూడా  నిరోధిస్తుంది.
యాంటీమైక్రోబియల్: అర్జున బెరడు సారాలు  MRSA మరియు VRSA వంటి  అత్యంత సాధారణ యాంటీబయాటిక్ నిరోధక జాతులు రెండు, ఇవి చర్మ వ్యాదులను కలిగిస్తాయి. వాటిపై అర్జున బెరడు యాంటీబయాటిక్ చర్యలు ప్రదర్శింశిస్తుందని నిర్దారించబడింది. దాని యాంటీబయాటిక్ చర్యలు   గ్రామ్ పాజిటివ్  బ్యాక్టీరియాకు మాత్రమే పరిమితం.
రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గించడం, దగ్గును నివారించడం, మరియు అదనపు ఆమ్లత్వం యొక్క హానికరమైన ప్రభావాల నుండి కడుపు గోడల్ని రక్షించడంలో అర్జున బెరడు సమర్థవంతంగా  కూడా పనిచేస్తుంది. అయితే, క్లినికల్ అధ్యయనాలు  లేకపోవటం వలన, అర్జున బెరడు యొక్క ఈ ప్రయోజనాలు చాలా ధ్రువీకరించబడదు.
 • గుండె కోసం అర్జున మూలిక
 • కొలెస్ట్రాల్ కోసం అర్జున మూలిక
 • రక్తపోటు కోసం అర్జున బెరడు
 • మధుమేహం కొరకు అర్జున బెరడు
 • దగ్గు కోసం అర్జున బెరడు
 • అర్జున బెరడు ఒక ప్రతిస్కంధక కర్త (రక్తం గడ్డకట్టడాన్ని నిర్ములించేది) రక్తస్రావ వ్యాధులకు అర్జున బెరడు
 • కడుపు పండ్ల కోసం అర్జున బెరడు
 • విరిగిన ఎముకల కోసం అర్జున బెరడు
 • అర్జున బెరడు ఒక యాంటీఆక్సిడెంట్
 • అర్జన బెరక్ ఒక యాంటీమైక్రోబియల్

 

గుండె కోసం అర్జున మూలిక

మయో కార్డియల్ ఇన్ఫెక్షన్, కరోనరీ హృదయ వ్యాధి మరియు ఇస్కీమిక్ అటాక్ వంటి హృదయనాళ సమస్యల చికిత్స కోసం అర్జున చెట్టు బెరడు పొడిని ఆయుర్వేదిక వైద్యులు కూడా సూచిస్తున్నారు. దీని క్రమమైన వినియోగం ప్రమాదాన్ని తగ్గించడమే కాక, పూర్తి హృదయ ఆరోగ్యం మరియు పనితీరును  బాగా మెరుగుపరుస్తుంది.
గుండె వైఫల్యం మరియు గుండె సంబంధిత వ్యాధులను వ్యవహరించడంలో అర్జున చెట్టు బెరడు యొక్క సామర్థ్యాన్ని పరీక్షించడానికి అనేక జంతు-ఆధారిత మరియు క్లినికల్ అధ్యయనాలు నిర్వహించబడ్డాయి. అర్జున వృక్షం యొక్క బెరడు ఎన్నో చురుకైన జీవ సమ్మేళనాలను (active biological compounds) కలిగి ఉంటుంది.  ఇందులో ఫ్లేవానాయిడ్లు, టానిన్లు మరియు ఖనిజాలు ఉన్నాయి.  ఇవన్ని కలిసి ఈ చెట్టును అత్యుత్తమ కార్డియోప్రొటెక్టివ్ (cardioprotective) గా  కూడా చేసాయి.
ఒక క్లినికల్ అధ్యయనంలో, పదిమంది గుండె జబ్బు రోగులకు మూడు నెలల పాటు సంప్రదాయ ఔషధాలతో పాటు అర్జున చెట్టు బెరడు పొడిని ఇవ్వగా, నియంత్రణ బృందానికి కార్డియోప్రొటెక్టివ్ మరియు వ్యాధిని తగ్గించే ఔషధాలను మాత్రమే ఇచ్చింది. మూడు నెలల తర్వాత, అర్జున బెరడు పొడిని ఇచ్చిన బృందం యొక్క గుండె ఆరోగ్యం ప్రత్యేకంగా ఎడమ జఠరిక (ventricle) (గుండె యొక్క భాగం) ను బలపరిచే విధంగా గణనీయమైన మెరుగుదల  కూడా చూపింది.
మరొక అధ్యయనంలో, అర్జున బెరడు మరియు అశ్వఘాంధ గుళికలు 40 మంది ఆరోగ్యకరమైన వ్యక్తులకు 8 వారాల పాటు ఇవ్వబడ్డాయి. 8 వారాల తర్వాత, హృదయనాళ నిలకడను మెరుగుపరచడంలో అర్జున బెరడు ప్రభావవంతంగా ఉండగా, ఆశ్వగంధ సాధారణ హృదయ బలహీనతను కూడా  తగ్గించింది. అదనంగా, అర్జున బెరడు అనేది అద్భుతమైన యాంటియోక్సిడెంట్ మరియు యాంటీ ఇన్ఫ్లమేటరి, ఇది గుండె కణజాలంపై ఒత్తిడిని కూడా  తగ్గిస్తుంది .  గుండె కండరాలకు సంబంధించిన క్షీణతను ఏ వయసు వారికైనా తగ్గిస్తుంది. అయినప్పటికీ, మీరు అర్జున బెరడు పొడి యొక్క సరైన మోతాదును తెలుసుకోవడానికి మీ ఆయుర్వేద వైద్యునితో మాట్లాడడం ఎల్లప్పుడూ మంచిది.

