ప్రోటీన్ ఆహారాలు ప్రయోజనాలు ఉపయోగాలు మరియు దుష్ప్రభావాలు Benefits Of Protein Diets Uses and Side -effects
ప్రోటీన్లు శరీరం యొక్క బిల్డింగ్ బ్లాకులు (శరీర నిర్మాణంలో ఇటుకల వంటివి) మరియు ప్రతి జీవన కణానికి ఇవి చాలా అవసరం. ప్రోటీన్ ఒక మాక్రోన్యూట్రియెంట్ మరియు రోజువారీ శరీర కార్యకలాపాలను చేయడానికి మరియు నిర్వహించడానికి మన ఆహారంలో ఇవి చాలా ఎక్కువ పరిమాణంలో అవసరం. ఒక సమతుల్య ఆహారం అందించే కేలరీలలో ప్రోటీన్లు 15-35% గా ఉండాలి.
ప్రోటీన్లు ప్రధానంగా అమైనో యాసిడ్లతో కూడి ఉంటాయి. మరియు కణాలకు శక్తిని కూడా అందిస్తాయి. ప్రతి గ్రాము ప్రోటీన్‌లో 4 కేలరీలు ఉంటాయి. ప్రోటీన్లు ప్రధానంగా రెండు రకాల అమైనో ఆమ్లాలను కలిగి ఉంటాయి. అవి, అవసరమైనవి (వీటిని మన శరీరం తయారు చేసుకోలేదు, మరియు ఆహార వనరుల నుండి వీటిని తీసుకోవలసి ఉంటుంది) మరియు అనవసరమైన అమైనో యాసిడ్లు (వీటిని మనం తీసుకునే ఆహారం ద్వారా శరీరం సొంతంగా తయారు చేసుకుంటుంది). మొత్తం 20 అమైనో యాసిడ్లలో, 9 అవసరమైనవిగా పరిగణించబడ్డాయి మరియు వీటిని తప్పనిసరిగా ఆహారం నుండి తీసుకోవాలి.
ప్రతి వ్యక్తికి ప్రోటీన్లు అవసరమవుతాయి. అయితే పెరుగుతున్న దశలలో, అంటే కౌమార దశ మరియు బాల్యంలో, సరైన పెరుగుదల మరియు అభివృద్ధికి సహాయం చేయడానికి ఇంకా ఎక్కువ మొత్తంలో ప్రోటీన్లు చాలా అవసరం. ఇది కాక, కొత్త కణాల మరమ్మత్తు (రిపేర్) మరియు నిర్మాణంలో ప్రోటీన్లు కూడా పాల్గొంటాయి. ఇది మన చర్మం, జుట్టు, ఎముకలు, గోర్లు, శరీర కణాలు, కండరాలు, అవయవాల యొక్క పరిపూర్ణ ఆరోగ్యానికి కూడా చాలా అవసరం మరియు శరీర ద్రవాలలో ఇది ఒక భాగం.
ప్రోటీన్ల యొక్క ప్రయోజనాలు మరియు విధులను, అలాగే దాని ఆహార వనరులు, మోతాదు మరియు దుష్ప్రభావాల
- ప్రోటీన్ యొక్క వనరులు
- ప్రోటీన్ల ఆరోగ్య ప్రయోజనాలు
- శాకాహారులకు ప్రోటీన్ అధికంగా ఉండే వంటకం
- ప్రోటీన్ల దుష్ప్రభావాలు
ప్రోటీన్ యొక్క వనరులు
వివిధ ఆహార ఉత్పత్తులలో ప్రోటీన్లు అధిక మొత్తంలో ఉంటాయి. ముఖ్యంగా జంతు వనరుల నుండి తీసుకోబడిన వాటిలో ఇంకా అధికంగా ఉంటాయి. మీ ఆహారంలో ఈ క్రింది ఉన్న కొన్ని ఆహారా పదార్దాలను చేర్చడం వల్ల మీ రోజువారీ ప్రోటీన్ అవసరాలను తీర్చవచ్చును . ఇది కాకుండా, ప్రోటీన్ పౌడర్లు, ప్రోటీన్ షేక్లు మరియు ప్రోటీన్ సప్లిమెంట్లు కూడా అందుబాటులో ఉన్నాయి. అయితే, సహజ వనరుల నుండి పోషణను పొందడం చాల ఉత్తమం. ఇది సప్లిమెంట్స్ మరియు కృత్రిమ ఉత్పత్తుల యొక్క దుష్ప్రభావాలను నివారించడంలో కూడా సహాయపడుతుంది. ఇక్కడ కొన్ని ప్రోటీన్ వనరులు ఉన్నాయి:
