...

జీడిపప్పు ప్రయోజనాలు మరియు దుష్ప్రభావాలు

జీడిపప్పు ప్రయోజనాలు మరియు దుష్ప్రభావాలు

జీడిపప్పులు బ్రెజిల్ దేశానికీ చెందినవి మరియు తరాల నుండి ఇవి వాటి రుచి వలన ప్రసిద్ధిగా  చూడబడతాయి. ఇటీవలి కాలంలో, జీడిపప్పులు వాటి సున్నితమైన రుచి మరియు ముఖ్యమైన ఆరోగ్య ప్రయోజనాల వలన ప్రపంచం అంతటా ప్రసిద్ధి చెందాయి.అయితే, ఉత్పాదకులు జీడిపప్పును ఎప్పుడూ జీడిపిక్క (జీడిపిక్క లోపల జీడిపప్పు ఉంటుంది) రోపంలో విక్రయిస్తారు, జీడిపిక్కలో ఉండే ఒక భాగం రెసిన్ (resin)ను  కలిగి ఉంటుంది, ఇది వినియోగానికి హానికరమైనది. పచ్చి మరియు వేయించిన జీడిపప్పులు అలాగే రుచికోసం అనేక ఫ్లేవర్లు జోడించిన జీడిపప్పులు కూడా అందుబాటులో ఉంటున్నాయి. వీటిని చిరుతిండిగా తినవచ్చు, సలాడ్లు, స్మూతీస్ మరియు ఇతర ఆహారపదార్దాలతో కలిపి తీసుకోవచ్చు. మీరు ఇతర గింజలు/పప్పుల ప్రయోజనాల కంటే వేరుగా ఉండే అనేక రకాల ఆరోగ్య ప్రయోజనాలను జీడిపప్పు నుండి పొందవచ్చు.
ఇది భారతీయ వంటకాలలో ఉపయోగించే ఒక ప్రముఖ మూలపదార్థం. జీడి చెట్టు బాగా ఎత్తుగా పెరుగుతుంది మరియు ఒక క్రమములేని కాండమును కలిగి ఉంటుంది. పెద్ద రసముగల జీడిమామిడి కాయలు కొమ్మలకు వ్రేలాడి ఉంటాయి మరియు ఈ కాయ యొక్క దిగువ భాగంలో జీడిపిక్క అంటుకుని ఉంటుంది. ఇది ఏడాది పొడవునా అందుబాటులో ఉంటుంది  మరియు దాని అధిక జీవితకాలం (shelf life) కారణంగా, ఇది ఎక్కువ కాలం పాటు నిల్వ చేయబడి, భద్రపరచబడుతుంది. పప్పు మరియు అలాగే పండు రెండింటికి వివిధ ఉపయోగాలున్నాయి. జీడిపప్పు పేదవాడి తోటగా పిలువబడుతుంది, అయితే అది ఇప్పుడు అధిక ధరలకు విక్రయించబడుతుంది. సంచార జీవుల (nomads) కాలంలో వీటిని ఎలా తినాలో తెలియక, గింజ దూరంగా విసిరివేసి, పండును మాత్రమే తినేవారు.
జీడిపప్పు ప్రయోజనాలు మరియు దుష్ప్రభావాలు