కొలెస్ట్రాల్ కోసం అర్జున మూలిక

అర్జున చెట్టు బెరడు యొక్క హైపోలిపిడెమిక్ (కొలెస్టరాల్ తగ్గించడం) లక్షణాలను పరీక్షించడానికి అనేక అధ్యయనాలు నిర్వహించబడ్డాయి. జంతువు మరియు క్లినికల్ అధ్యయనాలు రెండూ అర్జున చెట్టు యొక్క బెరడు శరీరంలోని లిపిడ్ (కొవ్వు) ప్రొఫైల్ను నిర్వహించడంలో ఒక అద్భుతమైన కర్త అని నిర్ధారించారు.
ఒక అధ్యయనంలో, కరోనరీ హృదయ వ్యాధి ఉన్న 21 మందికి 4 నెలల పాటు అర్జన చెట్టు బెరడు పొడి 1g ఇవ్వబడింది.   అప్పుడు శరీరం యొక్క లిపిడ్ శాతాన్ని నిర్వహించడంలో అర్జున బెరడు సానుకూల ప్రభావం చూపుతుంది అని  కూడా తెలిసింది.
తదుపరి అధ్యయనాలు అర్జున బెరడు LDL (చెడ్డ కొలెస్ట్రాల్) ను తగ్గిస్తుంది.  అది ఎథెరోస్క్లెరోసిస్ (atherosclerosis) (ధమనులలో కొవ్వు నిక్షేపణ) మరియు స్ట్రోక్ మరియు గుండెపోటు వంటి హృదయ వ్యాధుల ప్రమాదం తగ్గిస్తుంది అని  కూడా తెలిపాయి. కాబట్టి, అర్జున బెరడును ఒక గొప్ప హైపోలిపిడెమిక్ అని చెప్పడం  చాల మంచిది.

రక్తపోటు కోసం అర్జున బెరడు

ఆయుర్వేద వైద్యుల ప్రకారం, అర్జున బెరడు ఇతర మూలికలతో కలయికతో రక్తపోటు చికిత్సలో చాలా ఉపయోగకరంగా ఉంది. రక్తపోటును తగ్గించడంలో అర్జున బెరడు యొక్క ఉపయోగం పరీక్షించటానికి అనేక పరిశోధనలు కూడా చేయబడ్డాయి.  ఈ ఆయుర్వేద దావా అన్నీ నిజమవుతాయని సూచిస్తున్నాయి.
ఒక క్లినికల్ అధ్యయనంలో, 10మంది CHF (కంజెస్టివ్ హార్ట్ ఫెయిల్యూర్, రక్త ప్రసరణ చెయ్యడంలో గుండె అసమర్థత) రోగులకు ఒక నెల పాటు రోజుకు రెండు సార్లు 4గ్రాముల అర్జున బెరడు పొడిని ఇచ్చారు. నెలాఖరులో, శ్వాసఅందని లక్షణాలు మరియు సిస్టోలిక్ (systolic) మరియు డయాస్టొలిక్ (diastolic) రక్తపోటులో గణనీయమైన తగ్గింపు  కూడా కనిపించింది.
మీ శరీర వైఖరి ప్రకారం అర్జున బెరడు పొడి యొక్క సరైన మోతాదు తెలుసుకోవాలంటే మీ వైద్యుడిని తనిఖీ చెయ్యడం చాల  అవసరం.