- గుడ్లు
- పాలు మరియు వివిధ రకాల చీజ్లు, కాటేజ్ చీజ్, పెరుగు, యోగర్ట్ వంటి పాల ఉత్పత్తులు
- లీన్ మీట్
- లీన్ పోర్క్ (పంది మాంసం)
- టర్కీ
- చర్మం తొలగించబడన కోడిమాంసం
- సాల్మన్, ట్యూనా వంటి చేపలు
- నత్తలు
- బాదం, హాజెల్ నట్స్, వేరుశెనగలు, వాల్నట్లు వంటి గింజలు
- పొద్దుతిరుగుడు పువ్వు విత్తనాలు
- బాదం పాలు లేదా సోయా పాలు
- టోఫు
- పీనట్ బటర్ (వేరుశెనగ వెన్న)
- క్వినోవా వంటి తృణధాన్యాలు
- కాయధాన్యాలు
- కిడ్నీ బీన్స్, రాజుల చిక్కుళ్ళు, రాజ్మా, బఠానీలు, మొలకలు
- శనగలు
- కాబట్టి, శాఖాహారులు, మాంసాహారులు లేదా పాలు, గుడ్లు వంటివి కూడా తినని శాకాహారులు కూడా ఆహారంలో తగినంత ప్రోటీన్లు తీసుకోవచ్చు.
ప్రోటీన్ ఆహారాలు ప్రయోజనాలు ఉపయోగాలు మరియు దుష్ప్రభావాలు,Benefits Of Protein Diets Uses and Side -effects
ప్రోటీన్ల ఆరోగ్య ప్రయోజనాలు
శరీర కణాల పెరుగుదల మరియు నిర్వహణకు మరియు రోజువారీ పనులకు తగినంత శక్తిని అందించడానికి కూడా ప్రోటీన్లు చాలా అవసరం. అయితే, ఇవి కొన్ని ఇతర ముఖ్యమైన విధులను కూడా నిర్వహిస్తాయి.
చర్మం కోసం: చర్మం యొక్క బలం మరియు ఎలాస్టిసిటీ (elasticity) ను కాపాడటానికి ప్రోటీన్లు చాలా అవసరం . ముఖపు ముడుతలను నివారించడంలో ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి. కొల్లాజెన్, ఒక నిర్మాణాత్మక ప్రోటీన్ (structural protein), ఇది గాయాలను నయం చేయడంలో కూడా సహాయపడుతుంది మరియు రాపిడి వలనకలిగే పుండ్లు, డయాబెటిక్ అల్సర్స్, కాలిన గాయాలు, కొట్టుకుపోవడం మరియు సెల్యులైట్ నిర్వహణకు కూడా ఉపయోగపడతాయి.
జుట్టు కోసం: జుట్టు యొక్క నిర్మాణాన్ని నిర్వహించడానికి ప్రోటీన్లు ముఖ్యమైనవి. ప్రోటీన్ల లోపం కొల్లాజెన్‌లో నిర్మాణాత్మక మార్పులకు కారణమవుతుంది, ఇది జుట్టు రాలడానికి మరియు జుట్టు పలుచబడానికి కూడా దారితీస్తుంది.
పిల్లలకు: ప్రోటీన్లు శరీరం యొక్క సరైన పెరుగుదల మరియు అభివృద్ధికి సహాయపడతాయి మరియు బాల్యంలో వచ్చే ఇన్ఫెక్షన్లు, అనారోగ్యాలు మరియు ఎముకల పేలవమైన అభివృద్ధి వంటి వాటిని నివారించడానికి పిల్లల ఆహారంలో వీటిని తప్పనిసరిగా చేర్చాలి.
బరువు తగ్గడానికి: ప్రోటీన్లు శరీర కండర ద్రవ్యరాశిని బాగా మెరుగుపరుస్తాయి మరియు కొవ్వుల విరివిని తగ్గించడంలో కూడా సహాయపడతాయి, తద్వారా కొవ్వు తగ్గడాన్ని ప్రోత్సహిస్తాయి. అందుకే అథ్లెట్లకు కూడా ప్రోటీన్లు కూడా ముఖ్యమైనవి.
