Puliyabettina Ragi Ambali:ఆరోగ్యకరమైన రాగి అంబలి ఇలా కూడా చేయవచ్చును

Puliyabettina Ragi Ambali:ఆరోగ్యకరమైన రాగి అంబలి ఇలా కూడా చేయవచ్చును

Puliyabettina Ragi Ambali:మ‌నం చిరు ధాన్యాలైన రాగుల‌ను కూడా అప్పుడ‌ప్పుడూ ఆహారంలో భాగంగా తీసుకుంటూ ఉంటాం. వీటిని ఆహారంలో భాగంగా తీసుకోవ‌డం వ‌ల్ల శ‌రీరానికి ఎంతో మేలు క‌లుగుతుంద‌ని మ‌నంద‌రికీ తెలుసు. రాగుల‌ను పిండిగా చేసి ఆ పిండితో మ‌నం జావ‌ను, రొట్టెను మరియు ఉప్మాను చేసుకుని తింటూ ఉంటాం. అంతే కాకుండా రాగుల పిండిని ఉపయోగించి అంబలి కూడా తయారు చేస్తారు. వేసవిలో రాగి అంబలిని తయారు చేసి తాగడం వల్ల శరీరానికి చల్లగా ఉంటుంది. దీన్ని తీసుకోవడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి

రాగి అంబలి తాగడం వల్ల శరీరానికి కావలసిన ప్రతి పోషకం అందుతుంది. మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఇది చాలా ఉపయోగకరంగా ఉంటుంది. రాగి అంబలి తాగడం వల్ల ఎముకలు దృఢంగా తయారవుతాయి. రక్తహీనత సమస్యలు కూడా తగ్గుతాయి. శరీరంలో పేరుకుపోయిన కొవ్వు తగ్గుతుంది. కాబట్టి బరువు పెరగడం తగ్గుతుంది. రాగిని చాలా త్వరగా అంబలిగా తయారు చేయవచ్చు. శరీరానికి బలాన్ని ఇచ్చే ఈ రాగి అంబలి తయారీ చేయడానికి అవసరమైన పదార్థాల గురించి ఇప్పుడు తెలుసుకుందాము

Read More  Broccoli Fry:ఇంట్లోనే ఎంతో ఆరోగ్య‌క‌ర‌మైన బ్రొక‌లీ ఫ్రై చేసుకోవచ్చును

 

Puliyabettina Ragi Ambali:ఆరోగ్యకరమైన రాగి అంబలి ఇలా కూడా చేయవచ్చును

 

రాగి అంబలి తయారీకి కావలసిన పదార్థాలు:-

రాగుల పిండి- 5 టేబుల్ స్పూన్లు
తరిగిన ఉల్లిపాయ- ఒకటి (పెద్దది)
తరిగిన పచ్చిమిర్చి- 4
తరిగిన కొత్తిమీర-కొద్దిగా
తరిగిన పుదీనా – కొంచెం
పెరుగు- ఒక కప్పు
నీరు – 1/4 లీటరు
తగినంత- ఉప్పు.

Puliyabettina Ragi Ambali:ఆరోగ్యకరమైన రాగి అంబలి ఇలా కూడా చేయవచ్చును

రాగి అంబలి తయారు చేసే విధానము:-

ముందుగా ఒక గిన్నెలో రాగి పిండిని తీసుకుని అందులో ఒక క‌ప్పు నీళ్ల‌ను పోసి ఉండ‌లు లేకుండా క‌లిపి ఒక మూతతో కప్పి, కనీసం ఒక రోజు పులియనివ్వండి. తరువాత రోజున పులియ బెట్టిన రాగి పిండిని తీసుకుని మ‌రోసారి బాగా క‌లుపుకొండి.త‌రువాత పెరుగును కూడా ఉండ‌లు లేకుండా బాగా క‌లుపుకోవాలి.

ఇప్పుడు ఒక గిన్నెను తీసుకుని దానిని స్ట‌వ్ మీద పెట్టి వేడి చేసుకోవాలి . ఇప్పుడు అందులో నీళ్ల‌ను పోసి రుచికి త‌గినంత ఉప్పును, త‌రిగిన ప‌చ్చి మిర్చిని వేసి నీళ్ల‌ను బాగా మ‌రిగించుకోవాలి. నీళ్లు మ‌రిగిన త‌రువాత ముందుగా పులియ బెట్టుకున్న రాగి పిండిని వేసి బాగా క‌లిపి మూత పెట్టి 3 నిమిషాల పాటు ఉడికించుకోవాలి . ఇప్పుడు గిన్నె మీద మూత తీసి రాగి పిండి మిశ్ర‌మం ద‌గ్గ‌ర ప‌డే వ‌ర‌కు బాగా ఉడికించి స్ట‌వ్ ఆఫ్ చేసి చ‌ల్లారే వ‌ర‌కు ప‌క్క‌న‌ పెట్టుకోవాలి .

Read More  Barnyard Millet Khichdi: ఆరోగ్యకరమైన ఊద‌ల కిచిడీని ఇలా చేసుకొండి

ఈ మిశ్ర‌మం పూర్తిగా చ‌ల్లారిన త‌రువాత త‌రిగిన ఉల్లిపాయ‌ల‌ను, పుదీనాను, కొత్తిమీర‌ను మరియు పెరుగును వేసి బాగా క‌లుపుకోవాలి. ఇలా ఎంతో రుచిగా ఉండే రాగి అంబ‌లి త‌యార‌వుతుంది. ప‌చ్చి మిర్చి మరియు ఉల్లిపాయ‌తో క‌లిపి దీనిని తీసుకుంటే చాలా రుచిగా కూడా ఉంటుంది. అంతే కాకుండా శ‌రీరానికి కూడా ఎంతో మేలు క‌లుగుతుంది.  రాగి అంబ‌లిని వేసవి కాలంలో తాగ‌డం వ‌ల్ల ఎండ వ‌ల్ల క‌లిగే నీర‌సం త‌గ్గి శ‌రీరానికి శ‌క్తి ల‌భిస్తుంది. శ‌రీరంలో ఉండే వేడి త‌గ్గి చ‌లువ కూడా చేస్తుంది.

Scroll to Top