భృంగరాజ్ తైలం ఎలా తయారు చేసుకోవాలి

భృంగరాజ్ తైలం

భృంగరాజ్ మొక్క వళ్ళ కలిగే  ప్రయోజనాలను మనము తెలుసుకున్నాం.  భృంగరాజ్ తైలం (గుంటగలగర ఆకూ తైలం)  ప్రయోజనాలను పూర్తిగా పొందాలంటే  ఒక మంచి మార్గం. భృంగరాజ్ తైలం ఇంట్లోనే తయారుచేసుకోవచ్చును .
పల్లెటూళ్లలో ఎక్కువగా గా దొరికే ఈ భృంగరాజ్ పట్టణ ప్రాంతాలలో దొరకడం చాల కష్టం.   అన్ని ఆయుర్వేదిక్ స్టోర్స్ లో భృంగరాజ్కూడా  దొరుకుతున్నాయి. అందువల్ల పచ్చి ఆకులూ దొరకకపోతే ఎండిన ఆకులూ లేదా పౌడర్ తో ఈ ఆయిల్ ను తయారుచేసుకోవచ్చును .
భృంగరాజ్ తైలం
కావాల్సిన పదార్థాలు:
ఒక కప్పు- భృంగరాజ్ ఆకులని  బాగా నూరి  మెత్తని ముద్దగా చేసుకోవాలి/భృంగరాజ్ పౌడర్/భృంగరాజ్ ఎండిన ఆకులూ.
కప్పులు- కొబ్బరి నూనె/నువ్వుల నూనె.

తయారుచేసే విధానం:

కొబ్బరి నూనె లేదా నువ్వుల నూనె రెండు  కప్పులు ఒక గిన్నెలో తీసుకొని స్టవ్ మీద పెట్టాలి. దీనిలో 1 కప్పు భృంగరాజ్ నూరిన ఆకూ లేదా పౌడర్ లేదా ఎండిన ఆకులూ వేసి సన్నని మంట మీద 15 నుంచి 20 నిముషాలు వరకు  వేడిచేయాలి. దీని వల్ల ఆకులలోని ఔషధ గుణాలు  అన్ని నూనెలో చేరుతాయి. ఈ ఆయిల్ చల్లారిన తరువాత వడకట్టి ఒక గాజు సీసాలో  నిల్వ చేసుకోవాలి. తలస్నానం చేయడానికి రెండు  గంటల ముందు ఈ నూనెని కుదుళ్ళకి, జుట్టుకి బాగా అప్లై చేసి మసాజ్ చేసుకోవాలి . తరువాత మైల్డ్ షాంపూ తో లేదా హెర్బల్ షాంపూ తో తలస్నానం చేయాలి.ఇలా వారానికి 2 సార్లు చేస్తూ ఉంటె మంచి ఫలితం ఉంటుంది.

ఇలా తరచు  చేయడం వల్ల చిట్లిన జుట్టు తిరిగి ఆరోగ్యాంగా తయారవుతుంది.జుట్టు రాలటం  కూడా తగ్గుతుంది. ఒత్తుగా పెరుగుతుంది. కాంతివంతంగా తయారవుతుంది. తలలో ఫుల్లు, చుండ్రు, పేళ్లు కూడా బాగా  తగ్గుతాయి.

Read More  డెంగ్యూ-జ్వరానికి సంకేతాలు ఏమిటి? తీవ్రతను తగ్గించడానికి ఏమి చేయాలి ?
Sharing Is Caring:

Leave a Comment