మెదడు మరియు గుండె కోసం: న్యూరోట్రాన్స్మిటర్లు ఏర్పడటానికి ప్రోటీన్లు చాలా ముఖ్యమైనవి మరియు సరైన మెదడు పనితీరుకు ఇవి అవసరం. ముఖ్యంగా మహిళల్లో గుండె సంబంధిత రుగ్మతల ప్రమాదాన్ని ప్రోటీన్లు తగ్గిస్తాయని కనుగొనబడింది.
- చర్మానికి ప్రోటీన్లు
- జుట్టుకు ప్రోటీన్ ప్రయోజనాలు
- పిల్లలకు ప్రోటీన్లు
- బరువు తగ్గడం కోసం ప్రోటీన్
- మెదడుకు ప్రోటీన్లు
- గుండె కోసం ప్రోటీన్ ప్రయోజనాలు
- అథ్లెట్ల కోసం ప్రోటీన్లు
చర్మానికి ప్రోటీన్లు
ఎక్సట్రాసెల్యూలార్ మాట్రిక్స్ (extracellular matrix) మరియు కన్నెక్టీవ్ టిష్యూలలో కొల్లాజెన్ ఒక ప్రధానమైన నిర్మాణాత్మక (structural) ప్రోటీన్. కొల్లాజెన్ మన శరీరంలో అధికంగా లభించే ప్రోటీన్ మరియు చర్మంలో ఇది ఒక ప్రధాన భాగం. ఇది చర్మం యొక్క ఎలాస్టిసిటీ మరియు బలాన్ని నిర్వహించడానికి సహాయపడుతుంది. తద్వారా చర్మంపై వృద్ధాప్య లక్షణాలను తగ్గించే అవకాశం కూడా ఉంటుంది. ఇది చర్మం తేమను పునరుద్ధరించడంలో కూడా సహాయపడుతుంది, ఇది పొడి చర్మం ఉన్న వ్యక్తులకు బాగా సహాయపడుతుంది.
కొల్లాజెన్ సప్లిమెంట్‌ను తీసుకునే మహిళల బృందంతో కూడిన ఒక అధ్యయనంలో, ప్లేసిబో (ఎటువంటి ప్రభావంలేని పదార్థం తీసుకోవడం) చికిత్స పొందుతున్న సమూహంతో పోల్చినప్పుడు, కొల్లాజెన్ సప్లిమెంట్‌ను తీసుకునే మహిళలలో చర్మ ఎలాస్టిసిటీలో గణనీయమైన మెరుగుదల గమనించబడింది. ఇది చర్మం యొక్క తేమను పునరుద్ధరించడంలో కూడా సహాయపడింది.
ముఖ్యంగా వృద్ధ చర్మం మీద కొల్లాజెన్ భర్తీ యొక్క ప్రభావాలను గుర్తించడానికి నిర్వహించిన మరొక పరిశోధనలో ఈ ఏజెంట్లను (కొల్లాజెన్ సప్లిమెంట్) ఓరల్ గా (నోటి ద్వారా) తీసుకోవడం వల్ల చర్మపు మాట్రిక్స్ యొక్క సంథసిస్ పై ప్రభావం చూపడం ద్వారా చర్మపు ముడతలు అధికంగా కనిపించడాన్ని తగ్గించిందని తెలిసింది. అందువల్ల, చర్మ ఆరోగ్యాన్ని రక్షించడంలో సహాయపడే ప్రోటీన్లను మీ ఆహారంలో చేర్చడం చాలా ఉత్తమం.