జీడిపప్పు మొక్క/ జీడిమామిడి మొక్క గురించి కొన్ని ప్రాథమిక వాస్తవాలు

శాస్త్రీయ నామము: అనాకార్డియం ఓక్సిడెంటలే (Anacardium Occidentale)
కుటుంబము: అనాకార్డియేసి (Anacardiaceae)
సాధారణ నామము: జీడిపప్పు, కజు (హిందీ)
సంస్కృత నామము: భళాతక
ఉపయోగించే భాగాలు: జీడిమామిడి చెట్టు యొక్క దాదాపు అన్ని భాగాలు ఔషధ గుణాలు ఉంటాయి. జీడిపప్పు, జీడిమామిడి కాయలు/పళ్ళు మరియు ఆకులు తినదగినవి.
స్థానిక ప్రాంతం మరియు భౌగోళికవిస్టీర్ణం: జీడిమామిడి చెట్లు ఈశాన్య బ్రెజిల్లో పుట్టాయి అవి దక్షిణ మరియు మధ్య అమెరికాలకు విస్తరించాయి. పోర్చుగీసు వారు దానిని భారతదేశం మరియు తూర్పు ఆఫ్రికాకు తీసుకువచ్చారు, తరువాత ఇది శ్రీలంక, ఇండోనేషియా మరియు మలేషియాలకు వ్యాపించింది. 17 వ శతాబ్దంలో, స్పానిష్ వారు దీనిని ఫిలిప్పీన్స్ కు  తీసుకువెళ్లారు. ప్రస్తుతం అనేక ఉష్ణమండల దేశాల్లో జీడిపప్పును సాగు చేస్తున్నారు; దీని ప్రధాన ఉత్పత్తి కేంద్రాలు బ్రెజిల్, ఇండియా, వియత్నాం, మొజాంబిక్ మరియు టాంజానియా దేశాలు.
ఆసక్తికరమైన నిజాలు: జీడిపిక్క యొక్క రెసిన్ పెయింట్లు వంటి పారిశ్రామిక ఉత్పత్తులలో ఉపయోగించబడుతుంది. ఇది బ్రేక్ లైనర్లలో ఉపయోగించడం వలన ఇది కారులలో కూడా దీనిని గమనించవచ్చు.
 • జీడిపప్పు పోషక వాస్తవాలు
 • జీడిపప్పు ఆరోగ్య ప్రయోజనాలు
 • జీడిపప్పు దుష్ప్రభావాలు
 • ఉపసంహారం

 

జీడిపప్పు పోషక వాస్తవాలు 

జీడిపప్పు అనేది ఒక మృదువైన రూపము/రీతి మరియు ఆహ్లాదకరమైన రుచి కలిగిన ఒక రకమైన డ్రై ఫ్రూట్. ఇటీవలకాలంలో, జీడిపప్పును పాల ఉత్పత్తులకు ప్రత్యామ్న్యాయంగా ఉపయోగిస్తున్నారు, జీడిపప్పు పాలు, జీడిపప్పు ఆధారిత జున్ను, జీడిపప్పు ఆధారిత క్రీమ్ మరియు సాస్, మరియు సోర్ క్రీం వంటివి తయారు చేస్తున్నారు. జీడిపప్పు పాలు ఆరోగ్యకరమైనవి మరియు వీటిని శాకాహారంలో పాల స్థానంలో ఉపయోగించవచ్చు.
డిపప్పులో విటమిన్ సి, విటమిన్ బి మరియు 7 మైక్రోగ్రాముల డిఎఫ్ఇ  ఫోల్లేట్ (DFE Folate)లు ఉంటాయి. వీటిలో అధిక మొత్తంలో మోనో అన్సాచురేటెడ్ మరియు పాలీఅన్సాచురేటెడ్ కొవ్వులు (ఫ్యాట్స్)  ఉంటాయి మరియు ప్రోటీన్ల యొక్క మంచి వనరు.
ఒక ఔన్స్ జీడిపప్పు బరువుకు సుమారు 18 పూర్తి జీడిపప్పులు తూగుతాయి మరియు 100 గ్రాముల జీడిపప్పు 553 కేలరీలను కలిగి ఉంటుంది.
యు.యస్.డి.ఏ (USDA) న్యూట్రియెంట్ డేటాబేస్ ప్రకారం, 100 గ్రాముల జీడిపప్పులు ఈ క్రింది పోషక విలువలను కలిగి ఉన్నాయి:
పోషకాలు :100 గ్రాములకు  
నీరు:5.2 గ్రా
శక్తి:553 kCal
ప్రోటీన్:18.22 గ్రా
కొవ్వులు:43.85 గ్రా
కార్బోహైడ్రేట్:30.19 గ్రా
ఫైబర్:3.3 గ్రా
చక్కెరలు:5.91 గ్రా
ఖనిజాల:100 గ్రాలకు
కాల్షియం:37 mg
ఐరన్:6.68 mg
మెగ్నీషియం:292mg
ఫాస్ఫరస్:593 mg
పొటాషియం:660 mg
సోడియం:12mg
జింక్:5.78 గ్రా
విటమిన్:100 గ్రా
విటమిన్ బి1:0.423 mg
విటమిన్ బి2:0.058 mg
విటమిన్ బి3:1.062 mg
విటమిన్ బి6:0.417 mg
విటమిన్ B9:25 μg
విటమిన్ సి:0.5 mg
విటమిన్ ఇ :0.90 μg
విటమిన్ కె :34.1 μg
కొవ్వులు / కొవ్వు ఆమ్లాలు:100 గ్రామూలకు
సంతృప్త:7.783 గ్రా
మోనో అన్సాచురేటెడ్:23.797g
పాలి అన్సాచురేటెడ్:7.845 గ్రా

