Carrot Rice:ఆరోగ్యకరమైన క్యారెట్ రైస్ ను ఇలా తయారు చేసుకొండి
Carrot Rice: మనం తినే రూట్ వెజిటేబుల్స్ లో క్యారెట్ రైస్ ఒకటి. క్యారెట్ గురించి మనమందరం విన్నాము. క్యారెట్ తినడం వల్ల కలిగే ప్రయోజనాలు అన్నీ ఇన్నీ కావు. పీచుపదార్థం అధికంగా ఉండటం వల్ల జీర్ణక్రియ బాగా మెరుగుపడుతుంది. క్యారెట్‌లు విటమిన్ ఎ విటమిన్ సి, బీటా కెరోటిన్ మరియు విటమిన్ కె యొక్క గొప్ప మూలం. కంటి చూపును మెరుగుపరచడానికి మరియు ఎముకల బలాన్ని నిర్వహించడానికి మరియు రక్తంలోని గ్లూకోజ్ స్థాయిలను నియంత్రించడానికి క్యారెట్లు చాలా ప్రయోజనకరంగా ఉంటాయి.
క్యారెట్ ను నేరుగానే చాలా మంది తింటూ ఉంటారు. క్యారెట్ ను ఇతర ఆహార పదార్థాల తయారీలో కూడా ఉపయోగిస్తూ ఉంటారు. పచ్చడి తయారీలో కూడా క్యారెట్‌ను ఉపయోగించవచ్చును . అదనంగా క్యారెట్ ఉపయోగించి క్యారెట్ రైస్ తయారు చేయడం కూడా సాధ్యమే.
క్యారెట్ తో రైస్ ను తయారు చేసుకుని తినడం వల్ల రుచి రుచికి ఆరోగ్యానికి ఆరోగ్యాన్ని పొందవచ్చును . చాలా సులువుగా, రుచిగా క్యారెట్ రైస్ ను ఎలా తయారు చేయాలి.దినిని తయారు చేయడానికి కావలసిన పదార్థాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
క్యారెట్ రైస్ తయారు చేయడానికి కావలసిన పదార్థాలు:-
క్యారెట్ తురుము- ఒక కప్పు
వండిన అన్నం- ఒక కప్పు
సన్నగా తరిగిన ఉల్లిపాయలు – ఒకటి
తరిగిన పచ్చిమిర్చి – 3
జీలకర్ర- అర టీస్పూన్
ఆవాలు -అర టీస్పూన్
జీడిపప్పులు- 10
నెయ్యి- 2 టేబుల్ స్పూన్లు
మిరియాల పొడి – అర టీ స్పూన్
పసుపు – పావు టీ స్పూన్
గరం మసాలా – పావు టీ స్పూన్
సాం బార్ పౌడర్ – 1 టీ స్పూన్
కరివేపాకు – ఒక రెబ్బ
ఉప్పు – తగినంత
తరిగిన కొత్తిమీర – కొద్దిగా
Carrot Rice:ఆరోగ్యకరమైన క్యారెట్ రైస్ ను ఇలా తయారు చేసుకొండి
క్యారెట్ రైస్ తయారు చేసే విధానము:-
మొదటగా స్టవ్ ఆన్ చేసుకోవాలి.తరువాత దాని మీద ఒక కడాయి పెట్టుకోవాలి. కడాయి వేడి అయిన తరువాత దానిలో నెయ్యి వేసుకోవాలి . నెయ్యి కరిగిన తరువాత జీలకర్ర,ఆవాలు, జీడిపప్పు వేసి వేయించాలి. ఇవి వేగిన తరువాత తరిగిన ఉల్లిపాయలు, మిరపకాయలు, కరివేపాకు, పసుపు కూడా వేయాలి. వీటిని అన్నింటినీ బాగా కలిపి వేయించుకోవాలి.
ఆమిశ్రమములో తురిమిన క్యారెట్ వేసి కలిపి ఉడికించాలి. ఇప్పుడు క్యారెట్ తురుము వేగిన తర్వాత గరం మసాలా, మిరియాల పొడి ,సాంబార్ పొడి అలాగే ఉప్పు కూడా కలుపుకోవాలి . ఇప్పుడు ఈ మిశ్రమానికి అన్నాన్ని వేసి బాగా కలిపి 5 నిమిషాల పాటు మూతపెట్టి ఉంచాలి. చివరగా కొత్తిమీరను వేసి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఈ విధముగా చాలా రుచికరమైన క్యారెట్ రైస్ తయారవుతుంది.
ఇది రోజంతా ఎప్పుడైనా తినవచ్చును . క్యారెట్‌లను నేరుగా తినని వారు క్యారెట్ రైస్గా మార్చుకుని, తినడం ద్వారా క్యారెట్‌లను తినడం వల్ల ప్రయోజనాలు మరియు పోషకాలను పొందవచ్చు.