మధుమేహం కొరకు అర్జున బెరడు

జంతువుల ఆధారిత నమూనాలు మరియు ప్రయోగశాల అధ్యయనాలు అర్జున బెరడు ఒక అద్భుతమైన హైపోగ్లైసిమిక్ (రక్త చక్కెరను తగ్గిస్తుంది) కర్త అని  కూడా పేర్కొన్నారు. అర్జున బెరడు రక్తం నుండి గ్లూకోజ్ను సంగ్రహించుకోవడాన్ని పెంచుతుందని మరియు గ్లూకోజ్ ఉత్పత్తిలో (glucose production) పాల్గొనే కొన్ని ఎంజైమ్లను  కూడా నిరోధిస్తుంది అని అధ్యయనాలు సూచిస్తున్నాయి. అందువలన అది రక్త గ్లూకోస్ స్థాయిలను  బాగా తగ్గిస్తుంది.
అయినప్పటికీ, మానవ అధ్యయనాలు లేనందువల్ల, మానవులపై ఈ బెరడు యొక్క డయాబెటిక్ వ్యతిరేక ప్రభావాలను ఎక్కువగా  కూడా నిర్ధారించలేము.

దగ్గు కోసం అర్జున బెరడు

జంతువుల అధ్యయనాలు అర్జున చెట్టు బెరడులో ఉన్న అర్బినోగలాక్టాన్ అను ఒక రసాయన సమ్మేళనం దగ్గు లక్షణాల నుండి ఉపశమనం కలిగిస్తుందని తెలిపాయి. కానీ, మానవ అధ్యయనాలు లేనందున, అర్జున బెరడు యొక్క యాంటీటిస్సివ్ (antitussive) (దగ్గు-ఉపశమనం కలిగించే) ప్రభావాలను అర్ధం చేసుకోవడానికి ఆయుర్వేద వైద్యున్ని సంప్రదించడం  చాల మంచిది.

అర్జున బెరడు ఒక ప్రతిస్కంధక కర్త (రక్తం గడ్డకట్టడాన్ని నిర్ములించేది)

అర్జున బెరడుపై పరిశోధన అది ఒక ప్రతిస్కంధక ఏజెంట్ (రక్తం గడ్డకట్టడం నిర్మిస్తుంది)గా ఉపయోగపడుతుందని . ఈ బెరడు ప్లేట్లెట్ల రాసి (aggregarion) (శరీరంలో గడ్డకట్టే కణాల సేకరణ) లేదా రక్తం గడ్డకట్టడంలో మొదలయ్యే కొన్ని సంకేతాలతో జోక్యం చేసుకోవచ్చని కూడా  సూచించబడింది. అయినప్పటికీ, అర్జున బెరడు యొక్క ప్రతిస్కంధక ప్రభావాలను నిర్ధారించడానికి ఇంకా మరిన్ని అధ్యయనాలు  కూడా చేయాలి.

రక్తస్రావ వ్యాధులకు అర్జున బెరడు

ఆయుర్వేదంలో, అర్జున బెరడు హేమోఫిలియా (haemophilia), వాన్ విల్లెర్బ్రాండ్ వ్యాధి (Von Willebrand disease), అసాధారణ మరియు తరచూ అంతర్గత గాయాల మరియు రక్తస్రావం, అధిక ఋతు కాలం మరియు రక్తస్రావము వంటి రక్తస్రావం రుగ్మతల కొరకు ఒక ఔషధంగా విస్తృతంగా కూడా ఉపయోగించబడుతుంది.
ఆయుర్వేదిక వైద్యుల ప్రకారం, అర్జున బెరడు ఒక అద్భుతమైన వాసోకోన్టిక్టర్ (vasoconstrictor) (రక్తనాళాల వ్యాకోచం) రక్తస్రావ సమయంలో రక్త నష్టాన్ని తగ్గించేలా  కూడా చేస్తుంది. అయినప్పటికీ, మానవులలో అర్జున బెరడు యొక్క ఈ ప్రభావాలను నిరూపించడానికి స్పష్టమైన పరిశోధన  కూడా లేదు.