జీడిపప్పు ఆరోగ్య ప్రయోజనాలు 

 • జీడిపప్పుల వంటి గింజలలో ఒమేగా -3 ఫ్యాటీ ఆసిడ్లు అధికంగా ఉంటాయి, జీవక్రియ ప్రక్రియను (metabolic process) ఇవి వేగవంతం చేస్తాయి తద్వారా అదనపు కొవ్వును కలిగేలా చేస్తాయి తద్వారా బరువు తగ్గుదలకు సహాయం చేస్తాయి.
 • జీడిపప్పులో ప్రోటీన్లు మరియు కాల్షియం మాత్రమే కాకుండా, ఫైటోకెమికల్స్ మరియు యాంటీఆక్సిడెంట్లు కూడా సమృద్ధిగా ఉంటాయి.ఇవి తీసుకోవడం వలన అథ్లెట్లలో కలిగే వ్యాయామ ప్రేరిత ఆక్సీకరణ ఒత్తిడిని తగ్గించవచ్చు, అంతేకాక మరియు కండరాల నొప్పులను కూడా తగ్గిస్తుంది.
 • జీడిపప్పులో ఐరన్ అధికంగా ఉంటుంది. జీడిపప్పులు విటమిన్ ఇ మరియు విటమిన్ కె వంటి యాంటీఆక్సిడెంట్లకు కూడా మంచి మూలకాలుగా ఉన్నాయి. యాంటీఆక్సిడెంట్లు కణాలను ఆక్సీకరణ నష్టం నుండి కాపాడే సమ్మేళనాలు (కంపౌండ్లు) అవి రక్తాన్ని శుద్ధి చేస్తాయి. జీడిపప్పును క్రమముగా తీసుకుంటే అది రక్త సంబంధిత వ్యాధుల నుండి రక్షించడంలో సహాయపడవచ్చు.
 • జీడిపప్పులో  కాపర్, జింక్ కూడా ఉంటాయి ఇవి రోగనిరోధక వ్యవస్థను మెరుగుపరుస్తాయి. జింక్ కొన్ని ఇమ్యూన్ సిస్టం ఎంజైమ్లకు అవసరమైన ఖనిజం, జింక్ లోపం రోగనిరోధక వ్యవస్థ యొక్క లోపానికి దారితీయవచ్చు.  కాబట్టి జీడిపప్పును తీసుకోవడం వలన రోగనిరోధక వ్యవస్థ కూడా బలపడుతుంది.
 • జీడిపప్పులో జియాజాంతిన్ (Zeaxanthin) అనే ఒక  పిగ్మెంట్ ఉంటుంది. ఈ పిగ్మెంట్ కళ్ళ రెటీనాను కాపాడుతుంది, ఇది  కళ్ళ మీద ఒక రక్షిత పొరను ఏర్పరచడం ద్వారా కళ్ళను హానికరమైన యువి కిరణాల నుండి రక్షిస్తుంది.
 • సెలీనియం, జింక్, మెగ్నీషియం, ఐరన్ మరియు ఫాస్పరస్ వంటి ఖనిజాలు జీడిపప్పు నూనెలో ఉంటాయి. సెలీనియం చర్మ ఆరోగ్యానికి ఉపయోగకరంగా ఉంటుంది. జీడిపప్పులలో  ఫైటోకెమికల్స్, ప్రోటీన్లు మరియు యాంటీఆక్సిడెంట్లు కూడా ఉంటాయి. ఈ పోషకాలు చర్మ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి మరియు వృద్ధాప్య సంకేతాలను తగ్గించడంలో కూడా సహాయం చేస్తాయి.
 • జీడిపప్పు నూనెలో ఉండే కాపర్, చర్మం మరియు జుట్టులో ఉండే మెలనిన్ అనే పిగ్మెంట్ యొక్క బయోసింథసిస్ కు సహాయపడుతుంది, ఈ మెలనిన్ జుట్టు రంగుని నిర్వహించడంలో బాధ్యత వహిస్తుంది. అంతేకాక, జీడిపప్పులో లినోలిక్ మరియు ఒలీక్ యాసిడ్లు కూడా ఉంటాయి, ఇవి జుట్టు  మృదువుగా మెరిసేలా చేస్తాయి.