దీనితో పాటుగా, కొల్లాజెన్ గాయం నయమయ్యే ప్రక్రియలో అన్ని దశలలో ఒక ముఖ్యమైన పాత్రను కలిగి ఉంది. గాయం/పుండు నయమయ్యే ప్రారంభ దశలలో టైప్ 3 కొల్లాజెన్ ఉత్పత్తి అవుతుంది. ఉపరితల (పైపైన జెరిగే) గాయాలు, శయ్య పుండ్లు (సుదీర్ఘమైన బెడ్ రెస్ట్ కారణంగా ఏర్పడే గాయాలు), మధుమేహ పుండ్లు (మధుమేహ రోగుల పాదాల మీద అభివృద్ధి చెందుచెందే ఒక గాయం/పుండు), కాలిన గాయాలు, కొట్టుకుపోవడం (చర్మం గీరుకుపోవడం లేదా రక్కుకుపోవడం వలన ఏర్పడే గాయాలు) వంటి వివిధ రకాలైన గాయాల నిర్వహణకు కూడా కొల్లాజెన్ యొక్క ఉపయోగం సూచించబడింది. చర్మం స్క్రాప్ చేయడం లేదా రుద్దడం వల్ల). ఈ సూచనలు కొల్లాజెన్ యొక్క వైద్య లక్షణాలను ప్రముఖంగా తెలుపుతాయి. కాబట్టి, ఇది తరచుగా చర్మ క్రీములు, లోషన్లు మరియు ఇతర ఓవర్ ది కౌంటర్ (మందుల షాప్ లో సులువుగా దొరికేవి) ఉత్పత్తుల యొక్క ఒక సాధారణ భాగంగా ఉంటుంది.
కొల్లాజెన్ మహిళల్లో సెల్యులైట్ను తగ్గిస్తుంది. లక్షణాన్ని బాగా మెరుగుపరుస్తుంది. కొల్లాజెన్ యొక్క దీర్ఘకాలిక ఓరల్ వాడకం దీనిపై సానుకూల ప్రభావాలను చూపిందని పరిశోధకులు సూచించారు. కొల్లాజెన్ ఏర్పడటానికి మరియు నిర్వహించడానికి సహాయపడే ప్రోటీన్లను ఆహారంలో చేర్చడం చాలా మంచిది. ఓవర్ ది కౌంటర్ క్రీములు మరియు ఉత్పత్తులను కూడా ఉపయోగించవచ్చును . అయినప్పటికీ, వైద్యుల సూచన లేకుండా కొల్లాజెన్ సప్లిమెంట్లను తీసుకోకూడదని గట్టిగా సిఫార్సు చేయబడింది.
జుట్టుకు ప్రోటీన్ ప్రయోజనాలు
కెరాటిన్ ఒక ఫైబరస్ ప్రోటీన్ . జుట్టు, గోర్లు మరియు ఇతర కణజాలాల యొక్క ప్రధాన భాగం. మన జుట్టు 99% కెరటిన్ను కలిగి ఉంది. దీనికి జుట్టుకు బలము చేకూర్చే మరియు రక్షించే చర్యలు ఉంటాయి. కెరాటిన్ నిర్మాణాన్ని నిర్వహించడానికి ప్రోటీన్లు మరియు అమైనో ఆమ్లాలు కూడా సహాయపడతాయి. కాబట్టి, దాని నిర్వహణకు అవసరమైన ప్రోటీన్ అధికంగా ఉండే ఆహారాలను తీసుకోవడం చాలా ముఖ్యం.
ప్రోటీన్ లోపం వలన, కెరాటిన్‌లో నిర్మాణాత్మక మార్పులు ఏర్పడతాయి. ఇది తరచుగా జుట్టు ఆకారంలో మార్పులకు బాగా దారితీస్తుంది. ఈ లోపం జుట్టు రాలడం, జుట్టు పలుచబడడం మరియు జుట్టు ఊడిపోవడం వంటి వాటితో ముడిపడి కూడా ఉంటుంది. ముఖ్యంగా అవసరమైన అమైనో యాసిడ్లు ఉండే ప్రోటీన్ ఆహార పదార్థాల యొక్క పరిమిత వినియోగం వలన ఈ లోపం ఏర్పడే అవకాశం కూడా ఉంటుంది.
అమైనో యాసిడ్లు జుట్టు కోసం కొన్ని నిర్దిష్ట చర్యలను నిర్వహిస్తాయి. ఎల్-మెథియోనిన్ వంటి సల్ఫర్ కలిగిన అమైనో ఆమ్లాలు వెంట్రుకలలో సల్ఫర్ స్థాయిలను పెంచడం ద్వారా జుట్టుకు బలానికి అందించడంలో బాగా సహాయపడతాయి. సల్ఫర్ జుట్టు పెరుగుదలకు చాలా అవసరం మరియు అది జుట్టు యొక్క సాధారణ రూపాన్ని కూడా ప్రభావితం చేస్తుందని గుర్తించబడింది. దీని లోపం జుట్టు రాలడానికి కూడా కారణమవుతుంది. పురుషుల పై నిర్వహించిన ఒక అధ్యయనం ప్రకారం, మగవారిలో వచ్చే బట్టతల (అలోపేసియా యొక్క సాధారణం రకం) శరీరంలో అమైనో యాసిడ్ల శోషణను అడ్డుకునే ఆహారాలు తీసుకోవడం వలన వస్తుందని అది ప్రోటీన్ లోపానికి కారణమవుతుందని కూడా తెలిసింది.