కడుపు పండ్ల కోసం అర్జున బెరడు

జంతు అధ్యయనాలు అర్జున బెరడు యొక్క మిథనాల్ సారం కడుపులో శ్లేష్మ (mucus) సరిహద్దులను బలోపేతం చేయడం ద్వారా గ్యాస్ట్రిక్ అల్సర్స్ యొక్క తీవ్రతను కూడా  తగ్గిస్తుంది. కానీ, మానవుల పై ఇటువంటి ప్రభావాలను నిర్ధారించడానికి మానవ అధ్యయనాలు ఇప్పటివరకు చేయలేదు. అందువల్ల, మీరు కడుపు పండ్ల నుండి బాధపడుతుంటే, ఏ రూపంలోనైనా అర్జున బెరడు తీసుకునే ముందు మీ ఆయుర్వేద వైద్యుణ్ణి అడగటం చాల  మంచిది.

విరిగిన ఎముకల కోసం అర్జున బెరడు

ఎముకలలోని పగుళ్లు, బోలు ఎముకల వ్యాధి వంటి గాయాలు లేదా ఓస్టియోపోరోసిస్ పరిస్థితులు వంటివి ఆకస్మిక గాయాలు లేదా ఒత్తిడి వల్ల సంభవించవచ్చును . సాధారణ శ్రేణి వైద్యంలో ఎముక ప్రత్యామ్నాయాలు (substitutes) (విరిగిన ఎముకలు నయం చేసేందుకు ఉపయోగించే సేంద్రీయ లేదా సింథటిక్ పదార్థాలు) మరియు పెరుగుదల కారకాలు ఉన్నాయి. కానీ, పెరుగుదల కారకాలు చాలా ఖరీదైనవి మరియు దుష్ప్రభావాలు కూడా ఉంటాయి. ఆయుర్వేద వైద్యులు పగుళ్ళు నయం చేసేందుకు అర్జున బెరడు యొక్క పేస్ట్ ను ఉపయోగిస్తారు. ఎముక కణజాల పునరుత్పత్తిలో అర్జున బెరడు యొక్క పదార్ధాలు చాలా ప్రభావవంతంగా ఉన్నాయని ప్రయోగశాల అధ్యయనాలు చెబుతున్నాయి. కానీ, మానవ ఆధారిత అధ్యయనాలు లేనందున, అర్జున బెరడు యొక్క ఈ వైద్యం ప్రయోజనాన్ని నిర్ధారించడం చాల  కష్టం.

అర్జున బెరడు ఒక యాంటీఆక్సిడెంట్

అర్జున బెరడు యొక్క యాంటియోక్సిడెంట్ సంభావ్యతను పరీక్షించడానికి అనేక అధ్యయనాలు కూడా చేయబడ్డాయి. ప్రయోగశాల మరియు జంతు అధ్యయనాలు అర్జున బెరడు ఇవ్వడం వలన కాలేయంలో సూపర్ మోసైడ్ డిస్మెటేస్, క్యాటలేస్ (catalase), విటమిన్ ఎ, సి మరియు ఈ వంటి యాంటీ ఆక్సిడెంట్ల పరిమాణం పెరుగుతుంది సూచించాయి.
అయినప్పటికీ, మానవ శరీరంలోని అర్జున చెట్టు బెరడు యొక్క యాంటియోక్సిడెంట్ సంభావ్యతను పరీక్షించడానికి ఇంకా అధ్యయనాలు కూడా  చేయలేదు.

అర్జన బెరక్ ఒక యాంటీమైక్రోబియల్

అర్జున బెరడు యొక్క జల మరియు ఎసిటోన్ (acetone) సారాలు వివిధ రకాల స్టైఫిలోకాకస్ ఆరియస్ (Staphylococcus aureus) (బ్యాక్టీరియా యొక్క రకం) యాంటీబయాటిక్-రెసిస్టెంట్ VRSA మరియు MRSA స్టాఫిలోకోకస్లపై కూడా సమర్థవంతమైన ప్రభావాలను కలిగి ఉన్నాయి.
మరొక అధ్యయనంలో విస్తృత శ్రేణి యాంటీబయోటిక్ లక్షణాలు ఉండటం కన్నా, అర్జున బెరడు సారాలు కొన్ని రకాల బాక్టీరియాలకు (గ్రామ్ నెగటివ్) వ్యతిరేకంగా అత్యంత శక్తివంతమైనవి. మానవ అధ్యయనాలు లేనందున ఏ వైద్య సమస్యకైనా అర్జున బెరడును ఉపయోగించటానికి ముందు మీ ఆయుర్వేద వైద్యుడిని సంప్రదించడం  చాల మంచిది.