 

బరువు తగ్గుదల కోసం జీడిపప్పు
రక్త ప్రసరణ వ్యవస్థ కోసం జీడిపప్పు
అథ్లెట్లకు జీడిపప్పు
రోగనిరోధక వ్యవస్థ కోసం జీడిపప్పు
గుండె ఆరోగ్యానికి జీడిపప్పు
కళ్ళ కోసం జీడిపప్పు
చర్మానికి జీడిపప్పు –
జుట్టు కోసం జీడిపప్పు


బరువు తగ్గుదల కోసం జీడిపప్పు 

జీడిపప్పులు చేర్చబడని ఆహార విధానంతో పోల్చిస్తే, జీడిపప్పును రోజూ తినే వారు  వేగంగా బరువును కోల్పోతారు అని తెలుస్తుంది. అయితే, జీడిపప్పులు వంటి డ్రై ఫ్రూట్స్ ను ఎక్కువ తీసుకోవడం వల్ల అవి బరువును పెంచుతాయని భావించినప్పటికీ, ఎపిడెమోలాజికల్ మరియు కంట్రోల్డ్ (నియంత్రిత) క్లినికల్ అధ్యయనాల ఆధారాల ప్రకారం జీడిపప్పుల వినియోగం శరీర బరువు పెరుగుదలతో సంబంధం కలిగి లేదని తెలుస్తుంది.
ది జర్నల్ ఆఫ్ న్యూట్రిషన్ లో ప్రచురించబడిన ఎపిడెమియోలాజికల్ ఆధారాల ప్రకారం, గింజలు (డ్రై ఫ్రూట్స్ మొదలైనవి) తినే వారు తినని వారి కంటే తక్కువ బిఎంఐ(BMI) రేటును కలిగి ఉంటారు. జీడిపప్పుల వంటి గింజలు ఒమేగా -3 ఫ్యాటీ ఆసిడ్లతో నిండి ఉంటాయి, జీవక్రియ ప్రక్రియను (metabolic process) ఇవి వేగవంతం చేస్తాయి తద్వారా అదనపు కొవ్వును కలిగేలా చేస్తాయి.
కాబట్టి, బరువు తగ్గించుకోవాలనుకునే వారికి గింజలు ఒక మంచి చిరుతిండి అలాగే పోషకమైనవి. ఉత్తమ ఫలితాల కోసం, వాటికి ఇతర ఫ్లేవర్లు కలపకుండా, పచ్చివి వాటిని తినడం ఉత్తమం.


రక్త ప్రసరణ వ్యవస్థ కోసం జీడిపప్పు 

జీడిపప్పును పరిమిత పాళ్ళలో (పరిమాణంలో) క్రమముగా తీసుకుంటే అది రక్త సంబంధిత వ్యాధుల నుండి రక్షించడంలో సహాయపడవచ్చు. జీడిపప్పులో ఐరన్ అధికంగా ఉంటుంది అది ఆహారంలో ఐరన్ ను శోషించడంలో ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. కాపర్ లోపాలు కూడా రక్తం ఐరన్ ను గ్రహించడాన్ని తగ్గిస్తాయి, ఇది రక్తహీనతకు దారితీస్తుంది. అందువల్ల, మన ఆహారంలో కాపర్ మంచి పరిమాణంలో ఉండాలి మరియు జీడిపప్పుల ఈ ఖనిజానికి మంచి వనరుగా ఉంటాయి.
జీడిపప్పులు విటమిన్ ఇ మరియు విటమిన్ కె వంటి యాంటీఆక్సిడెంట్లకు మంచి మూలకాలుగా ఉన్నాయి. యాంటీఆక్సిడెంట్లు కణాలను ఆక్సీకరణ నష్టం నుండి కాపాడే సమ్మేళనాలు (కంపౌండ్లు). అవి కణాలలో తిరుగుతూ, రక్త కణాలకు నష్టం కలిగించే ఫ్రీ రాడికల్స్ ను న్యూట్రలైజ్ చేస్తాయి. యాంటీఆక్సిడెంట్లు ధమనుల్లో (ఆర్టరీలలో) ఫ్యాట్స్ యొక్క ఆక్సీకరణను తగ్గిస్తాయి, తద్వారా ఎథెరోస్క్లెరోసిస్ మరియు అధిక రక్తపోటు వంటి వ్యాధుల ప్రమాదాన్ని తగ్గిస్తాయి.