అమైనో ఆమ్లాలు మరియు ప్రోటీన్ల లోపం జుట్టు రాలడాన్ని కూడా సూచిస్తుంది. కాబట్టి, ఆహార విధానంలో ప్రోటీన్లు ఎక్కువగా ఉండే ఆహారపదార్దాలను చేర్చాలని సిఫార్సు చేయబడింది. అయినప్పటికీ, ఎంచుకునే ప్రోటీన్ ఆహార వనరుల గురించి కొంచెం జాగ్రత్తగా ఉండాలి, ఎందుకంటే కొన్ని వనరులు (ఎల్-లైసిన్ సమృద్ధిగా ఉండేవి) జుట్టుకు అవసరమైన అమైనో ఆమ్లాల శోషణను కూడా తగ్గిస్తాయి. ఎల్-లైసిన్ యొక్క కొన్ని వనరులు ఎర్ర మాంసాలు (రెడ్ మీట్), ఇవి సాధారణ ఆరోగ్యానికి కూడా హానికరం.
పిల్లలకు ప్రోటీన్లు
ప్రోటీన్లు బిల్డింగ్ బ్లాకులుగా పిల్లల అభివృద్ధికి చాలా అవసరమైన పోషకాలు. అవి పిల్లల యొక్క సరైన ఎదుగుదల మరియు అభివృద్ధిలో బాగా సహాయపడతాయి . వారి ఎముకల మరియు కండరాల ఆరోగ్యానికి ఎంతో అవసరం. ఎదిగే పిల్లలలో తగినంత స్థాయిలో డైటరీ ప్రోటీన్లను నిర్వహించడం చాలా అవసరం. జీవితం యొక్క ప్రారంభ దశలలో (బాల్యంలో) ప్రోటీన్ లోపం చాలా ప్రమాదకరం. ఇది పిల్లలలో ప్రోటీన్-ఎనర్జీ పోషకాహార లోపానికి (మాల్ న్యూట్రిషన్) కారణం కావచ్చును . ఇది తీవ్రమైన పోషకాహార లోపానికి కూడా కారణమవుతుంది, తద్వారా క్వాషియోర్కోర్ మరియు మారస్మస్ వంటి తీవ్రమైన రుగ్మతలకు దారితీస్తుంది. అటువంటి పిల్లలు తరచూ తీవ్రమైన తక్కువ బరువును కలిగి ఉంటారు . వారిలో పెరుగుదల తక్కువగా ఉండవచ్చు (ఎత్తుకు తగినంత కాకుండా చాలా తక్కువ శరీర బరువు ఉంటుంది). వారి ఎముక నిర్మాణం కూడా ప్రభావితమవుతుంది. ఎముకలు పెళుసుబారుతాయి, ఇది ఫ్రాక్చర్ల మరియు వైకల్యాల/లోపాల ప్రమాదాన్ని బాగా పెంచుతుంది.
పోషకాహారలోపం మరియు పేదరికం యొక్క ప్రాబల్యం కారణంగా, ఈ రుగ్మతలు భారతదేశంలో చాలా సాధారణం మరియు ప్రోటీన్లను తగినంతగా అందించడం ద్వారా వీటిని నిర్వహించవచ్చు. ప్రోటీన్ లోపం ఉన్న పిల్లలు తీవ్రమైన ఇన్ఫెక్షన్లు మరియు అనారోగ్యాలకు కూడా గురవుతారు, ఇది వారి మనుగడను ప్రభావితం చేస్తుంది. హిమోగ్లోబిన్ సింథసిస్ లో కూడా ప్రోటీన్ ఉంటుంది. కాబట్టి ఈ పిల్లలలో రక్తహీనత కూడా సాధారణంగా సంభవిస్తుంది.
