రక్తదానం చేయడం ఎంతవరకు శ్రేయస్కరం

రక్తదానం చేయడం ఎంతవరకు శ్రేయస్కరం

ప్రకృతిలో మానవ శరీరం ఒక గొప్ప సృష్టి. మానవ శరీరంలోని అవయవాలకు కూడా ప్రత్యామ్నాయం కనుగొంటున్నారు. కానీ మానవ శరీరంలో అతి ముఖ్యమైనది రక్తం. రక్తానికి మాత్రం ఎలాంటి ప్రతామ్నాయం లేదు. అందుకే రక్తదానం తప్పనిసరి. రక్తం దానం చేయడం వల్ల తీసుకునే వారికే కాకుండా ఇచ్చేవారికి కూడా ఎంతో మేలుచేస్తుంది.
సాధారణంగా ఎముక మజ్జలో రక్తం తయారవుతుంది. మాములుగా ఆరోగ్యమైన వ్యక్తి లో 5-6 లీటర్ల రక్తం ఉంటుంది. 18-60 సంవత్సరాల వరకు వయసు ఉండి 50 KG ల బరువు కలిగి ఉన్న వ్యక్తి 250 – 300 ML రక్తం దానం చేయవచ్చు. దానం చేసిన రక్తం 24 గంటలలో తిరిగి శరీరం ఉత్పత్తి చేసుకుంటుంది. ఎర్ర రక్త కనాలని తిరిగి 2 వారాలలో తయారుచేసుకుంటుంది. దీని కోసం ప్రత్యేకమైన ఫుడ్ తీసుకోవాల్సిన అవసరం కూడా లేదు.మాములు ఫుడ్ తీసుకుంటే చాలు. ఒక మనిషి సంవత్సరానికి 3-4 సార్లు రక్తం దానం చేయవచ్చు.
రక్తదానం చేయడం ఎంతవరకు శ్రేయస్కరం
ప్రయోజనాలు:

కొత్త కాణాల ఉత్పత్తి జరుగుతుంది.

కొత్త రక్తం ఏర్పడుతుంది. దీనివల్ల ఉత్సాహంగా ఉంటారు.

గుండె సంబంధ వ్యాధుల నుండి రక్షణ లభిస్తుంది.

శరీరంలో ఐరన్ లెవెల్స్ క్రమబద్దీకరించబడతాయి. తద్వారా కాన్సర్ వచ్చే అవకాశాలు తగ్గుతాయి.

బ్లడ్ సర్కులేషన్ సాఫీగా జరుగుతుంది.

కొలస్ట్రాల్ తగ్గుతుంది. బరువు తగ్గుతారు. అది ఎలాగంటే రక్తాన్ని తిరిగి తయారుచేసుకోవడానికి ఉన్న కొవ్వు నిల్వలను శరీరం వాడుకుంటుంది.

అన్నింటికంటే ముక్యంగా ఒకరి ప్రాణాన్ని కాపాడవచ్చు.

 

Read More  స్కిజోఫ్రెనియాను నివారించే ఇంటి చిట్కాలు,Home Tips To Prevent Schizophrenia

 

Sharing Is Caring:

Leave a Comment