అథ్లెట్లకు జీడిపప్పు

జీడిపప్పులో ప్రోటీన్లు మరియు కాల్షియం మాత్రమే కాకుండా, ఫైటోకెమికల్స్ మరియు యాంటీఆక్సిడెంట్లు కూడా సమృద్ధిగా ఉంటాయి. యాంటీఆక్సిడెంట్లు మరియు ఫైటోకెమికల్స్ లో అధికంగా ఉన్న ఆహార విధానం అథ్లెట్లలో కలిగే వ్యాయామ ప్రేరిత ఆక్సీకరణ ఒత్తిడిని తగ్గించవచ్చు మరియు మంచి ఆరోగ్యాన్ని పెంపొందిస్తుంది. ప్రోటీన్ అధికంగా ఉండే ఆహారవిధానం అథ్లెట్లలో రోగనిరోధకత శక్తికి మరియు పూర్తి ఆరోగ్యానికి ప్రయోజనం కలిగిస్తుంది అలాగే కండరాల నొప్పులను కూడా తగ్గిస్తుంది మరియు ఒక ఆరోగ్యకరమైన అథ్లెట్ ఖచ్చితంగా మెరుగైన పనితీరును చూపగలుగుతాడు. అథ్లెట్లు తగినంత సూక్ష్మపోషకాలను (ముఖ్యంగా ఫోలేట్, కారోటెనాయిడ్స్, బి6, బి12, సి, ఇ, జింక్, కాపర్, ఐరన్ మరియు సెలీనియం) తీసుకోవడం  వలన వారి రోగనిరోధక పనితీరు మెరుగుపడుతుందని సూచించబడింది.

రోగనిరోధక వ్యవస్థ కోసం జీడిపప్పు

కాపర్ అధిక పరిమాణంలో ఉండడంతో పాటూ, జీడిపప్పుజింక్ కు కూడా ఒక గొప్ప వనరు. శరీరంలో జింక్ శాతం తగ్గిపోవడం వలన అది రోగనిరోధక వ్యవస్థ మీద ప్రభావం చూపుతుంది, ఎందుకంటే ఈ ఖనిజం ఇమ్యూన్ (రోగనిరోధక) వ్యవస్థ కణాల అభివృద్ధిలో, యాంటీయాక్సిడెంట్ ఎంజైమ్స్ ఉత్పత్తిలో మరియు రోగనిరోధక వ్యవస్థ నియంత్రణా కణాల (immune system regulators) అభివృద్ధిలో ఒక ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. ఒక ఔన్సు జీడిపప్పు 1.6 మిల్లీగ్రాముల జింక్ ను అందిస్తుంది అది పురుషులకు రోజువారీ తీసుకోవాల్సిన (సిఫారసు చేయబడిన)  జింక్ లో 14.5% నికి మరియు మహిళలు రోజువారీ తీసుకోవాల్సిన జింక్ లో 20% నికి సమానం. తగిన జింక్ తీసుకోవడం అనేది ఒక ఆరోగ్యకరమైన రోగనిరోధక వ్యవస్థతో అనుబంధం కలిగి ఉంటుంది, అంటే జీడిపప్పులు మీ తదుపరి జలుబును నివారించడంలో గణనీయంగా సహాయపడతాయి!!