దీనిని నివారించడానికి, వారి వయస్సుకి సిఫారసు చేయబడిన స్థాయిలలో పిల్లలకు తగినంత ప్రోటీన్ ను కూడా అందించాలి. చనుబాలు శిశువులకు ఒక మంచి ప్రోటీన్ మూలాలు మరియు వారికి ఇవి ప్రముఖంగా సిఫార్సు చేయబడతాయి. పిల్లవాడు దాదాపు 6 నెలల వయస్సులో తినడం ప్రారంభించినప్పుడు ప్రోటీన్ అధికంగా ఉండే ఘన ఆహారాలు (Solid foods) సిఫార్సు చేయబడతాయి.
1 నుండి 3 సంవత్సరాల పిల్లలకు 13 గ్రాముల ప్రోటీన్ కూడా సూచించబడుతుంది. శాఖాహారులు మరియు తక్కువ బరువున్న పిల్లలకు ఇంకా అదనపు ప్రోటీన్ అవసరమని గమనించాలి. ఒకసారి వైద్యులని సంప్రదించి శిశువు అవసరమైన ప్రోటీన్ పరిమాణం గురించి తెలుసుకోవడం కూడా చాలా ఉత్తమం.
బరువు తగ్గడం కోసం ప్రోటీన్
సమతుల్య ఆహారంలో రోజువారీ శక్తి అవసరాలను తీర్చడానికి 10-35% ప్రోటీన్ ఉండాలి. ప్రోటీన్లు 15% శక్తిని కూడా అందిస్తాయి మరియు కండరాల యొక్క ప్రధాన భాగాల. ప్రోటీన్ అధికంగా ఉండే ఆహారం శరీరంలోని పోషక మరియు శక్తి అవసరాలను తీరుస్తూ దానితో పాటుగా కండర ద్రవ్యరాశిని పెంచి మరియు అవాంఛిత కొవ్వులను కండర ద్రవ్యరాశి భర్తీతో కూడా తగ్గిస్తుంది. అధిక ప్రోటీన్ మరియు తక్కువ కార్బోహైడ్రేట్ ఉండే ఆహారం బరువు తగ్గే ప్రభావాలతో ముడిపడి ఉంటుంది . ఆకలిని తగ్గించే పదార్థంగా కూడా పనిచేస్తుంది. ఇది బరువు తగ్గుదల యొక్క ప్రారంభ దశలలో మెరుగైన ఫలితాలను కూడా చూపుతుంది. అయితే కేలరీల సంఖ్యలో మార్పులు లేకపోతే దీర్ఘకాలిక ప్రభావాలు అనుకూలంగా కూడా లేకపోవచ్చు.
అధికంగా సంక్లిష్ట ప్రోటీన్లను తీసుకోవడం కొన్ని ఆరోగ్య నష్టాలు ఉనందువల్ల, ఆహారంలో తక్కువ కొవ్వు, లీన్ ప్రోటీన్ గల వనరులను చేర్చడం చాలా మంచిది. దీనితో పాటు తక్కువ కేలరీలను తీసుకోవడం వల్ల బరువు తగ్గడానికి మరియు శక్తి అవసరాలను తీర్చడానికి కూడా అది సహాయపడగలదు. అయితే రోజూ తీసుకునే ఆహారంలో ప్రధాన మార్పులు లేదా చాలా ఎక్కువ ప్రోటీన్ ఉండే ఆహరం తీసుకోవచ్చని మీకు సూచించబడదు, ఇది దుష్ప్రభావాలను కలిగిస్తుంది. మీ ఆరోగ్య స్థితిని బట్టి ఉత్తమ పోషక సలహాలను తెలుసుకోవడానికి మీరు మీ వైద్యులను లేదా డైటీషియన్‌ను సంప్రదించడం చాలా మంచిది.
ప్రోటీన్ ఆహారాలు ప్రయోజనాలు ఉపయోగాలు మరియు దుష్ప్రభావాలు,Benefits Of Protein Diets Uses and Side -effects
మెదడుకు ప్రోటీన్లు
వివిధ న్యూరోట్రాన్స్మిటర్ల నిర్మాణం కోసం ప్రోటీన్లు చాలా అవసరం. ఇవి మెదడులో అనేక విధులను కూడా నిర్వహిస్తాయి. ఈ న్యూరోట్రాన్స్మిటర్లు అనేక అమైనో యాసిడ్లతో తయారు చేయబడి ఉంటాయి. ఇవి మెదడు పనితీరును మెరుగుపరచడమేకాక గుండె, కాలేయం మొదలైనటువంటి అనేక ముఖ్యమైన అవయవాల పనితీరుకు కూడా సహాయం చేస్తాయి.
