అతిపెద్ద నందిగల క్షేత్రం చిదంబరం
తమిళనాడు కడలూర్ జిల్లాలో ఉన్నది. చెన్నై నుండి సుమారు 243 కి.మీ దూరంలో ఉంటుంది. ఆలయ నడిబొడ్డులో నటరాజస్వామి ఆలయం ఉంటుంది. శివుడు శివతాండవం చేస్తూ నటరాజుగా వెలసిన ఆలయం. మానవరూపంలో శివుడు ఉండే ఏకైక ఆలయం. పంచభూతాల కొరకు నిర్మించిన ఆలయాల్లో ఈ ఆలయం ఆకాశతత్యానికి నిర్మించబడినది.
ఇంకా కంచి ఏకాంబరేశ్వర ఆలయం భూమితత్వానికీ, తిరువడ్డామలై అరుణాచలేశ్వర ఆలయం అగ్నితత్యానికీ, శ్రీ కాళహస్తీశ్వరస్వామి ఆలయం వాయుతత్యానికి మరియు జంబుకేశ్వర ఆలయం జలతత్యానికి నిర్మింపబడ్డాయి.