గుండె ఆరోగ్యానికి జీడిపప్పు 

నేషనల్ సెంటర్ ఫర్ బయోటెక్నాలజీ ఇన్ఫర్మేషన్ (NCBI) కొన్ని కేస్ స్టడీస్ను నిర్వహించింది, అది గింజలు(ధాన్యాలు/డ్రై ఫ్రూట్స్) ఆరోగ్యానికి బాగా ఉపయోగపడుతుందని సూచించింది. ఈ అధ్యయనం గుండె జబ్బులు వంటి పలు రుగ్మతలపై ఒక తనిఖీని నిర్వహించింది. శరీరంలో కొలెస్ట్రాల్ స్థాయిలను జీడిపప్పు తగ్గిస్తుందని అధ్యయనాలు సూచిస్తున్నాయి. అవి LDL (చెడు కొలెస్ట్రాల్) తగ్గించి మరియు హెచ్ డి ఎల్(HDL, మంచి కొలెస్ట్రాల్) సామర్థ్యాన్ని పెంచడంలో సహాయం చేస్తాయి. గుండె నుండి కొలెస్ట్రాల్ ను గ్రహించడంతో మరియు దానిని విచ్ఛిన్నం (బ్రేక్ డౌన్) చేసేందుకు కాలేయానికి తీసుకువెళ్ళటానికి హెచ్ డి ఎల్ బాధ్యత వహిస్తుంది. అందువల్ల హెచ్ డి ఎల్ స్థాయిల పెరుగుదల రక్త కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గిస్తుంది, ఎల్ డి ఎల్ స్థాయి తగ్గుదల గుండె జబ్బుల యొక్క ప్రమాదాన్ని తగ్గిస్తుంది. జీడిపప్పు యొక్క యాంటీఆక్సిడెంట్ మరియు యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలకు కూడా కొన్ని ఆధారాలు ఉన్నాయి. ఈ లక్షణాలు అన్ని కలిసి ధమనులలో (ఆర్టరీలలో) కొవ్వు నిల్వలు (ప్లేక్స్) ఏర్పడకుండా నివారిస్తాయి మరియు రక్తపోటును నిర్వహించడంలో సహాయపడతాయి. ఆసక్తికరంగా, జీడిపప్పును కొద్దిగా వేయించడం వలన దాని  యాంటీఆక్సిడెంట్ లక్షణాలు పెరుగుతాయని అని ఒక అధ్యయనం సూచించింది.
ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ ప్రకారం ప్రతిరోజూ ఒక గుప్పెడు గింజలను లౌ ఫ్యాట్ డైట్ లో భాగంగా తీసుకుంటే అవి గుండె వ్యాధుల ప్రమాదాన్ని తగ్గిస్తాయి. ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ వారు వారానికి 4 సార్లు ఉప్పువేయని మరియు నూనె తో వేయించని గింజలను తీసుకోవలసిందిగా సిఫార్సు చేసారు మరియు అవి  కేలరీలలో ఎక్కువగా ఉండడం వలన వాటి అధిక వినియోగాన్ని కూడా నివారించాలి.
న్యూ ఇంగ్లాండ్ జర్నల్ ఆఫ్ మెడిసిన్ (NEJM) లో ప్రచురించబడిన మరో అధ్యయనం గుండె వ్యాధులు, క్యాన్సర్ మరియు శ్వాసకోశ వ్యాధులు కారణంగా సంభవించే మరణాల సంఖ్య తగ్గడానికి మరియు గింజలు తీసుకోవడానికి మధ్య సంభందం ఉందని తెలిపింది. గింజల్లో ఉండే అసంతృప్త కొవ్వు ఆమ్లాలు (అన్సాచురేటెడ్ ఫ్యాటీ ఆసిడ్లు), ప్రోటీన్లు, ఫైబర్, విటమిన్లు, ఖనిజాలు మరియు యాంటీఆక్సిడెంట్లు వంటి పోషకాలు యాంటి-క్యాన్సర్, యాంటీ ఇన్ఫ్లమేటరీ మరియు గుండె రక్షిత (హార్ట్ ప్రొటెక్టీవ్) లక్షణాలను కలిగి ఉంటాయని అధ్యయనాలు చెబుతున్నాయి.