సరైన మెదడు పనితీరుకు ట్రిప్టోఫాన్ ఒక బాగా అవసరమైన అమైనో యాసిడ్ మరియు దాని లోపం సాధారణ ప్రవర్తనకు అంతరాయం కలిగిస్తుందని కూడా తెలుస్తుంది. ట్రిప్టోఫాన్ మెదడు యొక్క మేధాశక్తి (జ్ఞాపక శక్తి మరియు విశ్లేషణాత్మక నైపుణ్యాలు) పనితీరుకు అవసరం. కాబట్టి పెరుగే వయస్సుతో పాటు ట్రిప్టోఫాన్ అవసరం కూడా అధికం కావచ్చు. అయితే, వివిధ వయసుల వారికి సూచించబడే మోతాదుల గురించి సరిగ్గా తెలియకపోయినా, మెదడు పనితీరును బాగా మెరుగుపరచడానికి ప్రోటీన్లు అధికంగా ఉండే ఆహారల వినియోగాన్ని పెంచడం చాలా మంచిది.
గుండె కోసం ప్రోటీన్ ప్రయోజనాలు
బరువు తగ్గించడంలో సహాయం చెయ్యడంతో పాటుగా, అధిక ప్రోటీన్ గల డైట్ గుండె రుగ్మతలను కూడా నివారిస్తుందని కనుగొనబడింది. 8000 మంది మహిళలపై జరిపిన అధ్యయనంలో,అధిక కార్బోహైడ్రేట్ ఆహారం తీసుకునే వారితో పోలిస్తే అధిక ప్రోటీన్ కలిగిన ఆహారం తీసుకునే మహిళలలో హృదయ సంబంధ రుగ్మతలు వచ్చే ప్రమాదం 30% తక్కువగా ఉందని గుర్తించారు. మొక్కల వనరుల నుండి ప్రోటీన్ తీసుకున్నపుడు ఈ పరిశీలన ఇంకా నిలకడగా ఉన్నట్లు గుర్తించారు.
తక్కువ సాంద్రత కలిగిన లిపోప్రొటీన్ లేదా చెడు కొలెస్ట్రాల్ స్థాయిలో తగ్గుదల మరియు రక్తపోటు తగ్గుదలతో కూడా ఈ ఆహారం ముడిపడి కూడా ఉంటుంది.
కాబట్టి, మన ఆహార విధానంలో అధిక ప్రోటీన్లు ప్రధానంగా కార్డియోప్రొటెక్టివ్ పాత్రను పోషిస్తాయని అని చెప్పవచ్చును . కాని జంతువుల మూలాల నుండి వచ్చిన ప్రోటీన్లను నివారించడం మంచిది, ముఖ్యంగా రెడ్ మీట్ తినడం మానుకోవాలి
అథ్లెట్ల కోసం ప్రోటీన్లు
కండరాల పెరుగుదల మరియు పనితీరుకు ప్రోటీన్లు చాలా అవసరం . కాబట్టి అవి అథ్లెట్లు మరియు బాడీబిల్డర్లకు అధిక పరిమాణంలో అవసరం మరియు అవి అథ్లెటిక్ (క్రిడా సంబంధిత) పనితీరును కూడా మెరుగుపరుస్తాయని అంటారు. అథ్లెట్లు మరియు కోచ్‌లు తరచూగా వారి శక్తి అవసరాలను తీర్చడానికి వారు తీసుకునే ఆహారంలో ప్రోటీన్ల స్థాయిని పెంచుతూ ఉంటారు. పరిశోధనా ఆధారాలు ప్రోటీన్ల సప్లీమెంటేషన్ (అందించడం) శిక్షణా నైపుణ్యాలను మెరుగుపరుస్తుందని మరియు మెరుగైన కండరాల పెరుగుదలకు దారితీస్తుందని నిరూపించాయి. ఆహారంలో ప్రోటీన్లను తీసుకోవడం అనేది కండరాలకు లభించే ప్రోటీన్ల స్థాయిని పెంచుతుందని అంటారు. ఇది సన్నని (పలుచని) కండరాలను శరీరం కోల్పోకుండా చేస్తుంది. కాబట్టి, అధిక స్థాయిలో శారీరక శ్రమ ఉండే వ్యక్తులు వారి వైద్యులు మరియు శిక్షకులని సంప్రదించిన తరువాత ప్రోటీన్ తీసుకునే స్థాయిని పెంచవచ్చని సలహా ఇవ్వబడుతుంది.