అర్జున బెరడు ఎలా ఉపయోగించాలి

అర్జున బెరడును సాధారణంగా పొడిని రూపంలో ఉపయోగిస్తారు. కానీ ఆయుర్వేదవైద్యులు దాని ఆరోగ్యం ప్రయోజనాల కోసం గుళికలు, మాత్రలు మరియు అర్జున టీ వంటి ఇతర ఉత్పత్తులను కూడా సూచిస్తారు.
ఒకవేళ మీరు ఆయుర్వేద మందులు ఉపయోగించి ఉంటే మీకు ఇప్పటికే అర్జున పాలు లేదా క్షీరపాక గురించి తెలిసి ఉండవచ్చును . ఇది అర్జున బెరడు పొడి మరియు పాల నుంచి తయారు చేసిన ఆయుర్వేదిక నివారణ. ఆయుర్వేద వైద్యుల ప్రకారం, క్షీరపాక అద్భుతమైన గుండెకు సంబంధించిన టానిక్. ఇంట్లో దీనిని సిద్ధం చేయడానికి ఇక్కడ దానిని తయారు చేసే పద్ధతి ఉన్నది:
32: 8: 1 నిష్పత్తిలో నీరు, పాలు మరియు అర్జున బెరడు తీసుకోండి
ఈ మిశ్రమాన్నితక్కువ మంటలో ఉంచి నీరు అంత ఆవిరైయ్యే వరకు వేడి చేయండి.
మిశ్రమాన్ని వడపోసి కషాయాన్నీ (అర్జునా పాలు) ఆస్వాదించండి.
దాని ఔషధ ఉపయోగాలే కాకుండా, అర్జున చెట్టును కలప మరియు ఇంధనం మరియు ఒక అలంకార చెట్టుగా ఉపయోగిస్తారు. అర్జునుల చెట్ల కొమ్మలు విస్తారమైన పందిరిని తయారు చేస్తాయి.  దాని వల్ల నీడ కోసం రోడ్డు పక్కన నాటుతారు. బావులు వంటి నీటి వనరుల సమీపంలో ఈ చెట్టు నాటడం గాలి కాలుష్యం యొక్క ప్రభావాలను తగ్గించడంలో బాగా సహాయం చేస్తుంది మరియు నీరు తాజాగా ఉంచుతుంది.

అర్జున బెరడు మోతాదు

వారానికి 500 mg అర్జున బెరడు పొడిని ఏ దుష్ప్రభావాలు లేకుండా తీసుకోవచ్చును . కానీ, తగినంత మోతాదు వ్యక్తి యొక్క వివిధ భౌతిక మరియు మానసిక పారిస్తుతులపై ఆధారపడి ఉంటుంది. అందువల్ల,మీ ఆహారంలో ఏ రూపంలోనైనా అర్జున బెరడు తీసుకునే ముందు ఆయుర్వేద వైద్యుడిని ఎల్లప్పుడూ సంప్రదించాలి.

అర్జున చెట్టు బెరడు దుష్ప్రభావాలు 

గర్భిణీ మరియ చనుబాలిచ్చు స్త్రీలపై అర్జున బెరడు యొక్క ప్రభావంపై పరిశోధన లేదు.కాబట్టి, శాస్త్రీయ ఆధారం లేనందువల్ల, గర్భిణీ మరియు చనుబాలిచ్చు స్త్రీలు అర్జున బెరడును నివారించాలి.
అర్జున బెరడు రక్తం గడ్డ కట్టడాన్ని తగ్గిస్తుంది కాబట్టి మీరు రక్తస్రావ సమస్యలతో బాధపడుతుంటే లేదా శస్త్రచికిత్స చేయించుకోవాలనుకుంటే, అర్జున బెరడును నివారించడం చాల  ఉత్తమమైనది.
మీరు సహజంగా రక్తంలో తక్కువ చక్కెర స్థాయిని కలిగి ఉంటే లేదా మందులు వాడుతున్న  డయాబెటిక్ వ్యక్తి అయితే, ఏ రూపంలోనైనా అర్జున బెరడు తీసుకునే ముందు మీ వైద్యుడికి మాట్లాడడం  చాల మంచిది.
ఇప్పటివరకు అర్జున బెరడు ఇతర మందులతో కలిసి చర్య చూపిన సంఘటనలు లేవు కానీ మీరు ఏ విధమైన సూచించబడిన మందులను ఉపయోగిస్తుంటే, అర్జున బెరడును ఉపయోగించే ముందు మీ ఆయుర్వేద వైద్యుణ్ణి సంప్రదించడం  చాల ఉత్తమం.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top