...

అసాధారణ ఆరోగ్య ప్రయోజనాలను కలిగి ఉన్న రాజ్ మా

అసాధారణ ఆరోగ్య ప్రయోజనాలను కలిగి ఉన్న రాజ్ మా

రాజ్ మా గింజలు కిడ్ని ఆకారంలో ఉంటాయి. అందుకే వీటిని కిడ్నీ బీన్స్ అని  కూడా  అంటారు, వీటిని పవర్ హౌస్ అఫ్ ప్రోటీన్స్ గా పిలుస్తారు. మాంసం లో కంటే ఎక్కువ ప్రోటీన్స్ రాజ్ మాలో ఉంటాయి. కనుక శాకాహారులకు మంచి పౌష్టికాహారం గా చెప్పవచ్చును .
రాజ్ మా లోని పోషకాలు:
రాజ్మా లో విటమిన్ B6, E, K, క్యాల్షియం, ఐరన్ మరియు  మెగ్నీషయం, పొటాషియం, మాంగనీస్ వంటి ఖనిజ లవణాలతో పాటు కాపర్, ఒమేగా ఫ్యాటి ఆసిడ్స్ కూడా  లభిస్తాయి.  రాజ్మాలో ఫైబెర్ ఎక్కువగా కొలెస్ట్రాల్ తక్కువగా  కూడా  ఉంటాయి.
అసాధారణ ఆరోగ్య ప్రయోజనాలను కలిగి ఉన్న రాజ్ మా
రాజ్ మా వలన లాభాలు:

రక్తహీనతను తగ్గిస్తుంది, గుండె ఆరోగ్యాన్ని కాపాడుతుంది, గుండె జబ్బులు రాకుండా చేస్తుంది.

బోజనం తర్వాత బ్లడ్ షుగర్ లెవెల్స్ ని తగ్గించడంలో రాజ్ మా లొని ప్రోటీన్స్ ఎంతగానో తోడ్పడుతాయి.

షుగర్ వ్యాధిని తగ్గించడంలో   రాజ్మా  బాగా సహాయపడుతుంది.  అందువల్ల షుగర్ వ్యాధిగ్రస్థులు తమ రెగ్యులర్ డైట్ లో రాజ్మా తీసుకోవడం మంచిది.

రాజ్ మా మాంసాహారం కన్నా ఎక్కువ శక్తిని శరీరానికి అందిస్తుంది.  అందువల్ల శాకాహారులకు మంచి ఎనర్జిటిక్ ఫుడ్ గా చెప్పవచ్చును .

యాంటి ఏజింగ్ లక్షణాలను కలిగివుంటుంది, అందువలన ముసలితనాన్ని దరిచేరనివ్వదు.

రాజ్ మాలో ఫైబర్ అధిక మోతాదులో ఉండడం వలన కొలెస్ట్రాల్ ని కూడా  తగ్గిస్తుంది. మలబద్దక సమస్యను తొలిగిస్తుంది.

జీర్ణక్రియ ను మెరుగుపరుస్తుంది, శరీర మెటబాలిజం రేటును పెంచుతుంది.

వీటిలో వుండే యాంటీ యాక్సిడెంట్స్ శరీరాన్ని ప్రీరాడికల్స్ బారినుండి కాపాడుతుంది. శరీరానికి హనిచేసే టాక్సిన్స్ ను మలినాలను విసరగించడం లో ఉపయోగపడుతుంది.

ఎముకలను బలంగా చేస్తుంది, క్రీడాకారులకు మంచి ఆహారం.జుట్టు మరియు గొర్ల ఆరోగ్యానికి ఎంతో మేలుచేస్తుంది

మైగ్రేన్, కీళ్ల నొప్పులనుండి ఉపశమనాన్ని కలిగిస్తుంది. మతి మరుపు ని తగ్గించి జ్ఞాపకశక్తిని పెంచుతుంది.

Sharing Is Caring:

Leave a Comment