శాకాహారులకు ప్రోటీన్ అధికంగా ఉండే వంటకం
జంతు ఆధారిత ప్రోటీన్ వనరులతో పోలిస్తే మొక్క ఆధారిత ప్రోటీన్ వనరులు ఎక్కువ ప్రయోజనకరంగా ఉంటాయి కాబట్టి, మొక్క ఆధారిత ప్రోటీన్ వనరులను ఎక్కువ తీసుకోవడం మంచిది.
శాఖాహార వనరల నుండి శరీరానికి అవసరమైన అన్ని అమైనో యాసిడ్లు లభించేలా చేసే ఒక వంటకాన్ని తెలుసుకుందాం.
ఒక గిన్నెలో ఈ క్రింది పదార్థాలను తీసుకోండి:
1 కప్పుడు క్వినోవా లేదా వోట్స్
1 కప్పుడు కాయధాన్యాలు (మీకు నచ్చిన ఏదైనా పప్పులు)
1 కప్పు బఠానీలు మరియు స్వీట్‌కార్న్ మిశ్రమం (నిల్వ చేసినవి లేదా తాజావి)
అందుబాటులో ఉంటే కనుక, కొన్ని పొద్దుతిరుగుడు పువ్వు విత్తనాలు ( కొన్ని వేరే నట్స్ కూడా ఎంచుకోవచ్చు)
1 చిన్న ఉల్లిపాయ
కొన్ని పచ్చ ఆలివ్లు
గార్నిష్ మరియు రంగు కోసం కొంచెం కొత్తిమీర
ఈ పదార్ధాలు అన్ని ఒక గిన్నెలో కలపండి, రుచి కోసం కొద్దిగా ఆలివ్ నూనె మరియు ఉప్పు కలపండి. అంతే ఒక గిన్నెడు ప్రోటీన్లు సిద్ధం!!
ప్రోటీన్ ఆహారాలు ప్రయోజనాలు ఉపయోగాలు మరియు దుష్ప్రభావాలు,Benefits Of Protein Diets Uses and Side -effects
ప్రోటీన్ల దుష్ప్రభావాలు
మొక్కల నుండి వచ్చే ప్రోటీన్లు చాలా అరుదుగా దుష్ప్రభావాలను కలిగి ఉంటాయి. వాటిలో ఒకటి లేదా రెండు అవసరమైన అమైనో ఆమ్లాలు ఉండవు. అందుకే జంతు ఆధారిత ఆహారాలకు ప్రాధాన్యత ఇవ్వబడుతుంది. మాంసాహారాలు అన్ని అవసరమైన అమైనో ఆమ్లాలతో నిండి ఉంటాయి మరియు లీన్ మరియు తక్కువ కొవ్వు ఉండే రకాలైన మాంసాహారాలను ఎంచుకుంటే ఎటువంటి హాని ఉండదు. కానీ, అధిక కొవ్వు రకాలు, ముఖ్యంగా రెడ్ మీట్ వివిధ ప్రమాదాలని పెంచుతుంది.
కరోనరీ హార్ట్ డిసీజ్
టైప్ 2 మధుమేహం
గుండెపోటు వంటి వివిధ గుండె రుగ్మతలు
కొన్ని రకాల క్యాన్సర్లు
అధిక ప్రోటీన్ ఆహారం యొక్క కొన్ని దుష్ప్రభావాలు:
హాలిటోసిస్ (నోటి నుండి దుర్వాసన)
తలనొప్పి
మలబద్ధకం
ఉబ్బరం
కడుపు తిమ్మిరి
మూత్రపిండాల పనితీరు బలహీనపడటం
సప్లిమెంట్ల రూపంలో ఉండే ప్రోటీన్ల యొక్క కృత్రిమ వనరులు కొంతమంది వ్యక్తులలో అలెర్జీ ప్రతిచర్యలకు కారణం కావచ్చు.
Tags: protein,high protein diet,protein benefits,high protein,high protein meals,high protein foods,protein foods,low protein diet and kidney disease,how much protein,how much protein do i need,protein diet,protein sparing modified fast and keto,protein and digestion,foods with high protein,high protein vegan meals,protein shake,dairy and protein,high protein food,best protein for fat loss and muscle gain,protein rich foods,protein and joint pain