కళ్ళ కోసం జీడిపప్పు

ఆధునిక నగరాల్లో అధిక కాలుష్యం మన కళ్ళను వివిధ రుగ్మతలకు గురిచేస్తుంది. జీడిపప్పులో జియాజాంతిన్ (Zeaxanthin) అని పిలువబడే పిగ్మెంట్ ఉంటుంది. ఈ పిగ్మెంట్ ను కళ్ళ రెటీనా వెంటనే మరియు నేరుగా గ్రహించుకుంటుంది తరువాత అది రెటీనా మీద ఒక రక్షిత పొరను ఏర్పరుస్తుంది. ఈ రక్షిత పొర హానికరమైన యువి కిరణాల నుండి కళ్ళను రక్షిస్తుంది. జియాజాన్థిన్ యొక్క సరైన పరిమాణాలు మంచి కంటి ఆరోగ్యాన్ని కాపాడడం మాత్రమే కాక వృద్ధులలో వయస్సు-సంబంధమైన మక్యూలర్ డిజెనెరేషన్ ను నిరోధించడానికి కూడా సహాయపడతాయని పరిశోధనలు తెలుపుతున్నాయి.

చర్మానికి జీడిపప్పు 

జీడిపప్పు నూనె చర్మం కోసం అద్భుతాలు చేస్తుంది అని అంటారు. జీడిపప్పు నూనెలో సెలీనియం, జింక్, మెగ్నీషియం, ఐరన్ మరియు ఫాస్పరస్ లు అధికంగా ఉంటాయి. జీడిపప్పు నూనెలో ఉండే అధిక సెలీనియం చర్మ ఆరోగ్యానికి ఉపయోగకరంగా ఉంటుంది మరియు చర్మ క్యాన్సర్ను నివారించడంలో కూడా సహాయపడుతుంది. జీడిపప్పులు ఫైటోకెమికల్స్, ప్రోటీన్లు మరియు యాంటీఆక్సిడెంట్లకు కూడా అద్భుతమైన వనరులు. ఈ పోషకాలు చర్మ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి మరియు వృద్ధాప్య సంకేతాలను తగ్గించడంలో సహాయం చేస్తాయి, ఇది యవ్వనమైన మరియు మృదువైన చర్మానికి దారితీస్తుంది.

జుట్టు కోసం జీడిపప్పు 

పరిశోధనాలు ప్రకారం, జీడిపప్పు వినియోగం లేదా తలకు జీడిపప్పు నూనెను ఉపయోగించడం వలన అది ఆరోగ్యకరమైన జుట్టును అందిస్తుందని తెలుస్తుంది. జీడిపప్పు నూనెలో ఉండే కాపర్, చర్మం మరియు జుట్టులో ఉండే మెలనిన్ అనే పిగ్మెంట్ యొక్క బయోసింథసిస్ కు సహాయపడుతుంది, ఈ మెలనిన్ జుట్టు రంగుని నిర్వహించడంలో బాధ్యత వహిస్తుంది. అంతేకాక, జీడిపప్పులో లినోలిక్ మరియు ఒలీక్ యాసిడ్లు కూడా ఉంటాయి. ఈ రెండూ ఫ్యాటీ యాసిడ్లు జుట్టు ఉపరితలాన్ని మెరుగుపరుస్తాయి మరియు జుట్టుకు ఒక పట్టువంటి మృదువైన ఉపరితలాన్ని అందిస్తాయి.

జీడిపప్పు దుష్ప్రభావాలు 

జీడిపప్పు అలెర్జీ ముఖ్యంగా పిల్లలలో ఒక సాధారణ సమస్యగా మారుతోంది. “ఆర్చివ్స్ అఫ్ డిసీజెస్ ఇన్ చైల్డ్ హుడ్” (Archives of Diseases in Childhood) అనే పత్రికలో ప్రచురించిన ఒక వ్యాసం ప్రకారం, వేరుశనకపిక్కల అలెర్జీలతో బాధపడే వారి కంటే జీడిపప్పు అలెర్జీలతో బాధపడే వారిలో అలెర్జీ ప్రతిచర్య ఎక్కువగా కనిపిస్తుంది తెలిసింది.
జీడిపప్పులు తినడం వలన ఆరోగ్యానికి మంచిది ఎందుకంటే వాటిలో అధిక సంఖ్యలో పోషకాలు ఉంటాయి. అయితే, అవి పూర్తి ఆహారాన్ని తయారు చేయరు. మన శరీరానికి పండ్లు, కూరగాయలు, ధాన్యాలు వంటి ఇతర ఆహార వనరుల నుండి లభించే ఇతర ముఖ్యమైన పోషకాలు కూడా అవసరం. కాబట్టి, పరిమిత పరిమాణంలో మాత్రమే జీడిపప్పులను తినడం మంచిది. యు.ఎస్. లో ని వ్యవసాయ శాఖ యొక్క మైప్లేట్ మార్గదర్శకాల (.S Department of Agriculture’s MyPlate guidelines) ప్రకారం , గింజలు, బీన్స్, టోఫు మరియు చేప వంటి అధిక ప్రోటీన్ల ఆహారాన్ని రోజుకు 5.5 ఔన్సులు తీసుకోవడం మంచిది. పరిమిత పద్ధతిలో జీడిపప్పులు తినడం మన శరీరంలో ఇతర ముఖ్యమైన ఆహారాలకు తగినంత స్థలం ఉంటుంది. సంక్షిప్తంగా, మంచి ఆరోగ్యానికి కోసం జీడిపప్పు తినవచ్చు కానీ ఏ ఒక్క ఆహార పదార్థం ఇతర ఆహార పదార్దాలను అధిగమించరాదు.
ఈ రోజుల్లో దుకాణాలలో ముడి లేదా పిక్క తియ్యని జీడిపప్పును చూడడం సాధారణం. ఒకవేళ అవి కనిపిస్తే, వాటి నుండి దూరంగా ఉండడం మంచిది మరియు పిక్క తీసివేసిన జీడిపప్పులను తీసుకోవడం ఉత్తమం. ఎందుకంటే ముడి జీడిపప్పు పాయిజన్ ఐవీ మరియు పాయిజన్ సుమాక్ తో ముడిపడి ఉండవచ్చు మరియు జీడిపిక్క పెంకులో ఉండే నూనె వలన చర్మంపై దురద మరియు అనూహ్యకరమైన ప్రతిచర్యలు ఏర్పడతాయి. వాణిజ్యపరంగా తయారుచేసిన జీడిపప్పులు నుండి వాటి పిక్కలు తొలగించబడతాయి మరియు అవి అధిక ఉష్ణోగ్రతల వద్ద వేయించబడతాయి ఇలా చేయడం వలన వాటిలో ఏవైనా విషపూరిత నూనెలను ఉంటే అవి నాశనం అవుతాయి, తద్వారా అవి  తినడానికి సురక్షితంగా మారతాయి.
జీడిపప్పులో ఉండే అధిక కేలరీల కారణంగా, అధిక వినియోగం బరువు పెరిగే ప్రమాదాన్ని పెంచుతుంది. కాబట్టి, పరిమిత పరిమాణంలో జీడిపప్పును తినడం మంచిది
ఉప్పువేయని జీడిపప్పులో సోడియం స్థాయిలు అధికంగా ఉండవు (100 గ్రాముల జీడిపప్పులో సోడియం 12 mgలు ఉంటుంది), వీటికి తరచూగా ఉప్పును జోడిస్తారు, ఉప్పు కలిపిన జీడిపప్పులలో ఒక ఔన్సుకు 181 mgల సోడియం ఉండవచ్చు. ఉప్పు జోడించిన జీడిపప్పులో అధిక స్థాయిలో సోడియం ఉంటే అది ఆరోగ్యానికి ప్రమాదకరంగా ఉంటుంది, ఎందుకంటే ఇది రక్తపోటు స్థాయిల పెరుగుదలకు దారితీస్తుంది మరియు ఇతర హృదయ సంబంధ సమస్యలకు కూడా దారి తీయవచ్చు.

ఉపసంహారం

విటమిన్లు, ఖనిజాలు, యాంటీఆక్సిడెంట్లు, ఫ్లేవానాయిడ్లు వంటి అనేక ఆరోగ్యకరమైన పోషకాల కారణంగా జీడిపప్పులు ఆరోగ్యానికి చాలా ఉపయోగకరంగా ఉంటాయి. అయినప్పటికీ, మిగిలిన వాటిలాగే, జీడిపప్పును అధికంగా తింటే ప్రమాదాలు మరియు ప్రతికూల ప్రభావాలు కూడా ఉంటాయి. ఎల్లప్పుడూ జీడిపప్పును పరిమిత పరిమాణంలో తీసుకోవడం మంచిదని సిఫారసు చేయబడుతుంది.
Sharing Is Caring:

Leave a Comment